చంద్రం చెవిలో అచ్చెం

వరుస క్రమం ప్రకారం అచ్చెం నాయుడు గారిని తన సీటులో కూర్చోమని అధికార పార్టీ నేతలు కోరినప్పుడు చంద్రబాబు చాలా అసహనం ప్రదర్శించాడు. ప్రతిపక్షం వారికి నచ్చినట్టు కూర్చునే అవకాశం ఇవ్వాలని, అదే సభా సంప్రదాయం అని చెప్పుకొచ్చాడు. నలభై ఏళ్ల అనుభవం ఉన్నందుకు తనకు నచ్చినట్టు నడుచుకునే ప్రివిలేజ్ కావాల్సిందే అంటూ పట్టుబట్టాడు. ఎల్‌.కే.జీ పిల్లలు కూర్చున్నట్టు నచ్చిన చోట, నచ్చినవాళ్లతో కూర్చోవడం కుదరదంటూ స్పీకర్ వారించి అచ్చయ్యను వెనుక వరసలోని ఆయన సీటుకు పంపించారు. ఆవేశంలో అన్నీ తప్పులు, అసలు నిజాలు బయటకు చెప్పేసే అలవాటు చంద్రబాబుది. ఇప్పుడు పక్కన అచ్చెం నాయుడు లేకపోవడంతో సభలో బాబుగారి మాటలు తడబడిపోతున్నాయి. లింగమనేని గెస్టు హౌజ్ తనదే అని, ప్రజావేదిక తనదే అని చెప్పుకొచ్చారు చంద్రబాబు. బాక్ బెంచుకెళ్లిన అచ్చెంనాయుడు ప్రజావేదిక ప్రభుత్వానిది అని, లింగమనేని ఇంటిని సొంత ఇల్లుగా చెప్పకూడదని చంద్రబాబుకు వెనక నుంచి కాషన్ ఇచ్చారు. దాంతో కాస్త తడబడి సర్దుకున్న చంద్రబాబు నే ఉంటున్న ఇల్లు నాది కూడా కాదు అంటూ సవరించుకున్నారు.
ప్రజా వేదికను ప్రజాధనంతో నిర్మించినా తన పార్టీ అవసరాలకే ఎక్కువగా వాడుకున్నారు చంద్రబాబు. చివరకు అధికారం దూరం అయ్యాక కూడా ఆ వేదికను తెలగుదేశం పార్టీకి కేటాయించాలని కోరుతూ ముఖ్యమంత్రికి లేఖ కూడా రాసారు. పేరుకు ప్రజా వేదిక కానీ బాబుగారి సొంత ఆస్తిలా దాన్ని భావించేవారు. అందుకే అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు, ఆవేశంతో ఊగేటప్పుడూ ఫ్లోలో అవే మాటలు చెప్పేసారు చంద్రబాబు. ఈ మాటలను కంట్రోల్ చేసేందుకు, బాబుకు వెనకనుండి సలహాలిచ్చేందుకే అచ్చంనాయుడిని పక్కనే కూర్చోబెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ మొదలైనప్పటి నుంచీ అచ్చంనాయుడిని పక్కనే కూర్చోబెట్టుకున్నది బాబు తన నోటివాటాన్ని కంట్రోల్ చేయడానికన్నమాట. చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదని  ప్రతిపక్షం అని జగన్ మోహనరెడ్డి గుర్తు చేయాల్సి వస్తుంటే, లింగమనేని గెస్టు హౌజ్ తనది కాదని, ప్రజావేదిక కూడా పార్టీది కాదని అచ్చెం నాయుడు బాబుకు గుర్తు చేయాల్సివస్తోందన్నమాట. పక్కనే కూర్చును చెవిలో ఊదే అవకాశం లేకపోవడంతో అచ్చెంనాయుడు వెనుక సీటు నుంచే సలహాలివ్వాల్సి వస్తోంది. బాబు బండారం ఇలా బట్టబయలౌతోంది.  

Back to Top