నేడు వైయ‌స్ఆర్ సున్నా వడ్డీ పండుగ

వరుసగా మూడో ఏడాది 9.76 లక్షల స్వయం సహాయక సంఘాలకు లబ్ధి

నేడు ఒంగోలులో బటన్ నొక్కి వడ్డీ సొమ్ము జమ చేయనున్న సీఎం జగన్‌

1,02,16,410 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.1261 కోట్లు

ఇప్పటి వరకు ఈ పథకం కింద రూ.3,615 కోట్లు చెల్లింపు

అమరావతి: స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని వరుసగా మూడో ఏడాది వైయ‌స్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద నేడు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. తద్వారా 9.76 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,02,16,410 మంది అక్కచెల్లెమ్మలకు లబ్ధి కలుగనుంది. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఒంగోలులో బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో రూ.1,261 కోట్ల వడ్డీ సొమ్ము జమ చేయనున్నారు. ఈ సొమ్ముతో కలిపి ఇప్పటి దాకా ఈ పథకం కింద రూ.3,615 కోట్లు సాయం అందించినట్లవుతుంది.

ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం పలు చర్యలు
ఇదిలా ఉండగా, వివిధ పథకాల ద్వారా పొందిన లబ్ధితో మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఐటీసీ, హెచ్‌యూఎల్, పీఅండ్‌జీ, రిలయెన్స్‌ రిటైల్, అమూల్, ఆజియో–రిలయెన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, మహేంద్ర అండ్‌ ఖేతి వంటి కంపెనీలతో ఒప్పందాలు కుదర్చడంతో పాటు రుణాల కోసం బ్యాంకులను అనుసంధానం చేసింది. వడ్డీ శాతాన్ని 13.50  నుంచి 9.50 – 8.50 శాతంకు తగ్గించేలా బ్యాంకులను ఒప్పించింది. అమూల్‌ సహకారంతో పాల ద్వారా అదనపు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంది.  

ప్రభుత్వమే వారి భారాన్ని భరిస్తూ..
బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల్లోని పేదింటి అక్కచెల్లెమ్మల మీద ఏ మాత్రం వడ్డీ భారం పడకుండా, ప్రభుత్వమే వారి తరఫున వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద ఆ భారాన్ని భరిస్తుంది. ఎంత వడ్డీ అవుతుందో అంత మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది.

సున్నా వడ్డీ కింద చెల్లింపులు ఇలా...

2016-17
చెల్లించాల్సిన వడ్డీ రూ.980 కోట్లు
ప్రభుత్వం చెల్లించింది రూ.382 కోట్లు

2017-18
చెల్లించాల్సిన వడ్డీ
రూ.1,134 కోట్లు.
ప్రభుత్వం చెల్లించింది రూ. 0

2018-19
చెల్లించాల్సిన వడ్డీ రూ.1327 కోట్లు
ప్రభుత్వం చెల్లించింది రూ.0

2019-20
ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ
రూ.1258 కోట్లు, ప్రభుత్వం చెల్లించింది రూ.1258 కోట్లు

2020-21 
ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ
రూ.1,096 కోట్లు, ప్రభుత్వం చెల్లించింది రూ.1,096 కోట్లు

2021-22
ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ రూ.1261 కోట్లు. ప్రభుత్వం చెల్లించింది రూ.1261 కోట్లు

 వైఎస్‌ఆర్‌ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్‌ సున్నా వడ్డీ, దిగ్గజ కంపెనీలు, బ్యాంకులతో సమన్వయం ద్వారా అందించిన సహకారంతో అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.7వేల నుంచి రూ.10వేల వరకు అదనపు ఆదాయం, అమూల్‌తో ఒప్పందం కారణంగా  మార్కెట్లో పోటీ పెరిగి  లీటర్‌ పాలనపై రూ.5 నుంచి రూ.15వరకు అదనపు ఆదాయం లభిస్తోంది.

 బ్యాంకర్లతో చర్చలు జరిపి పొదుపు సంఘాలకు ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇప్పించడంతోపాటు రుణాలపై వడ్డీ రేట్లు సైతం 13.50 శాతం నుంచి 9.50 శాతం - 8.50 శాతంకు తగ్గించేలా బ్యాంకులను ఒప్పించిన జగన్‌ ప్రభుత్వం.  దీంతో అక్కచెల్లెమ్మలకు ఏకంగా రూ.1224 కోట్ల మేర వడ్డీ భారం తగ్గడమే కాకుండా  ..అక్కచెల్లెమ్మలు  ఏటా రూ.25 వేల  కోట్లకు పైగా  రుణాలు అందుకుని వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటూ ..రుణాల రికవరీలో సైతం 99.27 శాతంతో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి, సుస్థిరమైన జీవనోపాధులతో ఆర్థిక పరిపుష్టిని సాధించారు.
 
 గత ప్రభుత్వం

స్వయం సహాయక సంఘాలకు రుణాలు మాఫీ చేస్తామని, రుణాలు కట్టొద్దని గత ప్రభుత్వం హయాంలో అక్కచెల్లెమ్మలకు మాట ఇచ్చి మాఫీ చేయకపోవడంతో, అక్కచెల్లెమ్మలు ఆ రుణాలు కట్టని కారణంగా 2014 నాటికి రూ.14, 204  కోట్లుగా ఉన్న మహిళా సంఘాల అప్పులు అసలు, వడ్డీ కలిసి తడిసి మోపెడై 2019 ఎన్నికల నాటికి SLBC  తుది నివేదిక ప్రకారం రూ.25,517 కోట్లకు చేరాయి. 

ఒక వైపు రుణాలు మాఫీ చేస్తానని చేయకపోగా, అక్టోబర్ 2016 నుంచి సున్నా వడ్డీ పథకం సైతం గత ప్రభుత్వం రద్దు చేయడంతో అప్పులు తడిసి మోపెడై  చాలా సంఘాల అప్పుల ఊబిలో కూరుకుపోయిన దుస్థితి..ఫలితంగా 18.36 శాతం మహిళా సంఘాలు అవుట్ స్టాండింగ్ అప్పులతో నిరర్థక ఆస్తులు (NPA)గా మిగిలి పోగా ...చాలా సంఘాలు నిర్వీర్యమైపోయాయి. ఏ గ్రేడ్‌లో ఉన్న సంఘాలు సీ, డీ గ్రేడ్‌లకు పడిపోయాయి

  మన ప్రభుత్వం

మహిళలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు పాదయాత్రలో చూసి చలించి, అప్పుల ఊబిలో కూరుకుపోయి నిర్వీర్యమైన పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను ఆదుకునేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ ఆసరా  పథకానికి శ్రీకారం చుట్టి ఎన్నికల తేదీ (11-04-2019) నాటికి SLBC తుది నివేదిక ప్రకారం 7.97 లక్షల మహిళా సంఘాలలోని 78.76 లక్షల అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.25,517 కోట్లను 4 విడతల్లో నేరుగా  వారి పొదుపు ఖాతాల్లో జమ చేస్తున్న వైయ‌స్ జగన్ ప్రభుత్వం. ఇప్పటికే 2 విడతల్లో దాదాపు రూ.12,759  కోట్లు పొదుపు  సంఘాల అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ.
 జగనన్న ప్రభుత్వంపై నమ్మకం బలపడటం వల్ల అక్కచెల్లెమ్మల స్వయం సహాయక సంఘాల సంఖ్య గతంలో ఉన్న 8.71 లక్షల నుంచి 9.76 లక్షలకు పెరిగింది.

తాజా వీడియోలు

Back to Top