బాబుకు బుద్ధొచ్చిందా!!

గౌర‌వ స్పీక‌ర్ ను స‌భాస్థానం ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్ల‌డానికి మొరాయించిన చంద్ర‌బాబు నేడు డిప్యూటీ స్పీక‌ర్ ను ద‌గ్గ‌రుండి ఆయ‌న స్థానంలో కూర్చోబెట్టేట్టారు.ఇదెట్టా బాబుకు అంత త్వ‌ర‌గా బుద్ధొచ్చింది? అంటూ అటు స‌భ‌లోని నేత‌లే కాదు చూస్తున్న ప్ర‌జ‌లూ ముక్కున వేలేసుకున్నారు. మారిన మ‌నిషిని అంటూ గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌కు టోపీ పెట్టిన‌ట్టే త‌న వైఖ‌రి మారిన‌ట్టు స‌భ‌ను న‌మ్మించేందుకు బాబు తాపత్ర‌య‌ప‌డుతున్న‌ట్టు ఉంది. 

స్పీక‌ర్ త‌మ్మినేని సీతారామ్ గారి ఎన్నిక స‌మ‌యంలో స‌భా సంప్ర‌దాయం పాటించ‌లేదు ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు. గౌర‌వ‌ప్ర‌ద‌రంగా స్పీక‌ర్ ను స‌భ‌లోని పాల‌క‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కులు ద‌గ్గ‌రుండి స‌భాప‌తిని స్థానంలో కూర్చోబెట్ట‌డం ఎన్నో ఏళ్లుగా సాగుతున్న సంప్ర‌దాయం. గ‌తంలో కోడెల‌ను స్పీక‌ర్ గా ఎన్నుకున్న‌ప్పుడు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సైతం ఆ సంప్ర‌దాయాన్ని పాటించారు. కానీ చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఆ సంప్ర‌దాయాన్ని పాటించ‌కుండా, తన ఉక్రోషాన్ని వెళ్ల‌గ‌క్కారు. దీనిపై ప్ర‌జ‌ల‌నుంచి పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం అయ్యింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొద‌లు సోష‌ల్ మీడియా వ‌ర‌కూ అంత‌టా చంద్ర‌బాబు చ‌ర్య‌ల‌ను ఖండిస్తూ వాఖ్యానాలు, ట్వీట్లు వెల్లువెత్తాయి. దీంతో డిప్యూటీ స్పీక‌ర్  కోన ర‌ఘుప‌తి గారిని సీటు వ‌ద్ద‌కు తీసుకువెళ్లే స‌మ‌యంలో చంద్ర‌బాబు స్వ‌యంగా వ‌చ్చారు. సభాప‌తికి శుభాకాంక్ష‌లు తెలిపి న‌మ‌స్కారం చేసారు. 

ఇదే బుద్ధి ముందు ఉండి ఉంటే ప్ర‌తిపక్ష నేత‌కు గౌర‌వంగా ఉండేద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. 40 ఏళ్ల అనుభ‌వం రాజ‌కీయాల్లో ఉంద‌ని ప‌దే ప‌దే చెప్పుకున్న చంద్ర‌బాబు స‌భా మ‌ర్యాద‌ల‌ను అతిక్ర‌మించి విమ‌ర్శ‌ల పాల‌య్యారు. స్పీక‌ర్ విష‌యంలోనూ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా హుందాగా వ్య‌వ‌హ‌రించి ఉండాల్సింద‌ని టీడీపీ నేత‌లు కూడా అభిప్రాయ‌ప‌డ్డార‌ట‌. పోనీలే ఎప్పటికైనా ఆయ‌న‌కు బుద్ధొచ్చింద‌ని, స‌భ‌లో ఎలా వ్య‌వ‌హ‌రించాలో, స‌భాప‌తితో ఎలా న‌డుచుకోవాలో న‌ల‌భైఏళ్ల అనుభ‌వ‌జ్ఞుడు నెమ్మ‌దిగా నేర్చుకుంటున్నార‌ని కామెంట్ చేస్తున్నారు నెటిజ‌న్లు. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా శాస‌న స‌భ‌లో ఉంటే ప్ర‌తిప‌క్షానికి కూడా క్ర‌మ‌శిక్ష‌ణ వ‌స్తుంద‌న‌టానికి చంద్ర‌బాబులో క‌లిగిన మార్పే నిద‌ర్శ‌నం అని అంటున్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top