డేటా చోరీ స్కెచ్చేశారు...ఓట్ల‌ను చెక్కేశారు!

డేటా చౌర్యం సూత్ర‌దారి చంద్ర‌బాబేనా? 

డేటా చోరీ దాని పర్యవసానాలేంటీ?

ఆంధ్రుల ఓట్ల గల్లంతు వెనుక ఉన్న‌దెవ‌రు?

అమ‌రావ‌తి:  రెండు రోజుల నుంచి ఏ  తెలుగు ఛానల్ చూసినా , ఏ పేపర్ తిప్పినా , మనం డేటా చోరీ గురించి చదువుతున్నాం. అసలు ఏమి చోరీ జరిగింది ? బాధ్యులెవరు ? ఎలా చేసారు ? ఇవి సామాన్యుల మెద‌ళ్ల‌లో మెదులుతున్న ప్ర‌శ్న‌లు..వీటికి స‌మాధానం చెప్ప‌కుండా అధికార పార్టీ ఎదురుదాడికి దిగుతోంది. డేటా చౌర్యంతో చంద్ర‌బాబు ఏం సాధించాల‌నుకున్నారో సులభమైన భాషలో చెప్పాలంటే..వాస్త‌వాలు ఇలా ఉన్నాయి..

 ఏమి జరిగింది ?: 
కొన్ని ప్రైవేట్ డేటా అనలిటిక్స్ కంపెనీల సహకారంతో, సర్వే చేయించి, ఎవ‌రెవరు టీడీపీ కి అనుకూలంగా ఉన్నారో, ప్రతికూలంగా ఉన్నారో తెలుసుకుని,  ఒక లిస్ట్ త‌యారు చేసి, ఆ లిస్ట్ ని ఎలెక్టోరల్ డేటా తో మ్యాప్ చేసి, టీడీపీ కి ప్రతికూలంగా ఉన్న వారి పేర్లను తీసేసారు ? .
 ఇందులో దొంగతనం ఎక్కడుంది ?:
ప్రైవేట్ సంస్థలను ప్రభుత్వ సేవలకు ఉపయోగించకూడదా ?
ఆధార్, ఓటర్ లిస్ట్, పాన్ కార్డు - పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కదా ?
   చాలా చోట్ల ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ప్రూఫ్ గా ఇస్తారు 
చోరీ ఎక్కడ జరింగింది ?: 
 కలర్ ఫోటో ఓటర్ కార్డు : మీరెప్పుడైనా కలర్ ఫోటో ఓటర్ కార్డు చూసారా ?  ఎవరిద‌గ్గరైనా బ్లాక్ అండ్‌ వైట్ ఓటర్ కార్డు మాత్రమే ఉంటుంది. 
కలర్ ఫోటో ఓటర్ కార్డు స్టేట్ గవర్నమెంట్ ద‌గ్గర ఉంటుంది.  ఎలక్షన్ కమిషన్ ద‌గ్గర ఉంటుంది.

 బ్లూ ఫ్రాగ్ అండ్ ఐటీ గ్రిడ్ ద‌గ్గరికి కలర్ ఫోటో ఓటర్ కార్డు ఎలా వచ్చింది ?
కేవలం రాష్ట్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ ద‌గ్గర ఉండాల్సిన కలర్ ఫోటో ఓటర్ ఐడీ కార్డులు , ఈ ఐటీ సంస్థలకు ఎవరు ఇచ్చారు ?
ఎలక్షన్ కమిషన్ ఇవ్వలేదు అని చెప్పింది.  రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్పింది.   దొంగతన‌మైతే జరిగింది.  ఇప్పుడు అర్థమైందా దొంగతనం ఎక్కడ జరిగిందో ? ఎలక్షన్ కమిషన్ , రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలర్ ఓటర్ కార్డ్స్ ఇవ్వకపోతే, వీళ్ల ద‌గ్గరికి ఎలా వచ్చాయి ?దొంగతనం చేస్తే వచ్చాయి.  ఇది జరిగిన దొంగతనం.  ఇందుకు కేసు పెట్టారు.

 సీఎం చంద్రబాబుకు ఉలుకెందుకు?
ఇప్పుడు పోలీస్ అడగాల్సిన ప్రశ్న ఒక్కటే . ఐటీ సంస్థలకు కలర్ ఓటర్ కార్డులు ఎవరు ఇచ్చారు ?  ఎలక్షన్ కమిషన్ ఇవ్వక , రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వక ? ఎక్కడ నుంచి వచ్చింది ? చంద్రబాబు ఇచ్చాడా ? లోకేష్ బాబు ఇచ్చాడా ? తెలుగు దేశం పెద్దలు ఇచ్చారా ?

 ఈ డేటా చోరీ ఘట్టంలో ఎవరు పాత్రధారులు?
1. తెలుగు దేశం పార్టీ. 
2. Data  Analytics  సంస్థలు - IT  Grid  & Blue  Frog . 
3. జన్మభూమి కమిటీలు 
4. అంగన్ వాడీ వర్కర్స్. 
5. Seva Mitra App(సేవా మిత్ర యాప్‌)

 ఏంటీ  సేవ మిత్ర  యాప్‌ ?
ప్రభుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఏమ‌నుకుంటున్నారు? అని తెలుసుకోవడానికి టీడీపీ వాళ్ళు ప్రవేశ పెట్టిన "Data  Gathering Mechanism " ఈ సేవ మిత్ర. మీలో చాలా మందికి 1100, 1106 నుండి కాల్స్ వచ్చి ఉంటాయి.

Two Data Sets 

Data Set 1 : Information / Feedback from Seva Mitra App.
Data Set 2 : Color Voter ID Cards with booth level information.
ఈ రెండు డేటా ని ఉపయోగించి డేటా అనలిటిక్స్ సంస్థలు ఏమి చేసాయి ?

 Blue Frog & IT Grid - వీళ్ళు ఏమి చేసారు ? 
పై ట్వీట్ లో చెప్పిన రెండు డేటా సెట్స్ తీసుకుని, Advanced  Analytical Software ఉపయోగించి,  ప్రభుత్వానికి ఎవరు ప్రతికూలంగా ఉన్నారు ?  వారి అడ్రస్, ఓటర్ ID ,ఊరు, ఓట్ వేసే బూత్ నెంబర్, ఇవన్నీ తెలుగు దేశం పార్టీకి చెందిన‌ జన్మభూమి కమిటికి ఇచ్చారు.

జన్మభూమి కమిటీ ఏమి చేసింది ?
ప్రభుత్వానికి ఎవరు ప్రతికూలంగా ఉన్నారన్న లిస్ట్, బూత్ లెవెల్ లో ఉన్న జన్మభూమి కమిటి కి వెళ్లిన తర్వాత. ఈ లిస్ట్ లో ఉన్న ఓటర్లు  ని జాబితా నుంచి తొలగించడానికి అంగ‌న్‌వాడీ వర్కర్స్ ను వాడుకున్నారు.

 అంగన్‌వాడీ వర్కర్స్ ఏమి చేసారు ?
జన్మభూమి కమిటీ నుంచి  వచ్చిన లిస్ట్ లో ఉన్న పేర్లను, కనీసం ఫీల్డ్ వర్క్ కూడా చెయ్యకుండా, గుడ్డిగా ఈ ఓటర్లు ఎవ్వరు ఊరిలో  లేరనో ,  కారణం రాసి , వీళ్ళను  జాబితా నుంచి తొలగించాలని , "E -Seva " లో ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్ కి ఇచ్చేసారు .

 Field Work అంటే ఏమిటి ? ఇంతకముందు ఎవరు చేసే వాళ్ళు ?
మీకు గుర్తు ఉంటె, పాత రోజుల్లో ఊరిలో ఉన్న టీచర్లు మన ఇంటికి వచ్చి, మన గురించి అడిగి మరీ ఓటర్ బుక్ లో టిక్ పెట్టుకునే వారు. 
ఇప్పుడు ఇదే పని టీడీపీ ప్రభుత్వం అంగన్ వాడీ వర్కర్స్‌తో చేయిస్తోంది.
 అంగన్వాడీ వర్కర్స్ ఎందుకు ఇలా చేసారు ?
వీళ్లకు ఊర్లో కొంచం హవా ఉన్న వాళ్ళు కాంట్రాక్టు వర్క్ ఇప్పిస్తుంటారు. ఇక్కడ జన్మభూమి కమిటి వల్ల వీరికి వచ్చింది. మరి జన్మభూమి కమిటీ చెప్పిన విధంగా వింటే, ఇంకొకసారి కాంట్రాక్టు వర్క్ ఇప్పిస్తారు. అంతే, వాళ్ళు ఏమి చెపితే అది చేసేసారు .

 Teacher vs Anganwadi Worker (AW)

Teacher - Qualified, AW - Not Qualified.
Teacher - Govt Employee,  AW - Contract Worker.
Teacher - Responsible as he may loose job if anything wrong is done. 
Teacher - Worked in Election Duty , AW - No Experience in Election duty.

 Accountability ఎక్కడ ?
లిస్ట్ ఇచ్చిన వాడు - ప్రైవేట్ సంస్థ 
ఫీల్డ్ వర్క్ చేసింది - కాంట్రాక్టు వర్కర్ - అంగన్‌వాడీ
డేటా అప్‌లోడ్ - కాంట్రాక్టు వర్కర్ 
Influenced by   - జన్మభూమి కమిటి 
ఎక్కడన్నా ప్రభుత్వం ఉందా ? ఎవడు జవాబుదారీ ?
 ఎవరి Votes లేపేశారు ?
వీళ్ళ  ద‌గ్గర కులాల వారీగా, ప్రాంతాల వారీగా డేటా ఉంది. ప్రతి జిల్లాకు ఒకే విధానం అనుసరించలేదు.  
ఏ కులం ఓట్లు తీసేసారు : రెడ్డి, బ్రాహ్మణ, బీసీ లో కొంత మంది. 
ఏ కులం ఓట్లు తక్కువ ముట్టుకున్నారు  : కమ్మ, కాపు, బలిజ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు

 ఎక్కడ తొల‌గించారు ?

పులివెందులలో  5000 ఓట్లు తగ్గితే జగన్‌కు నష్టమా ?
గాజువాక లో 5000 ఓట్లు తగ్గితే పవన్ కు నష్టమా ? 
ఏ నియోజ‌క‌వ‌ర్గం అయితే కొంచం టీడీపీ కి అనుకూలంగా ఉందో అక్కడ వీళ్లు ప్ర‌తిప‌క్షం ఓట్లు తొల‌గించ‌డానికి ప్రయత్నం చేశారు.

 నియోజ‌క‌వ‌ర్గానికి 10,000 ఓట్లు ?
ఒక్క ఎమ్మెల్యే సీటులో 10,000 ఓట్లు తొల‌గిస్తే ఎంత ప్రమాదం ?
2014లో10,000 కంటే తక్కువ మెజారిటీ తో గెలిచినా ఎమ్మెల్యేలు ఎంత మంది ? ఇది తెలుగు దేశం పన్నిన కుట్ర  కాదంటారా?

 AP Police or CBN Army ?

ఇంత విషయం తెలుసుకున్న లోకేశ్వర్ రెడ్డి అనే సామాజిక కార్య‌క‌ర్త ఫిర్యాదు చేస్తే , అతన్ని అరెస్ట్ చేయ‌డానికి రాత్రికి రాత్రి 200 మంది ఆంధ్ర పోలీసులు హైదరాబాద్ వెళ్లారు. వీళ్ళు పోలీసుల కంటే సీబీఎన్ ఆర్మీ లాగ పనిచేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌మాద‌క‌రం.

 ప్రతిపక్షం చేయగలదా ?
కలర్ ఫోటో తో ఉన్న ఓటర్ కార్డు వాళ్ళ ద‌గ్గరికి ఇస్తే ప్రభుత్వం ఇవ్వాలి, లేక ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి. ప్రతిపక్షానికి ఈ డేటా దొరకడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ప్రతిపక్షం ఇది చేసే ఛాన్స్ లేదు. ఇది కచ్చితంగా టీడీపీ పనే.

 Jurisdiction  

దొంగతనం చేసిన కంపెనీ హైదరాబాద్ లో ఉంది. 
దొంగతనం చేసారు అని కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి హైదరాబాద్ నివాసి . 
మ‌రి కేసు హైదరాబాద్ లో పెట్టక, కుప్పం లో పెడతారా ?  వినేవాడు ఎర్రిపప్ప అయితే, చెప్పేవాడు చంద్రబాబు అని మరోసారి నిరూపించాడు.

 Electoral Data - బాధ్యత ఎవరిది ?
ఒక రాష్ట్రము లో ఎలెక్టోరల్ డేటా అంటే, ఓటర్ల జాబితా సరిగ్గా పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. మన ఆంధ్ర విషయం లో తెలుగుదేశం ప్రభుత్వానిది.

 ఎలక్షన్ ముందు ఏమి జరుగుతుంది ?

ఎన్నిక తేదీ ప్ర‌క‌టించాక, ఎలక్షన్ కోడ్ వచ్చాక, ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓటర్ల జాభితా అడుగుతుంది.

బాధ్యత గల ముఖ్యమంత్రి ఏమి చేయాలి ?
ప్రజలకు భరోసా ఇవ్వాలి. IT  గ్రిడ్ & Blue  Frog  సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టాలి. తక్షణమే ఆ రెండు సంస్థలతో ఉన్న కాంట్రాక్టులు రద్దు చేయాలి. అన్ని విధాలా తెలంగాణ పోలీసుల‌కు సహకరించాలి.

 మన చంద్రబాబు ఏమి చేస్తున్నాడు ?
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని తిడుతున్నాడు.
ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌ను తిడుతున్నాడు. 
ప‌క్క రాష్ట్రంలోని ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను తిడుతున్నాడు. 
 దొంగ పని చేసిన సంస్థలను సమర్థిస్తున్నాడు.

 కచ్చితంగా తప్పు జరిగింది 
చంద్రబాబు  ప్రభుత్వం కచ్చితంగా తప్పు చేసింది.  ఇది చంద్రబాబుకు తెలుసు.  అసలు IT  సంస్థలకు కలర్ ఓటర్ కార్డులు, ప్రభుత్వం ఇవ్వక, ఎలక్షన్ కమిషన్ ఇవ్వక, ఎవరు ఇచ్చినట్టు, ఇది చిన్న విషయం కాదు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేసిన నమ్మక ద్రోహం.

 Conclusion  

ఓట్ హక్కు భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చే శక్తి. దాన్ని హరించాలి అని చూడటం మహా నేరం. రాజ్యాంగం కంటే గొప్పదా తెలుగు దేశం పార్టీ ?

ప్ర‌తి పౌరుడు  తనకు నచ్చిన వారికి ఓట్ వేసే హ‌క్కుదారు కావాలి. 

 

తాజా వీడియోలు

Back to Top