విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిన చంద్రబాబు!

టెన్త్, ఇంటర్‌లో టార్గెట్లు పెట్టి ఎవరికి మేలు చేశారు?

ముఖ్యమంత్రి మాటలకు వక్రభాష్యాలు చెప్పడం దేశంలోని విపక్షాల్లో ఒక్క టీడీపీకి మాత్రమే సాధ్యం

అమ‌రావ‌తి: ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రగతికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఇచ్చినా, తెలుగుదేశం పార్టీ దానికి వక్రభాష్యం చెబుతుంది. ఆ అభివృద్ధి చంద్రబాబు నాయుడు హయాంలో పడిన పునాదుల వల్లే సాధ్యమైందని బుకాయిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ లో కాలేజీల్లో చేరిన వారి సంఖ్య 2018–19తో పోల్చితే 2019–20లో 8.64 శాతం పెరిగిందని ఇటీవల జగనన్న విద్యాదీవెన నిధులు లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల సందర్భంగా వైయ‌స్ జగన్‌ గారు వెల్లడించారు. వెంటనే టీడీపీ రంగంలోకి దిగి, ఉమ్మడి ఏపీలో 2000 సంవత్సరంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన ఒక విద్యా పథకం వల్లే ఇది సాధ్యమైందని ప్రకటించింది. అంతేగాక, కాలేజీలో చేరే విద్యార్థుల సంఖ్య జగన్‌ పాలనలో పెరగలేదనట్టు బుకాయించే ప్రయత్నం చేసింది. రాష్ట్ర సీఎంగా శ్రీ వైయ‌స్ జగన్‌ కు తన ముందు కాలంలో జరిగిన ప్రగతి లేదా వెనుకబాటుతనం గురించి వివరించి, విశ్లేషించే అధికారం, బాధ్యత ఉన్నాయి. ఏపీ ముఖ్యమంత్రి బాపట్లలో గురువారం చెప్పిన ఈ శుభవార్తపై వెకిలిగా స్పందించింది తెలుగుదేశం పార్టీ. ఇలాంటి బుకాయింపులు, ముఖ్యమంత్రి మాటలకు వక్రభాష్యాలు చెప్పడం దేశంలోని విపక్షాల్లో ఒక్క టీడీపీకి మాత్రమే సాధ్యమని పదే పదే నిరూపించుకుంటున్నారు. ఈ ధోరణి తెలుగు ప్రజలకు హానికరమేగాక అవాంఛనీయం కూడా.

బాబు హయాంలో ఉత్తీర్ణతా శాతాలు ముందే నిర్ణయించారు! 

విద్యారంగంలో ప్రగతి అనే ముఖ్యాంశం ఇప్పుడు చర్చకు వచ్చింది కాబట్టి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సర్కారు ఏం వెలగబెట్టిందో పరిశీలిద్దాం. తాను సీఎం అయ్యాక 1999 అక్టోబర్‌ లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో, చంద్రబాబు తన రెండో హయాంలో విద్యారంగాన్ని భ్రష్టుపట్టించారు. వరంగల్, చిత్తూరు వంటి అనేక జిల్లాల్లో పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన సమయంలో విద్యాశాఖ అధికారులకు ఉత్తీర్ణతా శాతాలను టార్గెట్లుగా పెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ఒక్కసారిగా పాస్‌ పర్సంటేజ్‌ రెండు రెట్లు పెంచేశారు. ఎందుకిలా చేస్తున్నారని సూటిగా ప్రశ్నిస్తే, జిల్లాల వారీగా టెన్త్, ఇంటర్‌ పరీక్షల ఉత్తీర్ణతా శాతం బాగా పెరిగితే ప్రపంచబ్యాంకు సహా అనేక అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి అప్పులు కుప్పలు తెప్పలుగా వస్తాయని చంద్రబాబు చెప్పేవారు. ఇలా ఇతర రంగాలకు మళ్లించే రుణాల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకున్నారు చంద్రబాబు నాయుడు. ఆయనగారి రెండో పాలనలో ముఖ్యంగా విద్యారంగంలో చేసిన తప్పుల ప్రభావం ప్రజలపై ఇంకా ఉందని వేరే చెప్పాల్సిన పనిలేదు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top