అన్నా..ఇది విన్నారా?

అన్నా క్యాంటీన్లలో రూ.150 కోట్ల స్కామ్‌  

మధ్యాహ్న భోజన పథకం బిల్లులు చెల్లించని గత ప్రభుత్వం

ప్రజా ప్రభుత్వంపై ఎల్లో బ్యాచ్‌ విష ప్రచారం

పగటి వేషగాళ్ల బ్యాచ్‌కు చంద్రబాబు లీడర్‌ అయితే లోకేష్‌ హార్మోనిస్టు

ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా...అబద్ధాలు ప్రచారం 

అమరావతి: అమ్మకు అన్నం పెట్టలేని వ్యక్తి..చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తా అన్నాడట..వెనుకటికి ఓ పెద్ద మనిషి..ఇదే విషయాన్ని దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ^è ంద్రబాబును ఉద్దేశించి అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు చంద్రబాబుకు సరిగ్గా సరిపోతాయి. ముఖ్యమంత్రి పీఠం కోసం పిల్లనిచ్చిన ఎన్‌టీ రామారావుకే వెన్నుపోటు పొడిచారు. ఆయన స్థాపించిన తెలుగు దేశం పార్టీని లాక్కున్నాడు చంద్రబాబు. ఇలాంటి వ్యక్తి విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది.

ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఎన్టీఆర్‌ పేరు ప్రభుత్వ పథకాలకు ఉండకూడదని నిసిగ్గుగా ఎల్లోమీడియా అధిపతితో అన్న విషయాలు అందరికి తెలుసు. అలాంటి వ్యక్తి అన్నా..క్యాంటీన్ల పేరుతో ఏకంగా రూ.150 కోట్లు స్కామ్‌కు పాల్పడిన వ్యక్తి..ఇవాళ ఆ  ఆవినీతి బయటపడటంతో లబోదిబోమంటున్నారు. ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకం పేరుతో రూ.2లకే 20 లీటర్ల మంచినీరు ఇస్తామన్న చంద్రబాబు ఎక్కడా కూడా ఈ పథకాన్ని అమలు చేసిన పాపాన పోలేదు. పచ్చ బ్యాచ్‌ అవినీతిని చూసిన రాష్ట్ర ప్రజలు  రెండు నెలల క్రితం జరిగిన సార్వాత్రిక ఎన్నికల్లో టీడీపీని మట్టి కరిపించి..వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. కనివినీ ఎరుగని రీతిలో ఏకంగా 151 అసెంబ్లీ స్థానాల్లో గెలిపించి..వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 80 శాతం కార్యారూపం దాల్చడంతో ఉనికి చాటుకునేందుకు చంద్రబాబు అండ్‌ గ్యాంగ్‌ ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం మొదలుపెట్టింది. వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలు, ఆలోచనలే లక్షా్యలుగా వచ్చిన ప్రభుత్వం ఇది.
ప్రజల ప్రభుత్వం ఇది. 
ప్రజలకు విద్యా, వైద్యం, ఆరోగ్యం అందించి, వారి జీవన ప్రమాణాలను పెంచి, నాణ్యమైన భవిష్యత్తును అందించాలని ఆరాటపడుతున్న ప్రభుత్వం ఇది. చెప్పాలంటే ప్రజలకు అన్నం పెట్టి, వారి ఆకలిని తీర్చే ప్రభుత్వం.
ఆ ప్రభుత్వం మీద నిరంతరం విషప్రచారం, తప్పుడు ప్రచారం, అవాస్తవ ప్రచారాలు చేస్తూ తమ పబ్బం గడుపుకునేందుకు ప్రతిపక్షంతో సహా కొన్ని వర్గాలు ఆరాటపడుతున్నాయి. 
వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు, సీనియర్‌ నాయకులు విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా ఓటరు వేలి మీద ఇంకు ఆరక ముందే.. అప్పుడే ప్రజల  కోసం గుండెలు బాదుకున్నట్లుగా నటించే పగటి వేషగాళ్ల బ్యాచ్‌ రోడ్లమీదకు వచ్చి హల్‌చల్‌ చేస్తోంది. ఈ పగటి వేషగాళ్ల బ్యాచ్‌ కు నాయకుడు చంద్రబాబు అయితే... హార్మోనిస్ట్‌ లోకేష్‌

ఉన్నది లేనట్టుగా... లేనిది ఉన్నట్టుగా... కల్పించి ఒకే అబద్దాన్ని వందసార్లు చెప్పి... దానిని నిజమని నమ్మించే ప్రయత్నంను మళ్ళీమళ్ళీ చేస్తున్నారు.
తమ అక్రమాలు, అన్యాయాలు, అవినీతి, దుర్మార్గాలతో ఈ రాష్ట్ర ప్రతిష్టను సర్వ నాశనం చేసినందుకు ఐదు కోట్ల ప్రజలు పాతాళంలోకి తొక్కేసినా.. మళ్లీ తన కుట్రలు...కుయుక్తులు.. ఒక వర్గం మీడియా అండతో... పైకి లేవడానికి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ మహాప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రజాకంఠకులను ప్రజలే చూసుకుంటారు. మేము మాత్రం ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తాం. అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి అంటూ ఈ పగటివేషగాళ్ల బ్యాచ్‌ గుండెలు బాదుకుంటున్నాయి. కానీ దానిలో రూ. 150 కోట్ల రూపాయలు నొక్కేశారని బయటకు చెప్పరు. ఇంకా 90 కోట్ల రూపాయలు బిల్లుల రూపంలో కాంట్రాక్టర్‌లకు, ఆహార సంస్థకు  ఎగ్గొట్టామని చెప్పరు.
ఎన్నికల ముందు హడావుడి చేసి, ప్రజలు లేనిచోట్ల, అవసరం లేని చోట్ల కట్టామన్న విషయాన్ని చెప్పరు. పసుపు–కుంకుమ పేరుతో ప్రజాధనాన్ని ఖర్చు చేస్తే..మహిళలు తమ పసుపు–కుంకుమలు నిలబెట్టే వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఓటు వేశారు. 

కాలేజీ పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టలేదంటూ ఈ ప్రభుత్వం మీద నిందలు వేస్తారు.కానీ ఎన్నికలకు ముందు హడావుడిగా మొదలు పెట్టామని, ఎవరికీ నాణ్యమైన  భోజనం పెట్టలేదని, డబ్బులు మింగేశామని ఈ పగటి వేషగాళ్లు మాత్రం చెప్పరు. ఆ పెట్టిన భోజనానికి కూడా బిల్లులు చెల్లించకుండా ఎగ్గొట్టామని చెప్పరు.ఒక్కో పిల్లవాడికి భోజనం కింద కేవలం ఆరు నుంచి ఎనిమిది రూపాయలు ఇవ్వాలని చంద్రబాబు అనుకుంటే... అమ్మ ఒడి రూపంలో ఏడాదికి 15 వేల రూపాయలు నేరుగా అందబోతోంది అనే విషయాన్ని చెప్పరు. అదికూడా జనవరి 26 నుంచి. కానీ కాలేజీ విద్యార్ధులకు సరిగ్గా వేసవి సెలవులకు ముందు ఈ పథకాన్ని పెట్టి.. మూడు నాళ్ళ ముచ్చటగా మార్చేసిన విషయాన్ని మాత్రం చెప్పరు. వృద్ధులకు తన హయాంలో నెలకు వెయ్యి రూపాయలు పెన్షన్‌ ఇస్తూ... కేవలం ఎన్నికలకు నాలుగు నెలల ముందు రెండు వేల రూపాయలు ఇచ్చామన్న విషయాన్ని చెప్పరు. 
వైయస్‌ జగన్‌ అ«ధికారంలోకి వచ్చిన తరువాత రూ. 2250 పింఛన్‌ ఇస్తున్నారన్న విషయం చెప్పరు. 
ఇది కపట వేషగాళ్ల బ్యాచ్‌ ఆడుతున్న డ్రామాలు
ఇలా ఎన్నో అంశాల్లో వాళ్లు చేయలేని పనులు, ఈ ప్రభుత్వం చేస్తుంటే చూసి ఓర్వలేక...సహించలేక... ఈర్ష్యతో... ద్వేషంతో.. కడుపుమంటతో... ఈ ప్రతిపక్షపార్టీ.. ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు, ఆయనకు పక్కన వంతపాడుతున్న లోకేష్‌... వారికి కొమ్ముకాస్తున్న ఓవర్గంకు చెందిన  మీడియా...నిరంతరం తప్పుడు ప్రచారాలు చేస్తోంది. ఇకనైనా ఇలాంటి ప్రచారం మానుకోకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి పట్టిన గతే..తెలుగు దేశం పార్టీకి పడుతుందనడంలో అతిశయోక్తి లేదు.
 

Back to Top