బాబు తప్పులకు శిక్ష ఏది

11000.రూపాయిలు చదరపు అడుగుకు ఖర్చు పెట్టి కట్టిన సచివాలయం, హై కోర్టు భవనాలు కాస్త వానకి కారి కంపు కొడుతున్నాయ్...పైన పటారం లోన లొటారం. నిన్నటిదాకా సచివాలయమే అనుకుంటే ఇవాళ హైకోర్టు భవనాలో అంతే అని తేలిపోయింది. న్యాయ మూర్తులు న్యాయం చెప్పాలి. ఇప్పటికైనా ఇలాంటి నాసిరకం భవనాలు కట్టి ప్రజా ధనాన్ని కోట్లకి కోట్లు మింగేసిన చంద్రబాబుకు జరిమానా తో పాటు చరిత్రలో నిలిచిపోయేలా శిక్షిస్తూ తీర్పు ఇవ్వాలి. లేదంటే బాబు కోటరీలో చేరిపోయి న్యాయ మూర్తులు కూడా పచ్చ కోటు తొడుక్కున్నారనే అప్రదిష్ట వచ్చే ప్రమాదం ఉంది.
విభజన తర్వాత రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు కావాలని ఊదరకొట్టి, ప్రజల చెవిలో పచ్చ పూవులు పెట్టి 2014.లో ఓట్లేయించుకుంది ఎల్లో పార్టీ. తీరా గద్దెనెక్కాక రూపాయి ఖర్చును 50.రూ. అంటూ అంచనాలు పెంచి ప్రతి దానిలోనూ తమ్ముళ్లకు దోచి పెట్టింది. ప్రపంచ స్థాయి రాజధాని అని బాకాలూది చివరకు కట్టినవి  తాత్కాలిక భవనాలు. అవి కూడా పేక మేడల్లా వర్షానికి నాని కారుతూ, కదిపితే  పై నుండి పెళ్లలు ఊడుతూ ఉన్నాయి. కోట్లు తగలేసి ఇంత నాసిరకంగా కడతారా అని  అడగబోతే అమెరికాలో తుఫానొచ్చినా అన్నీ మునుగుతాయి కదా అంటూ సన్నాయి నొక్కులు నొక్కే మేధావులు తయారౌతున్నారు. తుఫానులు వస్తే ఇల్లు, రోడ్లు మునుగుతాయి సరే  ప్రపంచ స్థాయి లో కట్టిన కట్టడాలు చిల్లులు పడి కారతాయా? అలా అయితే ఇన్ని కోట్లు ఖర్చు చేయడమెందుకు? చవకగా పందిరేసుకుంటే చాలదా..!! అయినా బాబే స్వయంగా తాత్కాలికమని చెప్పాడంటే అవి తుమ్ముకు ఊడే ముక్కులాంటివి అని మనమే అర్ధం చేసుకోవాలి.
ఇక మరో విధంగా వితండవాదం  చేస్తూ చంద్ర బాబును వెనకేసుకొచ్చే మహా మేధావులు ఉన్నారు. చంద్రబాబు ఏమీ కట్టకుంటే కొత్త ప్రభుత్వం ఎక్కడ పనిచేస్తోందో అంటూ మహా సత్యాన్నీ కనిపెట్టి చెప్పిన ఇంటిలిజెంటుల్లా పోజు కొడతారు. సోగ్గా ముస్తాబు చేసినా సత్తువ లేని నిర్మాణం లోని డొల్లతనం బైట పడుతూనే ఉంటుంది. బాబుకు బ్యూటిఫికెషన్లపై ఉన్న శ్రద్ధ అసలు నిర్మాణంలో ఉండదు. అందుకే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంటాయి చంద్ర బాబు పనులు. వందల కిలోమీటర్లు రోడ్లు వేశామంటాడు మూడు నెల్లకే తయారు పెచ్చు లూడిన సంగతి మాట్లాడడు. సొంత వర్గానికి, తెలుగు తమ్ముళ్లకు కట్ట బెట్టిన కాంట్రాక్టులే అందుకు కారణం అని చెప్పడు. పుష్కరాల పనులకు, సౌకర్యాలకు  వందల కోట్లు ఖర్చు చేశామంటాడు. కానీ ఎక్కడికక్కడ అర్ధాంతరంగా ఆపేసి, నిధులు మొత్తం ఊడ్చేసిన ఊసెత్తడు. ప్రపంచ స్థాయి రాజధాని అని గ్రాఫిక్కులతో పవర్ పాయింట్ ప్రజంటేషన్లు ఇస్తాడు. కానీ కట్టిన నాణ్యమైన ఒక్క నిర్మాణాన్ని చూపించమంటే నీళ్లు నములుతాడు. ప్రజా వేదిక కూల్చేశారని కల్లబొల్లి ఏడుపులు ఏడుస్తాడు. అది అక్రమ స్థలంలో కట్టిన రేకుల షెడ్డు కదా అని ప్రశ్నిస్తే నోరు మెదపడు.
ఝూమంతర్ కాళీ అని మాయల ఫకీరు మంత్రదండం తిప్పినట్టు మాటలతో మూటలు కడుతూ, కాగితాల్లో కోటలు కడుతూ, అరచేతిలో స్వర్గం చూపిస్తూ ఐదేళ్లూ గడిపేశాడు చంద్రబాబు. పిట్టల దొరలా కోతలు కోస్తూ, ప్రపంచ మేధావిలా ప్రచారం చేసుకుంటూ ప్రజలను నమ్మిస్తూ 40.ఎల్లా అనుభవాన్ని సంపాదించేసాడు. బాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకం కూడా నేటికి లేదు. కనకె కొత్త ప్రభుత్వం ఏమి చేసినా, ముఖ్యమంత్రి ఏ పథకం మొదలుపెట్టినా తట్టుకోలేక తన అక్కసంతా వెళ్లగక్కుతున్నాడు. రాబోయే రోజుల్లో టీడీపీని ఎవ్వరూ గుర్తు కూడా పెట్టారన్న నైరాశ్యంలో చిల్లర చేష్టలతో ఉన్న పరువూ పోగొట్టుకుంటున్నాడు. అయితే ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వృధా చేసినందుకు ఈ మాజీ ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవడం చాలా అవసరం అంటున్నారు తెలుగు ప్రజలు. కొట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును తన ప్రచార యావకు, సొంత పార్టీ ప్రయోజనాలకు వాడుకున్నందుకు తగిన రీతిలో శిక్షించే తీరాలని అభిప్రాయ పడుతున్నారు.

 

Back to Top