కాపీ బాబూ.. నాటకాలు ఆపూ

వైయస్‌ జగన్‌ నవరత్నాలను కాపీ కొట్టిన చంద్ర‌బాబు

ఓట‌మి భ‌యంతో చంద్ర‌బాబు యూట‌ర్న్‌

నల్లచొక్కాలు వేసుకొని ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మరు

అమరావతి: తొమ్మిదేళ్లుగా ప్రజలతోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనేక పోరాటాలు చేసింది. ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసిన ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది. దీనస్థితి నుంచి ప్రజలను ఎలా బయటకు తీసుకురావాలి. ప్రజల మొహాల్లో సంతోషం చూడాలనే ఒక సంకల్పంతో వైయస్‌ జగన్‌ నవరత్నాలను ప్రకటించారు. అందులో ఒకటి వైయస్‌ఆర్‌ ఆసరా పథకం. గత ఐదేళ్లుగా ఆంధ్రరాష్ట్రాన్ని పాలిస్తున్న తెలుగుదేశం పార్టీ గ్రూపు రాజకీయాలు, పక్షపాత ధోరణితో ఒక పార్టీకి చెందిన వారికే పెన్షన్లు ఇచ్చారు. ఇది కరెక్ట్‌ కాదు. మన పార్టీ అధికారంలోకి వచ్చాక కులం, మతం, వర్గం చూడం, రాజకీయం చేయం అందరికీ పెన్షన్‌ అందిస్తాం. అది కూడా రూ. 2 వేలకు పెంచుతామని వైయస్‌ జగన్‌ ప్రకటించారు. 

గుంటూరులో జరిగిన ప్లీనరీలో ఆసరా పెన్షన్‌ రూ. 2 వేలకు పెంపు అని ప్రకటిస్తే సంవత్సరన్నర పాటు అది ఎలా సాధ్యమవుతుంది. వైయస్‌ జగన్‌ పథకాలకు అమెరికా బడ్జెట్‌ సరిపోదు అంటూ చంద్రబాబు, ఆయన కోటరీ హేళన చేస్తూ మాట్లాడారు. ఎన్నికలు వస్తున్నాయని, పాదయాత్ర చేసిన వైయస్‌ జగన్‌కు ఫాలోయింగ్‌ పెరిగిపోతుందని, ప్రజలంతా వైయస్‌ జగన్‌ వైపు ఉన్నారని, ఏదో విధంగా వారందరినీ తనవైపుకు తిప్పుకోవాలన్న దురుద్దేశంతో వైయస్‌ జగన్‌ ప్రకటించిన పథకాన్ని కాపీ కొట్టాడు చంద్రబాబు. సాధ్యం కాదన్న చంద్రబాబుతోనే ఆ పెన్షన్‌ అమలు చేయించారు. అధికారంలో లేకపోయినా వైయస్‌ జగన్‌ ఇచ్చిన మాటను అమలు చేయించారు. 

ప్రత్యేక హోదా విషయంలో ఇంతే హోదా సంజీవనా..? హోదా కలిగిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని చంద్రబాబు చులకనగా మాట్లాడినా పట్టువదలని విక్రమార్కుడిలా హోదా కోసం అనేక దీక్షలు, ధర్నాలు, ఆమరణ దీక్షలు చేశారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరాటాలు సాగించారు వైయస్‌ జగన్‌. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఎంపీలతో రాజీనామాలు చేయించి ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయించారు. దీంతో దేశమంతా ఆంధ్రపదేశ్‌ వైపు చూసింది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటాలను తలచుకుంది. హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ అని వైయస్‌ఆర్‌ సీపీని జాతీయ మీడియా కూడా చూపించింది. దీంతో నిద్రపట్టని చంద్రబాబు ఏదో కుట్ర చేయాలని ఢిల్లీకి వెళ్లి వంగి వంగి దండాలు పెడుతూ ఫొటోలు దిగి పచ్చ మీడియా ద్వారా ప్రచారాలు చేయించుకున్నాడు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూసి కంగుతిని నల్లచొక్కాలు వేసుకొని పోరాటాలు చేస్తున్నట్లు ఫోజులు ఇస్తూ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. అయినా చంద్రబాబు దొంగ నాటకాలు నమ్మి ఇంకా ఎవరు మోసపోతారు చెప్పండి. 

 

Back to Top