చంద్రన్న ఇసుక పురాణం

గుంటూరు జిల్లా,  పాత బొమ్మువాని పాలెం, కొల్లిపర మండలం ఒక  ఇసుక రీచ్ నుండే రోజుకు 200 ట్రాక్టర్ల చొప్పున 3 నుండి 4 ఏళ్ళు నిరంతరంగా ఉచిత ఇసుక పేరుతో వంద కోట్ల రూపాయల పైన  పచ్చ నాయకులు పచ్చిగా దోసుకున్నారంటే.. చంద్ర‌బాబు పాల‌న‌లో రాష్ట్రంలో ఇసుక దోపిడీ ఎలా జ‌రిగిందో అర్థం చేసుకోవ‌చ్చు.  పట్టా భూముల్లో ఇసుక మేట పేరుతో దోపిడీ, అనుమతులకు మించి వందల రెట్లు ఇసుక తీత  లాంటి విచ్చలవిడి వ్యవహారాలు అడుగడుగునా క‌నిపించిన‌వే. ఆఖ‌రికి చంద్ర‌బాబు ఇంటి వెనుక కృష్ణ న‌దిలో విచ్చ‌ల‌విడిగా జ‌రిగిన ఇసుక త‌వ్వ‌కాలపై నేష‌న‌ల్ గ్రీన్ ట్రైబ్యున‌ల్ ప్ర‌భుత్వానికి వంద కోట్ల జ‌రిమానా కూడా విధించిందంటే ఇసుక దోపిడీ జాతీయ స్థాయిలో ఏ విధంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నిలేదు. 

ఇసుక పాల‌సీతో అడ్డుక‌ట్ట‌
జూన్, 2019 లో కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వానికి అప్పటికే పూర్తిగా చెడిపోయిన వ్యవస్థను బాగుచేయడం, తక్షణమే ఇసుక దోపిడీ పూర్తిగా అరికట్టి అధోపాతాళానికి పడిపోయిన రాష్ట్ర ప్రతిష్టను కాపాడవలసిన బాధ్యత పడింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దోపిడీకి ఆస్కారం లేకుండా ఇసుక పాలసీ తీసుకురావాల‌ని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించడం జరిగింది. నిలువు దోపిడీ జరుగుతున్నప్పుడు కళ్ళు లేని , మూగబోయిన పక్షిలా మారిన అనుకూల మీడియా, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం తెలిసికూడా  కొద్దిగా ఉన్న ఇసుక కొరతను భూతద్దంలో చూపించి సక్రమం గా నడుస్తున్న పాలనను గతి తప్పేటట్టు చేయాలనుకోవడం మన రాష్ట్రానికి పట్టిన దౌర్బాగ్యం. 

ముఖ్యమంత్రి జ‌గ‌న్ చెప్పినట్టు నూతన ఇసుక విధానం 5, సెప్టెంబర్ నుండి అమలులోకి వచ్చింది. గత ప్ర‌భుత్వ హ‌యాంలో అందుకున్న ధ‌ర‌ల కంటే దాదాపు 50 శాతం త‌క్కువ‌కు ఇసుక‌ను అంద‌జేసేలా ప్ర‌భుత్వం విధివిధానాలు రూపొందించింది. నిష్పాక్షికంగా, అవినీతిర‌హితంగా అంద‌రికీ ఇసుక అందజేయాల‌న్న ల‌క్ష్యంతో ఆన్‌లైన్‌లోనే ఇసుక‌ను బుక్ చేసుకునేలా వీలు క‌ల్పించారు. దీనివ‌ల్ల అటు ప్ర‌జ‌ల‌కు కానీ, ఇటు ప్ర‌భుత్వానికి కానీ ఎలాంటి న‌ష్టం క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకున్నారు. జ‌గ‌న్‌మోమ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ఈ ఇసుక విధానం ఇసుకాసురుల క‌డుపు మంట‌కు కార‌ణ‌మైంది. అప్ప‌టిదాకా దొరికింది దొరిక‌న‌ట్టు మింగిన ఇసుకాసురులు ఇక‌పై త‌మ ఖ‌జానాలో కాసుల గ‌ల‌గ‌ల‌లు ఉండ‌వ‌న్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేక చంద్ర‌బాబు డైరెక్ష‌న్‌లో ప్ర‌భుత్ంపై బుర‌ద జ‌ల్లేందుకు పూనుకున్నారు. స‌ర్వ‌దా ఎల్లో ప‌క్ష‌మైన అనుకుల మీడియా అందుకు తందానా అన‌సాగింది. 
ఇసుక సరఫరాను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్లను , అమరావతిలో ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని నియమించడం ఆహ్వానించదగ్గ పరిణామం.  ఒకవైపు జోరున వాన‌లు కురుస్తున్నా ఇసుక తీత పెరిగింది, స్టాక్ యార్డులలో ఇసుక సరఫరా పెరిగింది  అని ప్రజలు చెప్పుకోవడం ముఖ్యమంత్రి కార్యదక్షతకు నిదర్శనం.  కానీ ఇవేవీ ఎల్లో మీడియా క‌ళ్ల‌కు క‌న‌ప‌డ‌వు. ప్ర‌జ‌ల ప్ర‌శంస‌లు విన‌ప‌డ‌వు. నిజాలు చెప్ప‌డానికి ప‌చ్చ గొట్టాలు ప‌నిచేయ‌వు. 
ఏ రాష్ట్రంలోనైనా మామూలే..
సాధార‌ణంగా ఏటా వ‌ర్షాకాలంలో మూడు నాలుగు నెల‌ల‌పాటు ఇసుక కొర‌త ఉండ‌టం మామూలే. ఈ నాలుగు నెల‌ల‌పాటు భ‌వ‌న నిర్మాణాలు కూడా వేగంగా జ‌ర‌గ‌వు. వర్షం వ‌ల్ల క‌లిగే అంత‌రాయాలుర, న‌ష్టాల‌ను దృష్టిలో ఉంచుకుని బిల్డ‌ర్లు సైతం భారీ నిర్మాణాల‌కు సాహ‌సించ‌రు. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా ఇదే ప‌రిస్థితి ఉంటుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇందుకు మిన‌హాయింపు మాత్రం కాదు. 40 ఏళ్ల అనుభ‌వ‌మున్న మేధావికి ఇది తెలియ‌ని విష‌యం కాదు. కాకపోతే చిన్న స‌మ‌స్య‌ను భూతద్దంలో చూపించ‌డం ద్వారా రాధ్ధాంతం చేసి బుర‌ద జ‌ల్ల‌డ‌మే ఆయ‌న ల‌క్ష్యం. పైపెచ్చు త‌న హ‌యాంలో ఇసుక కొర‌త అనేది లేద‌ని చెప్పుకునే చంద్ర‌బాబు... ఒక్క చుక్క వాన లేక నేల‌లు బీళ్లుగా మారిపోయిన సంగ‌తిని దాచాల‌నుకుంటున్నారు. కానీ ప్ర‌జ‌ల ఆలోచ‌నా శ‌క్తిని చంద్ర‌బాబు చాలా త‌క్కువ‌గా అంచ‌నా వేస్తున్నారు. 
జ‌గ‌న్‌కు పేరు రావొద్ద‌నే..
ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేసింది మొద‌లు రాష్ట్రంలో వ‌ర్షపాతం అమాంతం పెరిగింది. మూడు నెలలుగా కురుస్తున్న కుండపోత వర్షం వల్ల మన జలాశయాలు నిండుకుండల్లా మారడం చూసి జగన్మోహన్ రెడ్డి హస్తవాసి, రాష్ట్రానికి శుభచూసకం అని జ‌నం మాట్లాడుకోవ‌డం చంద్ర‌బాబును అస‌హ‌నానికి గురిచేస్తోంది. ఆఖ‌రుకి రాయ‌ల‌సీమ‌లోనూ ఊహించ‌ని విధంగా వ‌ర్ష‌పాతం న‌మైదైంది. గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని విధంగా భూగ‌ర్భ నీటి మ‌ట్టం పెరిగింది. సోమశిల ప్రాజెక్టు నీటితో క‌ళ‌క‌ళ‌లాడుతోంది. క‌రువుకు కేరాఫ్‌గా ఉండే అనంత‌పురం జిల్లాలో వ‌ర్ష‌పాతం గ‌రిష్ట స్థాయిలో న‌మోదైంది. 
ఇచ్ఛాపురం నుంచి త‌డ వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో  వ‌ర్ష‌పు చుక్క‌కు త‌డ‌వ‌ని నేల ఒక్క అడుగు కూడా లేదంటే అతిశ‌యోక్తి కానేకాదు. దీనిపై రైతుల్లో స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. కార‌ణ‌మైదైనా జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా అడుగుపెట్ట‌గానే కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్నాయ‌ని, దానికితోడు ఉద్యోగ విప్ల‌వంతో రాష్ట్రం ద‌శ తిరిగిపోయింద‌ని మాట్లాడుకోవ‌డం చంద్ర‌బాబుకు నిద్ర‌లు లేని రాత్రుల‌ను మిగుల్చుతోంది. ఇలాంటి నేప‌థ్యంలో జ‌గ‌న్ పాల‌న‌పై  ఎలాగైనా బుర‌ద‌జ‌ల్లాలన్న ల‌క్ష్యంతోనే ఇసుకను బూచిగా చూపిస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది.

Read Also: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి 

Back to Top