ముఖ్యమంత్రి పిలుపు..ఎమ్మెల్యేల పలుకు

కరోనా నేపథ్యంలో పేదలకు అండగా వైయస్‌ఆర్‌సీపీ నేతలు 

మాస్కులు, నిత్యావసరాలు పంపిణీ

తాడేపల్లి : కష్టకాలంలోనూ పేదలకోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు స్పూర్తి  కలిగించేలా ఉన్నాయి. తాను అభివృద్ధి, సంక్షేమ, సేవా కార్యక్రమాలు చేపడుతూనే..పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఇచ్చిన పిలుపునకు ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు స్పందిస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలు ఇబ్బందులు పడకూడదని నిత్యావసరాలు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేస్తూ సేవా గుణాన్ని చాటుకుంటున్నారు. ఇప్పటికే సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు డబ్బులు విరాళం ఇచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు క్షేత్రస్థాయిలో పేదలకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి రూ.1000 ఆర్థికసాయంతో పాటు బియ్యం, కంది పప్పు ఉచితంగా పంపిణీ చేసింది. మరో రెండు విడతల్లో పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు.

పెనుమలూరు:
 పెనమలూరు నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో  ఆరు లక్షల రూపాయల వ్యయంతో పదివేల కూరగాయల కిట్లు, 30 వేల కోడిగుడ్లు పంపిణీ చేశారు. వీటిని కంకిపాడు మండలం ఉప్పులూరు నుంచి పంపిణీ చేశారు. ఒక్కో కిట్టులో అయిదు రోజులకు సరిపడా కూరగాయలు ఉన్నాయి.  

పశ్చిమగోదావరి జిల్లా:
తణుకు వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పలువురి వాలంటీర్‌లకు కూరగాయలు, నిత్యావసరాలు, మాస్కులు, శానిటైజర్‌లను ఉచితంగా పంపిణి చేశారు. యలమంచిలి మండలం చించినాడ, నెరేడుమిల్లి గ్రామాల్లో నియోజకవర్గ ఇంచార్జి, డీసీసీబీ చైర్మన్ కవురు శ్రీనివాస్, మండల కన్వీనర్ పొత్తూరి బుచ్చిరాజు.. లాక్‌డౌన్‌ కారణంగా వారం రోజులకు సరిపడగా కూరగాయలు పంపిణి చేశారు.  

అనంతపురం: 
పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి.. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఒక్కో పాత్రికేయుడికి 25 కిలోల బియ్యం, కందిపప్పు, నూనె, గోధుమ పిండి తదితర వస్తువులు అందజేశారు.  

గుంటూరు:
తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్.. 250మంది పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే ప్రకాశంలోని సింగరాయకొండ మండలం ఊళ్ళపాలెం పల్లెపాలెం‌ గ్రామాలలో కొండేపి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ వెంకయ్య సుమారుగా 3లక్షల విలువచేసే నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు.

తాజా వీడియోలు

Back to Top