బాబు డ్రామాకు ‘కోడ్’ తెర‌

చంద్ర‌బాబు అబ‌ద్ధ‌పు హామీల ముసుగు తొల‌గింది

అన్న‌దాతా సుఖీభ‌వ తొలి విడ‌త రూ.4 వేలు అన్నారు..వెంట‌నే మాట మార్చి వెయ్యి అన్నారు

ఏ ఒక్క ఖాతాలో జ‌మా కాని డ‌బ్బులు

చిత్తుపేప‌ర్లుగా మార‌నున్న ప‌సుపు-కుంకుమ చెక్కులు 

అమ‌రావ‌తి:  ద‌గాకోరు బాబు మాట‌లు ఎంత‌ ప‌చ్చ‌టి అబ‌ద్ధాలో తెలుగు ప్ర‌జ‌ల‌కు మ‌రోసారి అర్థం అయ్యింది. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ప‌సుపు కుంకుమ‌, రైతుల‌కు పెట్టుబ‌డి సాయం అనే బాబు అబ‌ద్ధ‌పు హామీల ముసుగు తొల‌గింది. ఎలాగూ ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని తెలిసే చంద్ర‌బాబు ఇలాంటి చిల్ల‌ర హామీల‌కు తెర తీసాడు. పేరుకు పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అని ముందు ప్ర‌క‌టిస్తాడు. ప‌దివేలు, ప‌దిహేను వేలు, యాభై వేలు అంటూ ప్ర‌చారం చేస్తాడు. ప్ర‌జ‌ల్లోకి ఈ విష‌యం వెళ్లిన త‌ర్వాత దాన్ని విడ‌త‌ల వారీగా అంటూ చావుక‌బురు చెబుతాడు. చివ‌ర‌కు వాటిని పోస్టు డేటెడ్ చెక్ లుగా అంద‌జేస్తానంటాడు. ప‌ది రూపాయిల పేరు చెప్పి పావ‌లా ఇచ్చి మిగిలింది కావాలంటే నాకు ఓటేయండంటున్నాడు. రైతుల‌కు ఇచ్చేఅన్న‌దాతా సుఖీభ‌వ తొలి విడ‌త 4000 రూపాయిలు అని ప్ర‌క‌టించి వెంట‌నే మాట మార్చి 1000 రూపాయిలు అన్నాడు. వాటిని కూడా క‌రెక్టుగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్ ప్రారంభ‌మ‌య్యే రోజు విడుద‌ల చేస్తున్న‌ట్టు పెద్ద ఎత్తున్న ప్ర‌చారం చేసాడు. తీరా కోడ్ అమ‌లు లోకి వ‌చ్చి రైతుల ఎక్కౌంట్ల‌లో ఆ 1000రూపాయిలు కూడా జ‌మ‌కాలేదు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్ జ‌రుగుతుండ‌గానే సాధార‌ణ ఎన్నిక‌ల కోడ్ అమ‌లు లోకి రానుంది. దీని త‌ర్వాత ఎంపీ, పంచాయితీ ఎన్నిక‌లు వ‌ర‌స‌గా వ‌స్తాయి. క‌నుక ఎన్నిక‌ల నియ‌మావ‌ళి అనుస‌రించి డ‌బ్బు అందించ‌కూడ‌దు క‌నుక రేపు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఈ డ‌బ్బును వేస్తానంటూ మెలిక పెడ‌తాడు జిత్తుల‌మారి బాబు. మ‌ళ్లీ ఈ మాట‌లు న‌మ్మి ఓట్లేస్తే మ‌ళ్లీ ఐదేళ్లకు ఎన్నిక‌లు వ‌చ్చేంత  వ‌ర‌కూ ఆ హామీల‌ను అట‌కెక్కిస్తాడు.
బాబు ద‌గా గ్ర‌హించిన మ‌హిళ‌లు
ఇప్ప‌టికే ప‌సుపు కుంకుమ విష‌యంలో పొదుపు మ‌హిళ‌ల ఉద్దేశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ప‌సుపు కుంకుమ ఎప్పుడో ఇస్తాన‌ని ఎన్నిక‌ల ముందు ఇవ్వ‌డంలో ఉద్దేశ్యాన్ని మ‌హిళ‌లు గ్ర‌హించారు. ఈ చెక్కులు తీసుకుంటాం కానీ వైఎస్ జ‌గ‌న్ కు ఓటేస్తాం అంటూ మ‌హిళ‌లు ప‌బ్లిక్ గా చెబుతున్నారు. దీంతో బాబు త‌న పాచిక‌కు ప‌దును పెడుతున్నాడు. ప‌సుపు కుంకుమ తొలి విడ‌త డ‌బ్బులు పంచినా ప్ర‌జ‌ల దృష్టిలో త‌న‌కు సానుకూల‌త లేద‌ని అర్థం అవ్వ‌గానే అన్న‌దాత సుఖీభ‌వ తొలి విడ‌త డ‌బ్బుల్లో కోత పెట్టేసాడు. ఆ సొమ్ములు కూడా క‌రెక్టుగా ఎన్నిక‌ల కోడ్ అమ‌లు స‌మ‌యంలో ఎక్కౌంట్లో వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. ఇటు తాను మాట నిల‌బెట్టుకున్న‌ట్టు, అటు ఎన్నిక‌ల నియ‌మావ‌ళి వ‌ల్ల అది ఆగిపోయిన‌ట్టు బిల్డ‌ప్ ఇవ్వాల‌నుకున్నాడు. కానీ చంద్ర‌బాబు నీచ‌నీతిని ప్ర‌జ‌లు ఇప్ప‌టికే ద్వేషిస్తున్నారు. చెక్కులు, ఎక్కౌంట్ పేలు అన్నీ బాబు చెప్పే అబ‌ద్ధాల‌ని, అవి ఎన్నిక‌ల కోడ్ దృష్ట్యా వేయ‌డం వీలు కాద‌ని ఎన్నో రోజులుగా ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ చెబుతున్న మాట నిజ‌మ‌ని రూఢీ అయ్యింది. 
గ‌తంలోనూ ఇదే ఘ‌రానా
గ‌త ఎన్నిక‌ల్లో పోల‌వ‌రం పూర్త‌వ్వాలంటే నేను రావాలి అన్నాడు. రాజ‌ధాని కావాలంటే నావ‌ల్లే అవుతుంది అన్నాడు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నా అనుభ‌వం అవ‌స‌రం అన్నాడు. ప్ర‌త్యేక హోదా కోసం నేనే పోరాడ‌తాను అన్నాడు. కొత్త రాష్ట్రానికి నిధులు నేనే తెస్తాను అన్నాడు. రైతుల‌కు రుణ‌మాఫీ కోసం నేను రావాల్సిందే అన్నాడు. ఆడ‌ప‌డుచుల బంగారం తాక‌ట్టు విడిపించేందుకు నాకే ఓటేయాల‌న్నాడు. నిరుద్యోగ భృతి ఇస్తా గెలిపించండి అన్నాడు. ఉద్యోగాలు ఇస్తా అధికారం అందించ‌మ‌న్నాడు. మారిన మ‌నిషిని అన్నాడు. గెలిచి గ‌ద్దెనెక్కాక బుద్ధి చూపించాడు. అస‌లు రంగు బ‌య‌ట‌పెట్టాడు. ఉన్న ప్ర‌భుత్వోద్యోగాలు ఊడ‌బీకాడు. రుణ‌మాఫీకి చిల్లులు పెట్టాడు. ఎన్నిక‌లు మ‌ళ్లీ వ‌చ్చేవ‌ర‌కూ నిరుద్యోగ భృతి పేరు ఎత్త‌లేదు. గ్రాఫిక్కులు తప్ప రాజ‌ధాని రూపు లేదు. హోదాని కాద‌ని ప్యాకేజీ పాట‌పాడాడు. ప్ర‌తిప‌క్షం గొడ‌వ‌చేస్తే హోదా కోసం యూ ట‌ర్న్ తీసుకున్నాడు. దొంగదీక్ష‌లు చేస్తూ, పోల‌వ‌రం సినిమా చూపిస్తూ, తాయిలాలు ప్ర‌క‌టిస్తూ, ప్ర‌తిప‌క్ష పార్టీ హామీల‌ను దొంగిలిస్తూ ఎన్నిక‌ల ప‌బ్బం గ‌డుపుకుందామ‌నుకుంటున్నాడు. 
చంద్ర‌బాబు చెప్పేవి ఎప్పుడూ చేయ‌డు. చేసేవి పొర‌పాటున కూడా చెప్ప‌డు. కేవ‌లం ఎన్నిక‌ల్లో ల‌బ్దికోసం వేసే ఎత్తుగ‌డ‌లే ఈ హామీలు. కొద్ది రోజుల్లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో బాబు ప‌న్నే వ‌లలో చిక్కకుండా ఉండ‌ట‌మే విజ్ఞులైన ప్ర‌జ‌ల క‌ర్త‌వ్యం. 

తాజా ఫోటోలు

Back to Top