ఇదేమి దొంగాట బాబూ....

దొడ్డిదారిన అధికారం కోసం వైయ‌స్ఆర్‌సీపీ ఓట్ల తొల‌గింపు

బోగస్‌ సర్వే బృందాల‌తో వ్య‌తిరేక ఓట్ల గుర్తింపు

ఓట్ల తొల‌గింపుపై జాతీయ స్థాయిలో వైయ‌స్ జ‌గ‌న్ ఉద్య‌మం

అమ‌రావ‌తి:  వెనకటికొకడు ’ఏరా..పక్కింట్లో కొటుకొస్తున్నావంటే...మనింట్లో ఆటికాటికే వున్నాయిగా...పక్కింట్లోవి కూడా దొబ్బుకొస్తే..మనకిక డబుల్‌ ధమాకేగా?!’ అన్నాడట. 2019 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ముందు, ఆంధ్రప్రదేశ్‌లో అపొజిషన్‌ పార్టీ ఓట్ల తొలగింపు, నకిలీఓట్ల చేర్పు పరిస్థితి అలానే వుంది.  ఈ ఊరూ, ఆ వూరు అనకుండా...ఈ జిల్లా, ఆ జిల్లా అనకుండా...పదమూడు జిల్లాల్లోనూ ...వైఎస్సార్‌పార్టీ మద్దతుదార్ల ఓట్ల తొలగింపులో..అధికార పార్టీ లోపాయికారీగా హస్తలాఘవం చూపిస్తోందని, వార్తా కథనాలు వస్తున్నాయి. ఓ నాలుగైదు, మచ్చుకు మీరే గమనించండి....
ఓట్ల దొంగలొచ్చారు!
అనంతపురం జిల్లా కొత్తచెరువులో సర్వేకు వచ్చిన యువకులను విచారిస్తున్న పోలీసులు అన్నది ఓ వార్త. ఆ వార్తకు కొనసాగింపుగా ఇదిగో ఇలా వివరణ కూడా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సంచరిస్తున్న బోగస్‌ సర్వే బృందాలు. పథకం ప్రకారం విపక్షం ఓట్ల తొలగింపు. వ్యక్తిగత వివరాలు ఆరాతీస్తూ, ట్యాబ్‌ల్లో నమోదు. టీడీపీకి అనుకూలం కాదని తెలిస్తే, ఓటు తొలగింపు. సర్వే బృందాల దగ్గర టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డులు కూడా దొరుకుతున్నాయట. 
విపక్ష మద్దతుదారుల ఇళ్ల వద్దే సర్వే..
అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో పబ్లిక్‌ సర్వే పేరుతో జనవరి 25న వివరాలు సేకరిస్తున్న బెంగళూరుకు చెందిన యువకులను వైఎస్సార్‌సీపీ నాయకులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కొత్తచెరువు, బుక్కపట్నం మండలాల్లో వీరంతా వారం రోజుల పాటు పలు గ్రామాల్లో తిరిగారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఇళ్ల వద్దకు మాత్రమే వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. కొత్తచెరువులో సర్వే చేస్తున్న కొందరు యువకులను వైఎస్సార్‌ సీపీ నేతలు పోలీసులకు అప్పగించారు. గుంతకల్లులో డిసెంబర్‌ 18న రహస్యంగా సర్వే నిర్వహిస్తున్న 40 మంది సభ్యులను కూడా పోలీసులకు అప్పగించారు. హిందూపురంలో స్పార్క్‌ సోషియో పొలిటికల్‌ ఎనాలసిస్‌ అండ్‌ రిఫ్రెష్‌ సెంటర్‌ పేరిట టీడీపీ నాయకులే సర్వేలు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ బూత్‌ కన్వీనర్లు, ప్రజలను ప్రభావితం చేసే నాయకుల వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారు
కేవలం ఎమ్మార్వో స్థాయి అధికారికి మాత్రమే ఉండే అధికారాలను, ట్యాబ్‌లతో తిరిగే టీడీపీ అనుకూల బృందాలకు అప్పగించడం, ప్రజాస్వామ్య వ్యవస్థను రాష్ట్ర సర్కారు ఎలా అపహాస్యం పాలు చేస్తోందో రుజువు చేస్తోందని పరిశీలకులు పేర్కొంటున్నారు.  ‘మీకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? ఎవరంటే ఇష్టం? ఏ పార్టీకి ఓటు వేస్తారు? సాక్షి టీవీ చూస్తారా? ఈటీవీ చూస్తారా?’ అంటూ సర్వే బృందాలు ప్రజల నాడి పసిగట్టి ప్రభావితం చేసేందుకు వివరాలు సేకరిస్తున్నాయి. దీనిపై వైఎస్సార్‌సీపీ శ్రేణులతోపాటు, ప్రజలు తిరగబడుతున్నారు. కొన్నిచోట్ల సర్వే బృందాలను అడ్డుకుని పోలీసులకు అప్పగిస్తున్నా వారిని వదిలిపెట్టాలంటూ అధికార పార్టీ నేతలు తీవ్రంగా ఒత్తిళ్లు తెస్తున్నారు.    
నరసాపురంలో ఆధార్‌ వివరాలు అడుగుతూ...
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఓటరు జాబితాలను సర్వే చేస్తున్న ఓ బృందాన్ని 3 నెలల క్రితం స్థానికులు అడ్డుకున్నారు. 60 మంది యువకులతో కూడిన ఈ బృందం పట్టణంలోని ఓ హోటల్‌లో వారం పాటు మకాం వేసింది. ఓటు ఎవరికి వేస్తారు? మీ కులం ఏమిటి? అని ఆరా తీయడంతోపాటు... ఆధార్‌ వివరాలు సేకరిస్తుండటంతో అనుమానించిన స్థానికులు వారిని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. భారత్‌ టెలీసర్వీస్‌ కంపెనీ నుంచి తాము సర్వే చేస్తున్నామని వారు పేర్కొన్నారు. వారిని విచారించిన అనంతరం పోలీసులు విడిచిపెట్టారు. 
సర్కారుకు వ్యతిరేకంగా సమాధానాలిస్తే ఓట్లు గల్లంతే
వైఎస్సార్‌ జిల్లా పాత కడపలో సర్వే పేరుతో ఓట్లు తొలగిస్తున్న నరేష్, రవి, జగదీష్, సురేష్, బాబు, అశోక్‌కుమార్‌ అనే ఆరుగురు యువకులను  స్థానికులు పట్టుకున్నారు. వారి దగ్గరి నుంచి ట్యాబ్‌లు స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు. వీరంతా అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందినవారుగా చెబుతున్నారు. పబ్లిక్‌ పాలసీ రీసెర్చ్‌ గ్రూప్‌ తరపున సర్వే కోసం తమను నియమించారని, నెలకు రూ.15 వేలు చొప్పున జీతం ఇస్తామని చెప్పారని వారు పేర్కొంటున్నారు. వీరివద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. మూడు దశల్లో ఈ సర్వే సాగుతోంది. ఓటరు కార్డు నంబర్‌ చెబితే సంబంధిత వ్యక్తుల ఇంట్లో ఉన్న ఓటర్ల వివరాలు అందులో కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి అనుకూలంగా సమాధానాలు ఇవ్వని పక్షంలో, మూడో దశలో వారి ఓట్లన్నీ తొలగించి నిష్క్రమిస్తున్నట్లు వెల్లడవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌ ఓటమి భయంతోనే ఈ దొంగ సర్వేలు నిర్వహిస్తూ ఓట్లను తొలగిస్తున్నారని 1వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఇసుకపల్లి చైతన్య, 47వ డివిజన్‌ కార్పొరేటర్‌  పాకా సురేష్‌కుమార్‌ ఆరోపించారు. గత ఎన్నికల్లో కడపలో వైఎస్సార్‌ సీపీకి అత్యధిక మెజార్టీ రావడంతో 1.25 లక్షల ఓట్లను తొలగించారన్నారు. ఓటర్ల జాబితా వివరాలు సర్వే బృందాలకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. 
సర్వే చేసేందుకు వచ్చిన యువకులను చుట్టుముట్టిన వైఎస్సార్‌ జిల్లా చింతకుంట గ్రామస్తులు .......... 
కర్నూలులో బోగస్‌ సర్వే... 29 వేల ఓట్ల తొలగింపు అంటూ మరో వార్త.  
ఎన్నికల వ్యూహంలో ఆరితేరిపోయిన పార్టీ నాయకుడు వుండగా...ఇక ఇలాంటి పనులకు తక్కువేమి వుంటుందని జనం పెద్దగా నోరెళ్లబెట్టడం లేదు. 
‘తూర్పు’ సర్వే బృందాల వద్ద టీడీపీ గుర్తింపు కార్డులు. విపక్షం ఓట్లను తొలగిస్తున్న ఓ బృందాన్ని, తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ శ్రేణులు నవంబరు 12వ తేదీన అడ్డుకున్నాయి. అంబాజీపేట, రాజోలు మండలాల్లోని మాచవరం, వాకలగరవు గ్రామాల్లో 11 మంది యువకులు రెండు బృందాలుగా సర్వే నిర్వహించారు. మాచవరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆరుగురు యువకులను  వైఎస్సార్‌సీపీ నేతలు నిలదీయడంతో ‘సోషియో పొలిటికల్‌ ఎనాలసిస్‌’ (స్పా) సంస్థ నుంచి వచ్చినట్లు వెల్లడించారు. వారిని గుర్తింపు కార్డులు చూపాలని కోరడంతో జి.సాయి, గణేష్, నరేంద్ర, రాహుల్‌ మణికంఠ, వెంకటేశ్వరరావులుగా పేర్లు చెప్పుకున్న వ్యక్తులు పొంతనలేని సమాధానాలిచ్చారు. వారి వెంట వచ్చిన మిగతావారు జారుకోవడంతో అనుమానించిన స్థానికులు ఈ బృందాన్ని అంబాజీపేట పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించి ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు తాటిపాకలోని సాయితేజ లాడ్డిలో తనిఖీలు చేయగా ‘స్పా’ బృంద సభ్యులు అక్కడ ఉన్నట్లు గుర్తించారు. వారి వద్ద టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డులు, ల్యాప్‌ట్యాప్, ట్యాబ్‌లు బయట పడటం గమనార్హం. ఈ సర్వే ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించడంతో ఓ వ్యక్తి పరారైనట్లు వైఎస్సార్‌ సీపీ కో ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు తెలిపారు. 
వైఎస్సార్‌ సీపీ అభిమానుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా గుంటూరు జిల్లాలో గత నాలుగు నెలలుగా సర్వే బృందాలు తిరుగుతున్నాయట. వాళ్ల దగ్గర వాట్సాప్‌ డీపీలో లోకేష్‌ ఫొటో కనిపిస్తుందట.
ఇలా ఎన్నెన్నో వార్తలు...వైకాపా ఓట్ల తొలగింపులో అధికారపార్టీ హస్తలాఘవంపై. నకిలీ సర్వే బృందాలను అడ్డుకుంటే, పట్టుకుంటే, రివర్స్‌లో వారిపైనే కేసులు పెడుతుండటం, అ«ధికార పార్టీ దుస్సాహసమే. ఓటరు బుద్ది చెప్పేంతవరకు అంతేనేమో మరి...అసలింతకూ ఇంత హైరానా అవసమేమిటి?
ఓవైపు అధికారపార్టీపై రోజురోజుకు ప్రజల్లో పెరిగిపోతున్న అసంతృప్తి, మరోవైపు వైఎస్సార్‌కాంగ్రెస్‌పై పెరిగిపోతున్న జనాభిమానం చంద్రబాబుకు బహుశా నిద్రలేకుండా చేస్తుండవచ్చు. తన పాలనలోని డొల్లతనాన్ని ఏవిధంగా సమర్ధించుకోలేనంతగా బాబు కార్నరయిపోయాడు. కానీ చింత చచ్చినా పులుపు చావనట్టు...ఇంకా ఇంకా ఏదైనా చేసి, ఎన్నికల్లో గెలవాలన్న కుయుక్తులే పన్నుతున్నాడు. అందులో అతి ముఖ్యమైనది విపక్షం మద్దతు దారుల ఓట్ల తొలగింపు అన్న పక్కా పచ్చ ప్రణాళికా వ్యూహం. 
అవునుమరి, బాబు అంతగా కష్టపడాల్సిందే. ఎందుకంటే...ఆయన మాటల్లోనే చెప్పాలంటే....పాపం ఆయనగానీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే ...మా పెట్టుబడుల పరిస్థితి ఏంటని విదేశీ పెట్టుబడుదారులు తెగ ఇదైపోతున్నారట. ఏమో మరి...వారు కూడా బాబుగారి స్టయిల్లో...ఆయనలానే నిద్రపోకుండా, ఆయనకూ కునుకన్నదే లేకుండా చేస్తున్నారేమో మరి? ఇంతకూ బాబుగారికి అంత భయం ఎందుకు పట్టుకుంది....? ఎందుకంటే, అంధ్రప్రదేశ్‌ ప్రజల నాడి...నిన్ను నమ్మం బాబూ, అని కొట్టుకుంటోంది మరి.
పి.యస్ః
ఫిబ్రవరి నాలుగున ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌ ఢిల్లీలో చీఫ్‌ ఎలెక్షన్‌ కమిషన్‌ (సీఈసీ)ను కలిసి, ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఓట్ల తొలగింపు వైనాలపై ఫిర్యాదు చేయబోతున్నారు. 
 

Back to Top