అవును వైయ‌స్ జ‌గ‌న్‌కు వాటిలో అనుభ‌వం లేదు

 అమ‌రావ‌తి:  విభ‌జ‌న త‌ర్వాత ఏర్ప‌డిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చంద్ర‌బాబు లాంటి సీనియ‌ర్ కావాలి, అనుభ‌వ‌జ్ఞుడు సీఎంగా వుంటే బాగుంటుంద‌ని 2014లో విప‌రీతంగా ప్ర‌చారం చేశారు. ప‌చ్చ మీడియా ప్ర‌చారాలు, నెర‌వేర్చ‌లేని హామీలు, కుట్ర‌లు, కుతంత్రాలు...ఏమైతేనేం మొత్తానికి చంద్ర‌బాబు గెలిచారు. ఆ త‌ర్వాత ఏమైంది? అందుకే ప్ర‌జ‌లు అంటున్నారు...అవును ప‌చ్చ మీడియా ప్ర‌చారం నిజ‌మే...వైఎస్ జ‌గ‌న్‌కు  అనుభ‌వం లేని మాట నిజమే అని అంటున్నారు. అంతే కాదు ఆయ‌న‌కు అనుభ‌వం ఎందులో లేదో అంశాల‌వారీగా ఇలా వివ‌రిస్తున్నారు. 

  • వైయ‌స్ జ‌గ‌న్‌కు వెన్నుపోటులో అనుభ‌వం లేదు
  • వైయ‌స్‌ జ‌గ‌న్‌కు అబ‌ద్ధాలు చెప్ప‌డంలో అనుభ‌వం లేదు
  • వైయ‌స్‌ జ‌గ‌న్‌కు బ్యాక్ డోర్ పాలిటిక్సులో అనుభ‌వం లేదు
  • వైయ‌స్‌ జ‌గ‌న్‌కు మాట త‌ప్ప‌డంలో అనుభ‌వం లేదు
  • వైయ‌స్‌ జ‌గ‌న్‌కు కుల పిచ్చిలో అనుభ‌వం లేదు
  • వైయ‌స్‌జ‌గ‌న్‌కు ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్ట‌డంలో అనుభ‌వం లేదు
  • వైయ‌స్‌ జ‌గ‌న్‌కు వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేసి ప‌బ్బం గ‌డుపుకోవ‌డంలో అనుభ‌వం లేదు
  • వైయ‌స్‌ జ‌గ‌న్‌కు అప‌విత్ర పొత్తులు పెట్టుకోవ‌డంలో అనుభ‌వం లేదు
  • వైయ‌స్‌ జ‌గ‌న్‌కు కుల మీడియాను త‌యారు చేసుకొని దాని నీడ‌న ల‌బ్ధి పొంద‌డంలో అనుభ‌వం లేదు
  • వైయ‌స్‌ జ‌గ‌న్‌కు శ‌వ‌రాజ‌కీయాలు చేయ‌డంలో అనుభ‌వం లేదు
  • వైయ‌స్‌ జ‌గ‌న్‌కు ప‌లు పార్టీల్లోని కుల నేత‌లతో చీక‌టి రాజ‌కీయాలు చేయ‌డంలో అనుభ‌వం లేదు
  • వైయ‌స్‌ జ‌గ‌న్‌కు పొద్దున ఇచ్చిన హామీని సాయంత్రానికి మ‌రిచిపోవ‌డంలో అనుభ‌వం లేదు. 
  • వీట‌న్నిటిలో అనుభ‌వ‌మున్న చంద్ర‌బాబు ఈ ఐదేళ్ల‌లో ఏం చేశారు? ఆ విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్ర‌జ‌ల‌కు తెలియ‌దా ఏంటి!!
Back to Top