బాబు అంతే....

మరీ ఆశ్చర్యపోకండి....బాబు అంతే...
రైతులకోసం అన్నీ నేనే చేస్తున్నా అంటాడు. రైతు నీళ్లు రాలేదు బాబూ అని అడిగితే నీది ప్రతిపక్షం, తాగి మాట్టాడుతున్నావ్ అని హుంకరిస్తాడు.
శ్రీకాకుళం తిత్లీ తుఫానును వంటిచేత్తో ఆపాను, ఆఘమేఘాల మీద అన్నీ పునరుద్ధరించాను, నష్టం తగ్గించాను, అక్కడే టెంటేసుకుని బాధితులకు అన్నీ స్వయంగా దగ్గరుండి చూసుకున్నాను అంటాడు. వరద బాధితులు వచ్చి మంచినీళ్లే లేవు బాబూ అని మొత్తుకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తా అని బెదిరిస్తాడు.
మత్స్యకారులను ఎస్టీల్లో  చేరుస్తా, బోట్లు ఇస్తా, ఇంధన ఖర్చులకు రాయితీలిస్తా అంటాడు. మీ హామీలు నెరవేర్చండి సార్ అని అడిగితే తిక్కతిక్కగా మాట్లాడుతున్నారా తాటతీస్తా అని తరిమి  కొడతాడు. 
నాయీ బ్రాహ్మలకు అండగా ఉంటాం అన్నాడు. కనీస వేతనం ఇప్పించండి బాబూ అని అడగబోతే తమాషాలా తోక కత్తిరిస్తా అని కళ్లెర్రచేసాడు. 
ఫాతిమా కాలేజీ విద్యార్థులతో వేరే కాలేజీలో సీట్లు వచ్చేలా ప్రయత్నం చేస్తా, మీ ఫీజులు వెనక్కి వచ్చేలా చూస్తా అన్నాడు. ఎవరెవర్నో కలుస్తున్నారు చూస్తున్నా అంటూ ప్రతిపక్ష నేతను కలిసినందుకు వారిపై విరుచుకుపడ్డాడు. 
అగ్రిగోల్డు బాధితులను ఆదుకుంటాం, ఆస్తులు వేలంవేసి న్యాయం చేస్తాం అన్నాడు. ఏళ్లు గడిచిపోతున్నాయి బాబూ అని అడగవచ్చిన అగ్రిగోల్డు బాధితులపై చేయి చేసుకుని మరీ ఎవడేం చేస్తాడు అంటూ ఛీదరించుకుని వెళ్లిపోయాడు.
ముస్లింలమీద దాడులు జరగకుండా చట్టం తెస్తానంటాడు. కానీ వారికోసం పెట్టిన సభలో వారినే బలవంతంగా అరెస్టులు చేయించి, పోలీసులతో కొట్టిస్తాడు. 
జీరో బడ్జెట్ వ్యవసాయం అంటాడు. దానికోసం వేదికలెక్కి ప్రసంగాలు చేస్తాడు. కానీ జీరో బడ్జెట్ వ్యవసాయం ‌కోసం 6000 కోట్ల అప్పులు కావాలని కేంద్రం దగ్గర చేతులు చాపుతాడు. 
ప్రత్యేక హోదా 15 ఏళ్లు ఇవ్వండి అంటాడు. ప్యాకేజీ దీనికంటే బెస్టు, కేంద్రంమనకిచ్చింది ఫస్టు ఇది వద్దన్నవాళ్లు ఉత్త వేస్టు అంటూ బీజేపీ నేతలకు సన్మానాలు చేస్తాడు.

చంద్రబాబు అంతే...ఒకటి చెబుతాడు..ఇంకొకటి చేస్తాడు. ఒకటి చేస్తాడు వేరొకటి చెబుతాడు..ఆశ్చర్యపోకండి...ఆలోచించి నిర్ణయం తీసుకోండి...

 

Back to Top