బాబు ప్రేమ పిపాసి అతడే..!

‘’నన్నేమైనా అనండిం నా చంద్రబాబును మాత్రం ఏమీ అనొద్దు! అంటే గింటే నేనే అంటాను. ఎందుకంటే నేను ఏమనాలో, ఎంత వరకు అనాలో, ఎంత విరోధంన టించాలో నాకు బాబే చెప్తారు కాబట్టి’’. ఇదీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు. ఎంత దాచి పెడదామన్నా చంద్రబాబుపై ఆయన ప్రేమ బయట పడుతూనే ఉంది పాపం. నాలుగేళ్ల సంసారం కదా!...అంత తేలిగ్గా ఉన్న ప్రేమలేనట్టు నటించమంటే కాస్త కష్టమే మరి. ఏదో కాస్తో కూస్తో నటుడు కాబట్టి ఆ మాత్రమైనా నెట్టుకొస్తున్నాడు అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. 
చంద్రబాబు గారూ..??? అంటూ మీటింగుల్లో అప్పుడప్పుడూ మర్యాద పూర్వకమైన పూనకం చూపించే పవన్, ఎప్పటికైనా ఆగూటి పక్షేనని మరోసారి రుజువైంది. తెనాలి సభలో మాట్లాడుతూ చంద్రబాబుపై విపరీతమైన ప్రేమ కురిపించాడు కల్యాణ్. కెసిఆర్, చంద్రబాబుపై కక్షసాధిస్తున్నారట.

అందుకోసమే జగన్తో కలిశాడట. నవ్వుతారనే కనీస స్పృహ కూడా లేదు. లేకపోతేం ఏ కక్షసాధింపుకోసం చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో కూటమి కట్టాడు? ఏ కక్ష సాధింపుకోసం సిద్ధాంతాల కేతిలోదకా లిచ్చి కాంగ్రెస్పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ఏ కక్షసాధింపు కోసం హరికృష్ణ కూతుర్ని ఓడిపోయే చోట నిలబెట్టి అవమానం చేశాడు. ఏ కక్షసాధింపు కోసం తెలంగాణలో ప్రచారం చేసి కాంగ్రెస్కి ఉన్న సీట్లు కూడా రాకుండా చేశాడు? ఇదంతా మర్చిపోయి..ఇప్పుడు కెసిఆ ర్బాబుపై కక్షసాధిస్తున్నాడని బాధపడిపోవడం బాబుపై ప్రేమ కాకమరేంటి? దీనికి రాజకీయంపులమాలి కాబట్టి మళ్లీ జగన్పేరుతీసుకురావడం.

ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ‘’నన్నుకాపాడాల్సిన బాధ్యత మీదే’’ అంటూ ప్రజల్ని నిస్సిగ్గుగా కోరిన నాడే బాబు బడాయి తేలిపోయింది. ఏదో బాబు చంక నుంచి దిగిపోయినట్లు నటిస్తూ, మధ్యమధ్యలో బాబును ఇబ్బంది పెట్టొద్దని వేడుకుంటున్నపవన్..ఆవేశంలోఎప్పటికప్పుడే తాను చంద్రబాబు మనిషిని అని గుర్తుచేస్తూనే ఉన్నారు. అలాంటిదే మరోసారి తెనాలిలో చేశాడంతే. 

తాను రాజకీయాల్లోకి పదవి కోసం రాలేదంటాడు, పదవి కోసమే రాజకీయాలు చేసే చంద్రబాబుకి సాయం చేయకుండా ఉండలే నంటాడు. ప్రజల కోసం పదేళ్లుగా నిత్యం శ్రమిస్తూం ఆ ప్రజల బాగుకోసం ప్రభుత్వంలోకి రావాలనుకునే  వైయ‌స్ జ‌గ‌న్‌ది అధికార వాంఛ అంటాడు. అంతలోనే తమ చంద్రబాబుపై అందరూ కక్షసాధిస్తున్నారు ఇది అన్యాయం అంటాడు. అసలు ఈ మనిషి ఎప్పుడు ఏంమాట్లాడుతున్నాడో అర్థంచేసుకోవడం కష్టమైనాం బాబు గారి ప్రేమ పిపాసి అనే ఒక్క విషయం మాత్రం ప్రజలకు చాలా ఈజీగా అర్థమయ్యేలా మసలుకుంటున్నాడు. అందుకు థ్యాంక్స్ చెప్పాలేమో..!

Back to Top