అధైర్య పడొద్దు.. నేనున్నాను 

 13 మంది అభాగ్యుల సమస్యలు విన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

సత్వర పరిష్కారానికి కలెక్టర్‌కు ఆదేశాలు 

రూ.లక్ష చొప్పున తక్షణ సాయం 

అనకాపల్లి జిల్లా: మానవత్వాన్ని చాటుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోమారు నిరూపించుకున్నారు. శుక్రవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పర్యటనకు వెళ్లిన సీఎం వైఎస్‌ జగన్‌.. దారి వెంబడి తనకు సమస్య విన్నవించుకోవాలన్న ఆర్తితో వచ్చిన వారిని గమనించి, వారి కష్టం తెలుసుకున్నారు.

పరిష్కారానికి సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. అందరికీ మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, తక్షణ సాయంగా రూ.లక్ష చొప్పున సాయం చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఇలా ఏకంగా 13 మంది సమస్యలను ఓపికగా విని, తప్పక పరిష్కరిస్తామంటూ కొండంత భరోసా కల్నించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.    

పాము ప్రసాద్‌  
రావికమతం మండలం జెడ్‌ కొత్తపట్నం గ్రామానికి చెందిన పాము ప్రసాద్‌ సొరియాసిస్‌ వ్యాధితో బాధ పడుతున్నాడు. వైద్యం చేయించుకునే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.   

బొండపల్లి శ్రీ వెంకట దుర్గా నిఖిత 
కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామం రాజగోపాలపురానికి చెందిన బొండపల్లి శ్రీ వెంకట దుర్గా నిఖిత హైపర్‌ కొలెస్ట్రోమియా, సబ్‌ క్లినికల్‌ హైపో థైరాయిడిజమ్‌తో బాధ పడుతోంది. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు తగినంత సొమ్ము లేదని నిఖిత తల్లి ముఖ్యమంత్రికి విన్నవించుకుంది.

అమర్త్య రామ్‌  
నాతవరం మండల కేంద్రానికి చెందిన రెండేళ్ల దేవరకొండ అమర్త్య రామ్‌ పుట్టినప్పటి నుంచి పి ఆర్‌ సిండ్రోమ్‌ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇతడి నాలిక లోపలికి వెళ్ళిపోయి ఊపిరి సలపని వ్యాధితో బాధ పడుతున్నందున తల్లిదండ్రులు తమిళనాడులోని నాగర్‌కోయిల్‌ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.7.5 లక్షలు ఖర్చు పెట్టామని తెలిపారు. తగిన ఆరి్థక స్థోమత లేకపోవడంతో చికిత్స చేయించడానికి ఇబ్బంది పడుతున్నామని సీఎంకు విన్నవించారు.

గట్రెడ్డి నీరజ్‌ 
రావికమతం మండలం కొత్త కోట గ్రామానికి చెందిన గట్రెడ్డి నీరజ్‌ తల్లి తన కుమారుడు బోన్‌ మేరో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కోసం ముఖ్యమంత్రిని కలిసి విన్నవించుకున్నారు. తగినంత డబ్బు లేకపోవడంతో చికిత్స చేయించుకోలేకపోతున్నామని 
తెలిపారు.

చుక్కా శివ పార్వతీ యామిని 
నర్సీపట్నం మండలం పెదబొడ్డేపల్లి గ్రామానికి చెందిన చుక్కా శివ పార్వతి యామిని బైలేటరల్‌ జీను వేరమ్‌ సమస్యతో బాధ పడుతోంది. ఆరి్థకంగా స్థోమత లేకపోవడంతో.. చికిత్స చేయించుకోవడం తమకు సాధ్యం కావడం లేదని తండ్రి సీఎంకు విన్నవించుకున్నారు.

మల్ల రోహిత్‌ 
కశింకోట మండలం గొబ్బూరు గ్రామానికి చెందిన మల్ల రోహిత్‌ మెదడు సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాడు. చికిత్సకు పెద్ద మొత్తంలో ఖర్చు చేశామని, ఆరి్థక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నామని సీఎంకు గోడు వెళ్లబోసుకున్నారు.

పెదపూడి రిషాంత్‌ బాబి వివేక్‌ 
కోటవురట్ల మండలం రాట్నాల పాలెం గ్రామానికి చెందిన పెదపూడి రిషాంత్‌ బాబి వివేక్‌.. సికిల్‌ సెల్‌ ఎనీమియాతో బాధ పడుతున్నాడు. చికిత్స కోసం ముఖ్యమంత్రిని వివేక్‌ తల్లిదండ్రులు కలిసి విజ్ఞప్తి చేశారు.

చింతల ఆకాంక్ష 
అనకాపల్లి మండలం వూడురు (అల్లిఖానూడు పాలెం) గ్రామానికి చెందిన చింతల ఆకాంక్ష గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ డిలేతో ఇబ్బంది పడుతోంది. ఆమెకు వైద్య సాయం అందించాలని కుటుంబ సభ్యులు సీఎంను కోరారు.

నరం రాజబాబు 
నాతవరం మండలం గుమ్మడిగరడ గ్రామానికి చెందిన నరం రాజబాబు అంధత్వంతో బాధ పడుతున్నాడు. పేదవారమైన తమను మీరే ఆదుకోవాలని కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని వేడుకున్నారు.

అందలూరి యేసుబాబు 
నర్సీపట్నం మండల కేంద్రంలోని గొర్లివీధికి చెందిన అందలూరి యేసుబాబు బ్లడ్‌ కేన్సర్‌తో బాధ పడుతున్నాడు. మెరుగైన చికిత్స చేయించడానికి తమ వద్ద డబ్బులు లేవని సీఎంతో చెప్పుకున్నారు.

నిడదవోలు సుబ్బలక్ష్మి 
నర్సీపట్నం మండలం పినరిపాలెం గ్రామానికి చెందిన నిడదవోలు సుబ్బలక్ష్మి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతోంది. మెరుగైన చికిత్సతో పాటు ఆరి్థకంగా ఆదుకోవాలని సీఎంను కోరారు.

పెట్ల పరిమళ 
గొలుగొండ మండలం కొత్త ఎల్లవరం గ్రామానికి చెందిన పెట్ల పరిమళ చేతులు, కాళ్ల వంకర సంబంధిత  వ్యాధితో బాధ పడుతోంది. మీరే ఆదుకోవాలని కుటుంబ సభ్యులు సీఎంను వేడుకున్నారు.

గుడివాడ జస్మిత 
నర్సీపట్నం మండలం వేమలపూడి గ్రామానికి చెందిన గుడివాడ జస్మిత తలసేమియా వ్యాధితో బాధ పడుతోంది. తగినంత ఆర్థిక స్థోమత లేదని సీఎంకు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.      

తాజా వీడియోలు

Back to Top