బోడి మర్యాద..?

తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే  అరటి గెలతెంపడానికి అన్నాడట వెనకటికొకడు. అలా వుంది తెలుగు తమ్ముళ్ల తీరు. అక్రమంగా మట్టి తవ్వుకు పోతూ, అన్యాయంగా పుల్లేరు కట్టను రియ ల్ఎస్టేట్స్థాపితంచేసే అవినీతి యజ్ఞం చేస్తున్న పెనమలూరు ఎమ్మెల్యే బోడె బోడి కథ కూడా అందుకు తీసిపోదు. మట్టి అక్రమంగా తవ్వుతున్నారని ఆపేయాలని చెప్పినా వినలేదు, ఒక ఐఎఎస్అధికారిణి వళ్లు మండి ప్రొక్లొయినర్లను సీజ్చేస్తేం అధికారంలో ఉన్నామనే కండకావరంతో వాటిని బలవంతంగా ఎత్తుకొచ్చాడు

ఈ బోడి ఎమ్మెల్యే. నిజాయితీగా డ్యూటీ చేసే ఆఫీసర్ఊరుకుంటుందా..వెంటనే ఆ ప్రొక్లెయినర్లను అప్పజెప్పి రెండు లక్షలు జరిమానాకట్టాలని చెప్పడంతో ఎమ్మెల్యే కార్యాలయానికే వెళ్లిచెప్పడంతో తమ్ముడు రెచ్చిపోయాడు. నా వెనకాల నిప్పు లాంటి అవినీతి నాయకుడు ఉండగానన్నే జరిమానా కట్టమంటావా అంటూ నోటికొచ్చినట్టు వాగాడు. మహిళా అధికారులుపై తమ్ముళ్లు ఎలా మసలుకోవాలో తెలుసుకోడానికి, గతంలోనే చింతమనేని లాంటి వాళ్లను ఆదర్శంగా తీసుకున్నాడు. దీంతో విషయం ప్రజల వరకు వెళ్లింది. ఇకతల వంచక తప్పదని తెలుసుకున్నబాబు గారి భజనపరులు వెంటనే బోడెను పిలిపించి మాట్లాడారట.

పరిస్థితులు బాగా లేవంటూ అతనికి నచ్చజెప్పి ఒక లక్షరూపాయలు జరిమానా కట్టమన్నారట. ఈ బోడె గారేమో..తానేదో సామాజిక సేవా కార్యక్రమానికి విరాళం ఇచ్చినంతగొప్పగా..రైతుల కోసం తాను లక్షరూపాయలు చెల్లించానంటూ గొప్పగా చెప్పుకున్నాడు. చేసిన వెదవ పనికి ఇక్కడ రైతుల ఊసెందుకో అర్థం కాదు. అదీ కాక ఐఎఎస్అధికారిణి చెప్పిన జరిమానా రెండు లక్షలు. సారు వారు కట్టింది అందులో సగంం అదీ కూడా రైతుల కోసమంటూ సిగ్గులేని ప్రకటన. మరి బలవంతంగా ఎత్తుకుపోయిన ప్రొక్లెయినర్ల మాటేంటి? అంటే సమాధానం లేదు. అంటే బాబు గారు పిలిపించి మరీ చెడామడా బోడెకు చివాట్లు పెట్టారని చేస్తున్న ప్రచారం ఎంత సిగ్గుమాలిన చర్యో తెలుస్తుంది.

కట్టమన్న జరిమానా కట్టలేదు. ఆ అధికారిణిని అన్నమాటలకు సమాధానం లేదు. బలవంతంగా తీసుకెళ్లిపోయిన ప్రొక్లెయినర్ల ఊసు లేదు. ఇక్కడ బోడె గారి కావరానికి ఏమాత్రం నొప్పి కలగకుండా, అవమానం జరగకుండా సిఎం గారూ ఆయన సహచరులు కలిసి ఇంత గొప్పపంచాయితీ తీర్చారర్నమాట. మహిళా అధికారులపై ఇంత అహంకారంతో విరుచుకుపడిపోతున్నదంతా అధికారం చూసుకునే కదా!.. మరి ఆ అధికారం ఇచ్చిన ప్రజలు కూడా చాలా నిశితంగా ఇవన్నీ గమనిస్తున్నారు. అందులో సగం ఓటర్లు మహిళలే ఉన్నారు. 
రాబోయే ఎన్నికల్లో సరైన సమాధానం చెబుతారుం వీళ్లు చేసిన అరాచకాలన్నింటికీ పూర్తి జరిమానా కచ్చితంగా వసూలు చేసి తీరతారు.

 

Back to Top