అనుభ‌వం అభాసుపాలు

పాల‌న‌లో విఫ‌ల‌మైన చంద్ర‌బాబు

నాలుగేళ్లు కేంద్రంలో భాగ‌స్వామిగా ఉంటూ సొంత ప‌నులు చ‌క్క‌బెట్టేశారు

రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు క‌రువు

శంకుస్థాప‌న‌లు, పునాదిరాళ్లతో స‌రి 

అమ‌రావ‌తి: న‌ల‌భై ఏళ్ల అనుభ‌వం ఉన్న నాయ‌కుడు చంద్ర‌బాబు వ‌స్తే త‌ప్ప విభ‌జ‌న త‌ర్వాత ఆంధ్ర రాష్ట్రం అధోగ‌తి త‌ప్పించ‌లేర‌ని నమ్మిన చాలా మంది నేడు వాస్త‌వం తెలుసుకున్నారు. ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు 9ఏళ్ల అనుభ‌వం మేనేజ్మెంటే కానీ క‌మిట్మెంట్ కాద‌ని అర్థం చేసుకున్నారు. అదే నిజ‌మైతే నేడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ల‌క్ష‌ల కోట్ల అప్పులో మునిగిపోయేది కాద‌ని వివేకులు తెలుసుకుంటున్నారు. 

అస‌మ‌ర్థ‌త‌కు ముసుగు
విభ‌జ‌న హామీల‌ను సాధిస్తాన‌ని ప్ర‌గ‌ల్బాలు ప‌లికారు చంద్ర‌బాబు. హైద‌రాబాద్ ను కోల్పోయి, ఆదాయ వ‌న‌రులు లేక రాష్ట్రం న‌ష్ట‌పోకుండా ఉండాలంటే నేనే ముఖ్య‌మంత్రిని కావాల‌ని ప్ర‌చారం చేసుకున్నారు బాబు. త‌న అనుభ‌వ‌మే పెట్టుబ‌డిగా ప్ర‌పంచ స్థాయి ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ సంస్థ‌లు ఏపీలో లైను క‌డ‌తాయ‌ని చెప్పారు. అభివృద్ధికి నేనే బ్రాండ్ అంబాసిడ‌ర్ అన్నారు. కానీ ఏమైంది. గ‌నులు త‌మ్ముళ్ల‌కు, కాంట్రాక్టులు క‌మ్మ పారిశ్రామిక‌వేత్త‌ల‌కు, ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో గెల‌వ‌కుండా మంత్రిప‌ద‌విని కుమారుడికీ అప్ప‌గించ‌డం త‌ప్ప బాబుగారు రాష్ట్రానికి ఏమీ చేయ‌లేదు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు క‌రువ‌య్యాయి. పార్టీ నేత‌లే కాదు, అనుచ‌రులు కూడా విచ్చ‌ల‌విడిగా అవినీతి, అకృత్యాలు చేస్తుంటే ఆప‌లేని అస‌మ‌ర్థ ప్ర‌భుత్వంగా టీడీపీ మిగిలిపోయింది. ముఖ్య‌మంత్రి అండ‌చూసుకునే అధికారుల‌పైనా రెచ్చిపోయే ప‌చ్చ‌నేత‌ల ప్ర‌తాపాల‌ను ప్ర‌జ‌లు చూసి ఛీకొడుతున్నారు. 

లోపాల‌ను బాకాల‌తో క‌ప్పెట్టి
రాష్ట్రంలో జ‌రుగుతున్న అవినీతిని, ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక చ‌ర్య‌ల‌ను, ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తున్న పాల‌న‌ను ప్ర‌జ‌ల ముందుకు తేవాల్సిన బాధ్య‌త‌గ‌ల మీడియా త‌న క‌ర్త‌వ్యాన్ని ఏమాత్రం నిర్వ‌హించ‌డం లేదు. కుల‌మీడియాగా మారి ప్ర‌భుత్వానికీ, అధికార పార్టీకీ సేవ‌కులుగా ప‌నిచేసే ప‌దుల‌కొద్దీ ఛానెళ్లు, పేప‌ర్లు రాష్ట్రంలో త‌యార‌య్యాయి. పోల‌వ‌రం పూర్తి  కాకున్నా, రాజ‌ధాని నిర్మాణం జ‌ర‌గ‌క‌పోయినా, ప‌ట్టిసీమ‌లో క‌మీష‌న్ల వ‌ర‌ద పారినా, అవినీతి సామ్రాజ్యం విస్త‌రిస్తున్నా ఈ మీడియా ఆ విష‌యాన్ని క‌ప్పిపెట్టే ఉంచుంతుంది. శంకుస్థాప‌న‌లు, పునాదిరాళ్లు, విదేశీ ప్రయాణాలు, ప్ర‌త్యేక ఆహ్వానాలు వీటిపైనే ప్ర‌చారం చేయ‌డానికి, చంద్ర‌బాబును పొగ‌డ‌టానికి మాత్ర‌మే అన్న‌ట్టు ఉన్న తెలుగు జాతి మీడియాను చూసి ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రించి, లేనిగొప్ప‌లు చెబుతూ చంద్ర‌బాబును ఆకాశానికెత్తేందుకు మాత్ర‌మే మీడియా ప‌నిచేస్తోంద‌ని ప్ర‌జ‌లే బాహాటంగా చ‌ర్చించుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. 

చేత‌కానిత‌నానికి ఇత‌రుల‌పై నింద‌లు 
రాష్ట్రం అభివృద్ధి చెంద‌కుండా మోదీ అడ్డు ప‌డుతున్నార‌ని త‌న చేత‌కానిత‌నాన్ని బీజేపీపై నెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు చంద్ర‌బాబు. మోదీ ఏపీపై క‌క్ష క‌ట్టాడ‌ని, నిధులు ఇవ్వ‌క ఇబ్బందులు పెడుతున్నాడ‌ని ప‌దేప‌దే చెబుతున్నాడు. అదే నిజ‌మైతే 2015లో కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ దుర్గ గుడి ఫ్లై ఓవ‌ర్, మ‌చిలీప‌ట్నం ఫ్లై ఓవ‌ర్, బెంజ్ స‌ర్కిల్ ప్లై ఓవ‌ర్ల‌కు శంకుస్థాప‌న‌లు చేసారు. ఇందులో మ‌చిలీప‌ట్నం, బెంజ్ స‌ర్కిల్ ఫ్లై ఓవ‌ర్లు వేగంగా ప‌నులు జ‌రుగుతున్నాయి. NHAI లో భాగంగా జ‌రిగే ఈ ఫ్లై ఓవ‌ర్ల నిర్మాణం కేంద్రం శ‌ర‌వేగంగా జ‌రుప‌తోంది. కానీ దుర్గ గుడి ఫ్లై ఓవ‌ర్ కాంట్రాక్టు మాత్రం చంద్ర‌బాబు ద‌గ్గ‌రుండి వోవ‌ర్ డ్యూలు ఉన్న సోమా బిల్డ‌ర్స్ కు అప్ప‌గించాడు. కేంద్రం వ‌ద్ద‌న్న సంస్థ‌కు ప‌ట్టుబ‌ట్టి కాంట్రాక్టు ఇప్పించ‌డ మే కాదు 5 కిలోమీట‌ర్ల ఈ ఫ్లై ఓవ‌ర్ నిర్మాణానికి 282.4 కోట్ల‌లో 225 కోట్లు కేంద్రం విడుద‌ల చేసినందుకు ధ‌న్య‌వాదాలు కూడా చెప్పారు చంద్ర‌బాబు.ఏడాదిలో నిర్మాణం పూర్త‌వ్వాల‌న ష‌ర‌తు ఉన్నాకూడా 2016లో  అది పూర్తి కాద‌ని 2018 వ‌ర‌కూ స‌మ‌యం ప‌డుతుంద‌ని సోమా బిల్డ‌ర్స్ తో చెప్పించి అంచ‌నా వ్య‌యం 350 కోట్ల‌కు పెంచేలా చేసిందీ చంద్ర‌బాబు గారే. ఫ్లై ఓవ‌ర్ నిర్మాణంలో ఆల‌యాలు కూల్చేసారు. బ్రాహ్మ‌ణులు, హిందూ సంస్థ‌లు ధ‌ర్నాచేసి రోడ్డెక్క‌డంతో కూల్చేసిన ఆల‌యాల‌కోసం ప్ర‌త్యేక భూమిని కేటాయించి, ఆల‌యాలు క‌ట్టిస్తామ‌ని దేవాదాయ‌శాఖ మంత్రి పైడికొండ మాణిక్యాల‌రావు, దేవినేని, కేశినేని, కామినేనిలు మాట ఇచ్చారు. కూల్చిన మ‌సీదుల‌కైనా 80 ల‌క్ష‌లు ఇచ్చారు కానీ, దేవాల‌యాల మాట ఈరోజుకూ ఎత్త‌లేదు. పోల‌వ‌రం మొద‌లు రాజ‌ధాని నిర్మాణం వ‌ర‌కూ కేంద్రం నిధుల‌ను దుర్వినియోగం చేసి, యూజీసీలు ఇవ్వ‌కుండా నిధుల ఇవ్వ‌లేద‌నే సాకులతో ఐదేళ్లు కాలం గ‌డిపేసారు చంద్ర‌బాబు. త‌న అవినీతి స్వ‌రూపంతో రాష్ట్రానికి రావాల్సిన ప్ర‌యోజ‌నాల‌కు అడ్డంకిగా మారారు. 
 

Back to Top