‘చెత్త‌’మ‌నేని రౌడీయిజం

చింతమ‌నేని ప్ర‌భాక‌ర్ నాయ‌కుడు కాదు..రౌడీ షీట‌ర్‌

ఓ రౌడీషీట‌ర్‌కు విప్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టిన చంద్ర‌బాబు

చింత‌మ‌నేనికి ద‌ళితులంటే మొద‌ట్నించీ చిన్న‌చూపే

అమ‌రావ‌తి: అత‌డు నోరు తెరిస్తే మురుక్కాల‌వ‌. మాట్లాడితే అహంకార‌పు కంపు. చేతిలో ప‌వ‌రు, చేత‌ల్లో పొగ‌రు. నాయ‌కుడు కాదు రౌడీ షీట‌ర్ అని ప్ర‌జ‌లే కాదు చ‌ట్ట‌మూ అంటోంది. ఖ‌ర్మ‌కాలి అలాంటి వాడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఒక నియోజ‌వ‌ర్గ ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్. ప‌ద‌వుల‌నెక్కి విర్ర‌వీగుతున్న ఈ చింత‌మ‌నేని ఆ పేరుతోకంటే చెత్త‌మ‌నేనిగానే ఎక్కువ ప్ర‌చారం తెచ్చుకుంటున్నాడు. చింత‌మ‌నేనికి ద‌ళితులంటే మొద‌ట్నించీ చిన్న‌చూపు. అధికారులంటే చుల‌క‌న‌. సాధార‌ణ ప్ర‌జ‌లంటే లెక్క‌లేనితనం. చ‌ట్టం, వ్య‌వ‌స్థ అంటే అవ‌హేళ‌న‌. ప‌దుల సంఖ్య‌లో కేసులు మీద ఉన్నా, జైలు శిక్ష‌లు ప‌డ్డాస‌రే తీరుమార్చుకోని రౌడీయిజం చింత‌మ‌నేనిది. తాజాగా వివ‌క్షాపూరిత వాఖ్య‌ల నేప‌థ్యంలో చింత‌మ‌నేని తీరుపై ద‌ళితులు పెద్దఎత్తున నిర‌స‌న తెలుపుతున్నారు. 

మీరు వెనుక‌బ‌డ్డ‌వారు, ద‌ళితులు మీకెందుకు ప‌ద‌వులు, అవి మాకోసం అంటూ చింత‌మ‌నేని మాట్లాడిన మాట‌లు సంచ‌ల‌నం అయ్యాయి. ద‌ళితుల‌కు రాజ్యాధికారం అక్క‌ర్లేదు అంటూ కించ‌ప‌రిచేలా మాట్లాడిన చింత‌మ‌నేనిపై ఎట్రాసిటీ కేసు పెట్టాల్సిందే అంటున్నాయి ద‌ళిత సంఘాలు. చింత‌మ‌నేని ద‌ళితుల‌పై ఇలా విరుచుకుప‌డ‌టం కొత్తేం కాదు. అదినాయ‌కుడు చంద్ర‌బాబే ఎస్సీలుగా ఎవ‌రైనా పుట్టాల‌నుకుంటారా అన్నాడు క‌నుక తాము కూడా అదే బాట‌లో వెళ్లాల‌న్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నాడీ ఎమ్మెల్యే. ఇసుక అక్ర‌మ తవ్వ‌కాలను అడ్డుకున్నందుకు ద‌ళిత మ‌హిళా తాసిల్దారును జుట్టుప‌ట్టుకుని కొట్టడం. ఎస్సీ యువ‌కుల‌పై త‌న వ‌ర్గంతో దాడిచేయించ‌డం. జాన్ అనే కార్మికుడిపై చేయిచేసుకోవ‌డం. ఫారెస్ట్ అధికారుల‌ను బెదిరించ‌డం. మంత్రిపైనే తిర‌గ‌బ‌డ‌టం. ఇవ‌న్నీ చింత‌మ‌నేని జీవిత‌చ‌రిత్ర‌లో చెరిగిపోని చెత్త ఘ‌ట్టాలు. గ‌న్న‌వ‌రం, ఏలూరు, పెద‌వేగి, దెందులూరు, హ‌నుమాన్ జంక్ష‌న్, ముసునూరు, కైక‌లూరు పోలీస్టేష‌న్ల‌లో ప‌దుల సంఖ్య‌లో కేసులున్న ఈ పెద్ద‌మ‌నిషి చివ‌ర‌కు ప‌క్షుల‌ను, జంతువుల‌ను హింసించిన కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు. వన్య‌ప్ర‌,ఆణి అభ‌యార‌ణ్య చ‌ట్టాల కింద‌కూడా ఈ ప్ర‌జాప్ర‌తినిధిపై కేసులు న‌మోదై ఉన్నాయి.

ద‌ళితుల ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డం, ఇంట్లోనే అనుచ‌రుల‌తో కొట్టించ‌డం, రోడ్డుమీద స్వ‌యంగా చేయిచేసుకోవ‌డం వంటివ‌న్నీ ఇత‌డి నిర్వాకాలు. ఇంత జ‌రుగుతున్న ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేకత వ‌స్తున్నా చింత‌మ‌నేని త‌న తీరు మాత్రం మార్చుకోవ‌డం లేదు. క‌నీసం ముఖ్య‌మంత్రి స్పందించి చింత‌మ‌నేనిపై చ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లాలు కూడా లేవు. పైగా ఎమ్మార్వో వ‌న‌జాక్షి వ్య‌వ‌హారంలో ఆమెను బెదిరించి, భ‌య‌పెట్టి కేసును నీరుగార్చేసింది చంద్ర‌బాబే. ద‌ళితుల‌ను వేధించి, హింసించి, అవ‌మానించే టిడిపి నేత‌ల్లో చింత‌మ‌నేని మొద‌టి స్థానంలో నిలుస్తాడు. 

తాజా ఘ‌ట‌న‌లో అయితే ద‌ళితుల‌పై అనుచిత వాఖ్య‌లు చేసిన చింత‌మ‌నేని వారికి క్ష‌మాప‌ణ చెప్ప‌క‌పోగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న బాధితుల‌పై రివ‌ర్సులో కేసులు పెట్టాడు. త‌న‌ను ట్రోల్ చేస్తున్నారంటూ పోలీస్ స్టేష‌న్లో కంప్లైట్ ఇచ్చాడు చింత‌మ‌నేని. ద‌ళితుల‌ను కించ‌ప‌రుస్తూ, వారి ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ‌తీస్తున్న‌దే కాక అధికారంలో ఉన్నందుకు, పోలీసుల‌ను అడ్డుపెట్టుకుని త‌ప్పుల‌ను క‌ప్పి పుచ్చుకుంటున్నాడు. ఏం చేసినా చెల్లుతుంద‌నే చింత‌మ‌నేని తీరును ద‌ళితులు, ద‌ళితేత‌రులు కూడా ఛీ కొడుతున్నారు.  

తాజా ఫోటోలు

Back to Top