టీడీపీ దమనకాండ

వైయ‌స్ఆర్ విగ్రహానికి నిప్పు

బాప‌ట్ల జిల్లా భట్టిప్రోలు మండలం అద్దేపల్లి దళితవాడలో అధికార పార్టీ అరాచ‌కం

బాపట్ల: ఏపీలో టీడీపీ దమనకాండకు, అరాచకాలకు తెరపడటం లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులపై దాడులకు తెగబడుతున్నారు. పలు చోట్ల గత ప్రభుతానికి సంబంధించిన శిలాఫలకాలు,  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు.  

తాజాగా బాపట్ల జిల్లాలో  టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు.  దివంగత నేత వైయ‌స్ఆర్‌ విగ్రహానికి టీడీపీ నాయుకులు నిప్పంటించారు. ఈ ఘటన భట్టిప్రోలు మండలం అద్దేపల్లి దళితవాడలో చోటు చేసుకుంది. రోజురోజుకు పెరుగుతున్న టీడీపీ నేతల అరాచకాలపై వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు  తీవ్రంగా మండిపడితున్నారు.

Back to Top