చరిత్ర రాసిన సంకల్పం

చరిత్రలో కొన్ని ఘటనలు ఎప్పటికీ నిలిచిపోతాయి. మరిచిపోని చరిత్రగా మిగిలిపోతాయి. కొన్ని ఘటనలు మాత్రం చరిత్రలను తిరగరాస్తాయి. జ్ఞాపకాలను పునరావృతం చేస్తాయి. ప్రామాణికతలను పోల్చి చూస్తాయి. గత కీర్తిని, భవిష్యత్ స్ఫూర్తినీ పోలిక చేసి చూపిస్తాయి. వైయస్ జగన్ మోహన్ రెడ్డి జరిపిన ప్రజాసంకల్ప పాదయాత్ర అలాంటి ఓ ఘటనే. చరిత్రరాస్తున్న సంకల్ప కావ్యం ఇది. అందరి కోసం ఒక్కడు నిలిచి, ఒక్కని కోసం అందరు కలిసి అనే శ్రీశ్రీ మాటలకు అపలైన అర్థాన్ని చూపింది ప్రజాసంకల్పయాత్ర.
ఆ అడుగులు అందరికోసం
ఆ అడుగులు ఓ మార్పుకోసం ముందుకు సాగుతున్నాయి. అందరి కన్నీళ్లను తుడిచేందుకు సాగుతున్నాయి. మీకోసం అంటూ ఒకరున్నారనే భరోసా ఇచ్చేందుకు సాగుతున్నాయి. ప్రజాప్రస్థానాన్ని గుర్తుకు తెస్తూ సాగుతున్నాయి. పేదల కోసం, కాడె బరువౌతున్న రైతన్నల కోసం, కాయకష్టం చేసుకునే కూలీల కోసం, కష్టాల సుడిగుండాన చిక్కిన ఆడపడుచుల కోసం, చిన్నారుల భవిత కోసం, రేపటి భవిష్యత్తు రాసే యువత కోసం అతడి అడుగులు సాగుతున్నాయి. తండ్రి అడుగుజాడలు ఆ ప్రజల దిక్కునే సూచించాయి అంటారు వైయస్ జగన్. జగమంత కుటుంబం ఇచ్చిన తండ్రికి ఆ కుటుంబ బాధ్యతను నిర్వహించడమే తానందించే అసలైన నివాళి అంటారు. అందరూ తనవారే, అందరికోసం తానే అని సాగే అతడి అడుగులు కొత్త రేపటికి దారులు. 
అందరూ అతడి కోసం
ఓ నవ్వు మరో నవ్వును పూయిస్తుంది. ఓ దీపమే మరో దీపాన్ని వెలిగిస్తుంది. అతడి రాకే కోట్లాది మంది కదలికకు శ్రీకారం అయ్యింది. పొలాల్లోంచి పరుగు పరుగున వచ్చి చేతులు పట్టుకున్నా, కదిలే బస్సుల్లోంచి చేతులు చాచి పిలిచినా, గుడి, బడి అనే తేడా లేకుండా అణువణువూ జనమే అయి ప్రభంజనం సృష్టించినా అది అతడి కోసమే. ఆ నాయకుడి అడుగులో అడుగేయడం కోసమే. అన్నా జగనన్నా అంటూ ప్రతిధ్వనించిన ఆ నినాదం యువనేతకు జయజయధ్వానం. అతడి కోసం ఆశగా ఎదురుచూసే కన్నులు, అతడే తమ ఆశ అని నమ్మే గుండెలు, అతడి అడుగులే తమ భవితకు రహదారులు అంటున్నారు ప్రజలు. 
విశ్వాసమే ఊపిరిగా
కాలం పరీక్షలు పెట్టింది. న్యాయం అతడి పంచన నిలబడేందుకు ఎదురుచూస్తోంది. ధర్మం గెలుపుకు దగ్గరలో ఉంది. దేవుడినే నమ్మాడో, ప్రజలే దేవుళ్లని నమ్మాడో...అతడి నమ్మకమే బలమైంది. ప్రజలే తన ఆశయమని నమ్మాక, నమ్మకానిదే గెలుపని విశ్వసించాక ఏ పరీక్షలకూ అతడు తల వంచలేదు. ఆ నిబ్బరమే అతడిని నిలబెట్టింది. ఈ నేలపైనా, ప్రజల గుండెల పైనా కూడా. ప్రజలే తన బలమని అతడు నమ్మాడు, ఆ ప్రజలు సైతం మా ఆశాదీపం అతడే అని జైకొట్టారు. గెలుపుకు పునాది నమ్మకం అయితే నాయకుడిగా ప్రజల మనసులను అతడెప్పుడో గెలుచుకున్నాడు. ప్రజలే అతడిని గెలిపించుకునేలా నమ్మకాన్ని సాధించుకున్నాడు.   
పోరాటమే వైఖరి
రైతు కన్నీటిని తుడిచేందుకు అతడు దీక్షకట్టి పోరాడాడు. యువత భవితను కాలరాయద్దని పోరాటం చేసాడు. నీరే ఆధారం అని జలదీక్ష చేసాడు . రాష్ట్ర భవిష్యత్తుకు సంజీవని హోదా అని, దాన్ని సాధించి తీరాలని ప్రతిజ్ఞచేసాడు. పాలకుల దుర్నీతిపై, నాయకుల అవినీతిపై అశ్త్రంగా ఎగిసిపడ్డాడు. సహనం అతడి సుగుణం, సమరం అతడి సాధన. సంకల్పం అతడి ఆచరణ.  
సంకల్ప బలం 
3600 కిలోమీటర్లకు పైగా అతడు నడిచాడు. అలుపు లేకుండా, అడ్డంకులకు కుంగిపోకుండా, అవాంతరాలను లెక్కచేయకుండా. అంతులేని ప్రజాభిమానం, అవధులేని ఆదరణ అతడి వెన్నంటి నిలిచాయి. అయినా కించిత్ అహంకారం ఆ వ్యక్తిత్వంలో లేదు. కాస్తైనా గర్వం అతడి మాటల్లో పొడచూపలేదు. ఉన్నదల్లో ఒక్కటే. జనం కోసం నేను అన్న సిద్ధాంతం. అందుకే అతడు మాత్రమే అనగలిగాడు నా గెలుపు ప్రజలందరి గెలుపు. ఓటమి ఎదురైతే అది నా ఒక్కడికి మాత్రమే మీరిచ్చిన తీర్పు అని. సంకల్పమే శ్వాసగా ఉన్న వ్యక్తికే ఈ మాటలు సాధ్యం. ఈ ఆచరణ సుసాధ్యం. 
ఇడుపుల పాయలో మొదైలన ప్రజాసంకల్పయాత్ర జైత్రయాత్రగా మారి ఇచ్ఛాపురంలో విజయకేతనం ఎగురవేస్తోంది. ఇది రేపటి గెలుపుకు నాందీ ప్రస్తావన కాబోతోంది. ఇందుకు సజీవంగా నిలిచిన ఆ ప్రజా సంకల్పమే సాక్షి. దాన్ని ఆదరించి వెన్నంటి నిలిచి గెలిపించిన అశేష ప్రజాభిమానమే అసలైన సాక్షి. 
 

Back to Top