క్రెడిట్ కోసం పవన్ నాయుడి పాట్లు

మూడడుగులు కూడా వేయని లాంగ్ మార్చ్ లో ముప్పావుగంట స్పీచ్ ఇచ్చిన పవన్ నాయుడు మూప్పాతిక వంతు మాట్లాడింది ప్రభుత్వం మీద తన అక్కసుతోనే.  ముఖ్యమంత్రిని, వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఎంపీ విజయసాయి రెడ్డిగారిని విమర్శించడానికీ, తానెంత మేధావో మరోసారి ప్రకటించుకోడానికే పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇచ్చాడు. ముందు మూడు ముక్కలు భవన నిర్మాణ కార్మికుల గురించి, మధ్యలో ఓ సారి వారి కష్టం గురించి చిట్టచివర్లో ఇసుక గురించి మాట్లాడిన పవన్ నాయుడు వారి సమస్యకు పరిష్కారం కూడా సూచిస్తే బావుండేది. 
లక్షల పుస్తకాల జ్ఞానం ఇదేనా?
వర్షాలు, వదరల వల్ల పక్క రాష్ట్రాల్లో ఇసుక కొరతలేదా అని అత్యంత అమాయకంగా అడుగుతున్న పవన్ కళ్యాణ్ ను లక్షల పుస్తకాలు చదివిన అపర మేధావి అని ఆయన్ని గుడ్డిగా అనుసరించే అనుయాయులు అనుకుంటారేమో కానీ వివేకం గల ప్రజలు కాదు. టన్నుల కొద్దీ ఇసుకను గత ప్రభుత్వం తవ్వి తీసి బినామీలకు కట్టబెట్టేసాక, ఇసుక నిల్వలు లేకుండా చేసాక కొత్త ప్రభుత్వానికి ఇసుక కొరత పడకుండా ఎలా ఉంటుంది? గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి 100 కోట్ల జరిమానా పడే స్థాయిలో ఇసుక తవ్వకాలు జరిగాయి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి ఇసుక నిల్వలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మరి తవ్వి పోసిన ఇసుకంతా ఏమైంది?? టీడీపీ నేతల రహస్య స్థలాల్లో బందీ అయ్యింది. ఇసుక అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే పాత సాండ్ పాలసీని రద్దు చేసింది. కొత్త పాలసీని ప్రవేశపెట్టేలోపే వరదల తాకిడి ఎక్కువైపోయింది. ఇందులో ప్రభుత్వ తప్పిదం ఉందా? ఇసుకను రాష్ట్రంనుంచి పక్కరాష్ట్రాలకు తరలించకుండా కట్టుదిట్టం చేసారు. పక్క రాష్ట్రాలనుంచి దిగుమతికి అవకాశం కూడా కల్పించారు. అయినా దేశ వ్యాప్తంగా రియల్ రంగం కుదలై ఉందని, దాని పరిణామంగానే అన్ని రాష్ట్రాల్లోనూ నిర్మాణ రంగంలో మందగించిందని జాతీయస్థాయి సర్వేలు, ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇవేవీ పట్టనట్టు ప్రభుత్వానికి ఇసుక కొరత మరకను అంటగట్టాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్న టీడీపీ, జనసేన పార్టీల నిర్వాకానికి నిన్నటి రాంగ్ మార్చ్ ఒక పరాకాష్ట. 
రాంగ్ మార్చ్
నిజమే ఖచ్చితంగా ఇది రాంగ్ మార్చే. కాళ్లతో నడుస్తూ చేసే కవాతను కాస్తా కారుమీదెక్కి ప్రసంగాలకు పరిమితం చేసి దాన్ని లాంగ్ మార్చ్ గా ప్రచారం చేయడం సిగ్గుచేటు. ఎర్ర తలపాగా కట్టినంత మాత్రానో, చెగువెరా ఫొటో పెట్టుకున్నంత మాత్రానో కమ్యునిస్టు సిద్ధాంతాలు పాటించినట్టు కాదు. పవన్ నాయుడి తాపత్రయం అంతా చంద్రబాబుకు ఎన్ని విధాల మేలు చేకూర్చాలనే తప్ప నిజంగా భవన నిర్మాణ కార్మికులకు సాయం చేయాలని కాదు. రెండు వారాల గడువు అంటూ గడుసుగా చేసిన వాఖ్యల వెనుక వాస్తవాలు చూస్తే ప్రభుత్వం తరఫున రెండు వారాల్లో ఇసుక లోటు ఉండదనే హామీ వచ్చేసింది. వరదలు తగ్గుముఖం పట్టడంతో 15 రోజుల్లో అందరికీ ఇసుక అందుబాటులోకి వస్తుందని సీఎం జగన్ మోహన రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఈ ప్రకటనను బేస్ చేసుకునే పవన్ కళ్యాణ్ రెండు వారాల గడువంటూ సొరకాయ కోతలు మొదలుపెట్టాడు. రేపు ప్రభుత్వం కొరతలేని ఇసుక సరఫరా చేస్తున్నప్పుడు ఇదంతా నా ఘనతే అని ప్రచారం చేసుకోవాలన్నదే ఈ పవన్ నాయుడి ప్లాన్ అయ్యిండొచ్చు. 

Read Also: పవన్‌ అజ్ఞత వాసి కాదు..అజ్ఞాన వాసి 

Back to Top