చేదు పాలనతో ముగిసిపోతున్న అసెంబ్లీ కాలం

సరిగా అమలైన సంక్షేమ పథకమంటూ ఒక్కటైనా వుందా?

అందరికీ అందిన అభివృద్ది ఫలమేమైనా వుందా? 

ప్రజల సమస్యలపై చర్చిద్దామన్నప్పుడల్లా జగన్ పై వ్యక్తిగత దాడి

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు

అసెంబ్లీని బహిష్కరించి ప్రజల మధ్యే వైయస్ జగన్

 

 

2014 జూన్‌ 19వ తేదీ.

సాధారణంగా అనేక మలుపులతో కథ సాగుతున్నప్పుడు...ఆసక్తిగా వున్నా, సస్సెన్స్‌గా వున్నా...అబ్బో కథలో ఎన్నెన్ని మలుపులో...అనుకుంటుంటాం. 2014లో మొదలై, 2019లో అడుగుపెట్టిన ఏపీ కథలో ఐదేళ్ల పేజీలు. గ్రహణం పట్టిన  రోజులు...ముసురు పట్టిన రోజులు...గంపెడాశలు ఆవిరయిన రోజులు...నమ్మకాలు వమ్మయిన రోజులు...కోటలు దాటిన మాటలు చెవులను తూట్లు పొడిచిన రోజులు...ఆచరణలో అడుగైనా ముందుకు పడని సంక్షేమ పథకాల రోజులు...కొండెక్కిన ఆరోగ్యశ్రీ, ఉసూరుమంటున్న 108, 104లు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దౌర్భాగ్యాల రోజులు... ఇలాంటివన్నీ ఒకెత్తయితే, గిట్టుబాటు ధరలందక, రుణమాఫీ మాయచీకట్లు అలుముకున్న రోజులు, డ్వాక్రా బాధితుల రోజులు...ఏడాది కాలెండర్లలో ...డేట్లకొద్దీ కోట్లకోట్ల కన్నీటి చుక్కల అమావాస్యచీకట్లు...ఇలా ఐదేళ్ల కాలెండర్లలో49 నెలల పేజీలు చిరిగిపోయాయి. పాలనా కాలంలో మిగిలిన మూడునెలల కాలెండర్‌ పేజీలను చించేస్తానంటున్నాడు బాబు. డేట్లవారీగా మరీ పథకాల, హామీల స్కెచ్‌లతో రౌండప్‌ చేస్తున్నాడు. ఈ ఐదేళ్ల కాలంలో ఇంతకన్నా ఏమన్నా జరిగిందా? 1490 రోజులు గడిచిపోయాయి. సరిగా అమలైన సంక్షేమ పథకమంటూ ఒక్కటైనా వుందా? అందరికీ అందిన అభివృద్ది ఫలమేమైనా వుందా? 

విభజనానంతరం...జూన్‌ 19, 2014...పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ మొదటి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. 175మంది అసెంబ్లీ సభ్యులు. వారిలో 67మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు. అధికారపక్షంగా టీడీపీ. ప్రతిపక్షంగా వైయస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ. అంతా బానే వుంది. బాబు అబద్దాలతో నమ్మించారు. చేయలేనిది చెప్పలేనన్న జగన్‌ విపక్షనాయకుడయ్యారు. 40 ఏళ్ల సీనియారిటీతో...జగన్‌ బాబెంత అనుకున్నారో ఏమోగానీ, బాబుగారు అండ్‌ కో...అసెంబ్లీ సమావేశాల సాక్షిగా అనేకసార్లు జగన్‌ ప్రజల సమస్యలపై చర్చిద్దామన్నప్పుడల్లా వ్యక్తిగత దాడి చేశారు. సాక్ష్యాలతో సహా ప్రజల కష్టనష్టాలను ఏకరువు పెట్టే ప్రయత్నం చేస్తే...అల్లరల్లరి చేశారు. విపక్షం చెబుతున్నది వినే సహనమూ చూపించలేదు. అందులో ప్రస్తావించిన ప్రజాసమస్యలను అటెండ్‌ అయిన పాపానా పోలేదు. అసలు తాత్కాలిక అసెంబ్లీ విపక్షనాయకుడి పొడనే గిట్టని స్థితికి చేరుకున్న టీడీపీ ప్రభుత్వం...ఇక వినదు...పట్టించుకోదు...ఈ సభ ద్వారా సాధించేది ఏమీ లేదనుకున్న జగన్‌ జనం బాట పడితే..దాన్నీ ఎగతాళి చేసింది. అసెంబ్లీ నుంచి పారిపోయాడు అంది. చట్టసభలంటే గౌరవం లేదు అంది. వైయస్ఆర్సీపీ  నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలతోనూ, మంత్రులను చేసిన వారితోనూ జగన్‌పై మాటల దాడి చేయించింది. ఫిరాయింపుదారులైన ఆ 23మంది ఎమ్మెల్యేలపై వేటు వేయండి...గంటలో సభలో వుంటామని ప్రతిపక్షనేత గట్టిగా చెబితే, పట్టించుకున్న పాపాన పోలేదు కానీ...బురదచల్లడమే పనిగా పెట్టుకుంది. తనకు అలవాటయిన అబద్దాల ప్రచారంతో విపక్షాన్ని కార్నర్‌చేసే ప్రయత్నాలు చేస్తూనే పోయింది. 

వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్ప దీక్షను పట్టాడు. జనంతో యాత్రను మొదలు పెట్టాడు.  341రోజులు ఎండనక, వాననకా, వణికించే చలిని, మండే ఎండల్ని లెక్క చెయ్యకుండా ప్రజల సమస్యల్ని వింటూ పోయాడు. జనంతో మమేకమైపోయాడు. ప్రజల మధ్యనుంచే సమస్యల్ని ఎత్తిచూపాడు. పచ్చపాలనలోని డొల్లతనాన్ని పట్టిచూపాడు. 3648 కిలోమీటర్ల మేర సాగిన సుదీర్ఘపాదయాత్రతో ప్రజాసమస్యలు ఆమూల నుంచి ఈ మూలదాకా తెలిసిపోయాయి. చీకటితెరలు వీడిపోతున్న వైనాల్ని కనిపెట్టిన అధికారపక్షం మెల్లగా విపక్షం దారిలోకి కొచ్చి, కాపీ కొట్టేయడం మొదలుపెట్టింది. శ్రద్దగా విపక్షనేత జనం సమస్యలు వింటుంటే, ప్రజలు ఆకాంక్షలు తెలుసుకుంటుంటే, దొంగగా అన్నీ వినింది. అప్పటిదాకా మూలన పడేసిన ప్రత్యేకహోదా మాటను నెత్తికెత్తుకుంది. అక్కచెల్లెమ్మలను గుర్తుచేసుకోవడం మొదలుపెట్టింది. యువత ఆశల్ని పట్టేసింది. అంతమాత్రమే చేసింది. అంతకన్నా చేసేది కనిపించక, అప్పటిదాకా అంటకాగిన కేంద్రప్రభుత్వంపై తప్పంతా నెట్టేసి, అప్పటిదాకా తిట్టిన కాంగ్రెస్‌ చంకన ఎక్కేసింది టీడీపీ. ఇది ఐదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన తంతు. ఇక ఎన్నికల ముందు బాబుగారి మాయలు, తాయిలాలు పంచడాలు మామూలే.

ఇప్పుడు ఏపీలో అటు విలువలు, విశ్వసనీయతే ప్రాణమంటూ నిలిచిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ....

ప్రజల కన్నా రాజకీయప్రయోజనాలే పరమావధి అంటూ నిలిచిన టీడీపి పార్టీ.

2019లో అంతిమ తీర్పు ప్రజలదే. ఆ తీర్పు మంచి మార్పు దిశలో వుంటుందనీ, ప్రజలందరూ ’మనందరి ప్రభుత్వం’ అని గర్వంగా చాటే రోజు వస్తుందని...ఆకాంక్షల ’గుడ్‌ హోప్‌’కు గుడ్‌లక్‌. 

Back to Top