చంద్రబాబుకెందుకో ఉలిక్కిపాటు

– కేటీఆర్‌ వచ్చి జగన్‌ని కలిస్తే తప్పా...

చంద్రబాబు వెళ్లి కేసీఆర్‌ను ఎన్నిసార్లు కలిశారు

టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం వెంపర్లాడింది బాబు కాదా

ఓటమి భయంతో చంద్రబాబు మనస్థాపం

చంద్రబాబు ఊహల్లో తనను తాను శ్రీకృష్ణుడిగా భావించుకుంటాడో ఏమో.. తను ఏం చేసినా లోక కల్యాణం కోసమేనని చెప్పుకోవడం అలవాటు. అదేపని తనకి గిట్టని వారు చేస్తే మాత్రం.. అదో తప్పుడు నిర్ణయం.. చేతకాని పని.. దేశద్రోహం.. అని విరుచుకుపడిపోతుంటాడు. చంద్రబాబు ఏదైతే గొప్పపనిగా చెప్పుకుంటాడో.. దాని లోతుల్లోకి వెళ్లి చూస్తే మాత్రం మేడి పండు వలిస్తే పురుగులు బయటపడినట్టు.. అన్నీ లొసుగులô  కనిపిస్తాయి. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, నూతన అసెంబ్లీ భవనం, నోట్ల రద్దు తర్వాత చంద్రబాబు వ్యాఖ్యలు... ఇలా ఏ పని చూసినా దాని వెనుక దోచుకున్న అవినీతి సొమ్ము గురించే ఎవరైనా ప్రశ్నిస్తారు. 

సక్సెస్‌ మంత్రం అని చెప్పుకునే పనులు కూడా గతంలో ఎవరో చేసినవే ఉంటాయి తప్ప తన సొంత తెలివి తేటలతో చేసింది ఒక్కటీ ఉండదు. ౖఅలాంటివి ఏవైనా ఉన్నాయంటే అద ఖచ్చితంగా తన పబ్లిసిటీ కోసమో.. తన కుటుంబ కంపెనీలకు డబ్బులు సంపాదించి పెట్టేవో ఉంటాయి ఖచ్చితంగా. హైదరాబాద్‌ను కనిపెట్టిన కొలంబస్‌లా.. మహా నగరాన్ని నిర్మించిన కులీకుతుబ్‌షాహీలా, హైటెక్‌ సిటీని కట్టిన మేధావిలా, రాష్ట్రానికి పెట్టుబడుల వరదలు పారించిన ఆర్థిక వేత్తగా కలరింగ్‌ ఇచ్చుకోవడం చాలా సందర్భాల్లో చూశాం. 

గడిచిన కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే అస్తిత్వం కోసం చంద్రబాబు పడే పాట్లు స్పష్టంగా అర్థమవుతాయి. నాలుగున్నరేళ్లుగా ఏ పనీ చేయకుండా కేవలం మాటలతో, ఎల్లో మీడియాలో వార్తలతో కాలక్షేపం చేసిన బాబు.. ఓటమిని ముందే ఊహించాడు. ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబు విఫలం చెందిన విషయాన్ని ఏపీ ప్రజలు గుర్తించారు. హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అని నాలుగేళ్లు జనాన్ని నమ్మించడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాలను జనం ఛీదరించుకున్నారు. ఎన్నికలకు ముందు ప్యాకేజీ పదేళ్లు ఏం సరిపోతుంది.. పదిహేనేళ్లు కావాలన్న బాబు డాంభికాలను పోల్చి చూసిన జనాలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లుగా వ్యవహరిస్తున్న తీరుతో జనం విసిగిపోయారు. ఈ నేపథ్యంలో హోదా సాధించలేకపోయిన చేతకానితనాన్ని తమ మీద లేకుండా చేసి.. బీజేపీని బలి పశువును చేయాలన్న వ్యూహంతో ఎన్నికలకు ఏడాది ముందు ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుని కొత్త డ్రామా మొదలు పెట్టాడు చంద్రబాబు.

బీజేపీతో కలిసి ఉన్నంతకాలం కాంగ్రెస్‌ పార్టీని నవ నిర్మాణ దీక్షలు పేరుతో బహిరంగ సభలు పెట్టి మరీ తిట్టిపోశాడు. సోనియా గాంధీపై శివాలెత్తిపోయాడు. రాహుల్‌ ఏపీకి వస్తానంటే అడ్డుకోవాలని హుకుం జారీ చేశాడు. బీజేపీతో బయటకొచ్చాక సీన్‌ రివర్స్‌ అయ్యింది. కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరయ్యాడు. నవ నిర్మాణ దీక్షలకు పేరు మార్చి ‘ధర్మ పోరాట దీక్షలు’ అని పేరు చెప్పి కాంగ్రెస్‌తో కొత్త కాపురం పెట్టాడు. కాంగ్రెస్‌తో పొత్తు చిగురించిన క్షణం నుంచి బాబుకు ఏపీపై ప్రేమ, బీజేపీపై ద్వేషం పుట్టుకొచ్చాయి. దేశం కోసం ఉన్నపలంగా ఏదో ఒకటి చేయాలని కోరిక పుట్టింది. అందుకే మోడీ విదేశాల్లో ఉన్న టైం చూసుకుని అర్జెంటుగా ఢిల్లీ వెళ్లి ప్రెస్‌ మీట్‌ పెట్టి మోడీని తిట్టేసి వచ్చాడు. ఆ వెంటనే ఓ పది ట్వీట్లు.. అంతే ఢిల్లీ పోరాటం ముగిసింది. వారానికోసారి జిల్లాకో మీటింగ్‌ పెట్టి టెంట్‌ కుర్చీలు వేసి మోడీని నాలుగు తిట్లు తిట్టి.. భజన బృందాలతో ప్రతిపక్ష నేత జగన్‌ను ఇంకో నాలుగు తిట్టించి భోజనాలు చేసి వస్తారు. ఆర్డరిచ్చిన శాలువాలు, తిరుపతి లడ్డూలు రాగానే విమానానికి ఆయిల్‌ కొట్టించుకుని ఖాళీగా ఉన్న నలుగురు నాయకుల్ని కలిసి వస్తాడు.

ఎందుకు వెళ్లాడో తెలీదు.. ఏం సాధించాడో తెలీదు. కానీ చెప్పేది మాత్రం ఒకటే మాట. దేశాన్ని కాపాడటానికే అని.. ఎన్‌డీఏలో కొత్తగా చేరిన చంద్రబాబు.. అప్పటికే ఉన్న భాగస్వామ్య పార్టీలను కలిసొచ్చి తానే అందర్నీ కలిపేసినట్టుగా బిల్డప్‌ ఇచ్చుకోవడం.. పచ్చ మీడియాలో బ్యానర్‌ వార్తలు, బ్రేకింగ్‌లు ఇచ్చేయడం తప్ప సాధించింది శూన్యం. కాంగ్రెస్‌ నాయకులను కలుస్తాడు.. బీజేపీ వాళ్లను తిడబతాడు. అయినా వారిని టీటీడీలో బోర్డు మెంబర్లుగా నియమిస్తాడు. కాంగ్రెస్‌తో తెలంగాణలో పొత్తు పెట్టుకుంటాడు. కాంగ్రెస్‌ కోసం ప్రచారానికి వచ్చి కలిసుందామని కేసీఆర్‌ని అడిగినా వాళ్లు ఒప్పుకోలేదని సిగ్గులేకుండా కాంగ్రెస్‌ ప్రచార రథం మీది నుంచి మాట్లాడతాడు. జనసేన, వైయస్‌ఆర్‌సీపీ కలుస్తున్నాయంటాడు.. కలిసి పోటీ చే ద్దామని పవన్‌ కల్యాన్‌కు ఆఫరిస్తాడు. ఆంధ్రా అభివృద్ధికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ అవరోధంగా మారాడని ఘీంంకరిస్తాడు.. అదే టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం వెంపర్లాడతాడు. కేసీఆర్‌ పిలిస్తే యాగానికి వెళ్తాడు.. రాజధాని నిర్మాణానికి విమానమిచ్చి రమ్మంటాడు. ఇంటికెళ్లి శాలువా కప్పుతాడు.. కనీసం ఒక్కసారి కూడా కేసీఆర్‌తో కలవని జగన్‌ని మాత్రం మీరిద్దరూ కలుస్తున్నారని ఉలిక్కి పడుతుంటాడు. దేశద్రోహం అన్నట్టు పార్టీ వాళ్లని,  మీడియా వాళ్లని పిలిచి ప్రెస్‌ మీట్‌లు పెడతాడు. చంద్రబాబు ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఆంధ్రాలో ఎన్నికలు ముగిసే వరకు నిద్రాహారాలు కూడా ఉండవనిపిస్తుంది. 

తాజా వీడియోలు

Back to Top