నూతనోత్సాహం

మరింత బలోపేతం దిశగా వైయ‌స్ఆర్‌సీపీ అడుగులు

జిల్లాలకు ఇన్‌చార్జ్‌ మంత్రులు

26 జిల్లాలకు వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుల నియామకం

ప్రాంతీయ సమన్వయకర్తలుగా 11 మందికి బాధ్యతలు

జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తల కో–ఆర్డినేటర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి.. పార్టీ అన్ని అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా విజయసాయిరెడ్డి

బూత్‌ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రణాళిక

వచ్చే నెల నుంచి గడపగడపకూ వైయ‌స్ఆర్‌సీపీ 

ప్రతి ఇంటికి వెళ్లి చేకూర్చిన లబ్ధిని ప్రజలకు వివరించి ఆశీర్వాదం కోరనున్న ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు

జూలై 8 వైయ‌స్ఆర్‌ జయంతి రోజు పార్టీ ప్లీనరీ

  అమరావతి: రాష్ట్రంలో పాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరాల మేరకు ఏర్పాటైన 26 జిల్లాలకు ప్రభుత్వం ఇన్‌చార్జ్‌ మంత్రులను నియమించింది. సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రులు.. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యకలాపాల అమలుపై సమీక్షలు, పర్యవేక్షణ చేయనున్నారు. అలాగే 26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, 11 మంది ప్రాంతీయ సమన్వయకర్తలను వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం తొణికిసలాడుతోంది. పాలన వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలను పునర్వ్యవస్థీకరించి కొత్తగా ఏర్పాటు చేసిన 26 జిల్లాల్లో ఈ నెల 4 నుంచి పరిపాలనను సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రారంభించారు.

అదేవిధంగా 25 మందితో ఈ నెల 11న కొత్తగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులతోపాటు పార్టీ అధ్యక్షులను, ప్రాంతీయ సమన్వయకర్తలను నియమించారు.  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షుల కో–ఆర్డినేటర్‌గా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇక పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డిని నియమించారు. ఇందుకు సంబంధించిన వివరాలను  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం తాడేపల్లిలోని  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  కేంద్ర కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. 

 
ఆదిలోనే చెప్పినట్లుగానే.. 
2019 ఎన్నికల్లో  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండ విజయం సాధించి.. అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేసి.. వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని.. మంత్రివర్గంలోకి కొత్తవారిని తీసుకుంటామని.. ఇది నిరంతర ప్రక్రియ అని సీఎం వైయ‌స్‌ జగన్‌ చెప్పిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ నెల 11న మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలో.. ఎవరికి పార్టీ బాధ్యతలు ఇవ్వాలో తనకు బాగా తెలుసని చెప్పిన సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆ మేరకు నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఆదిలోనే చెప్పినట్లుగానే మంత్రివర్గం నుంచి తప్పించినవారికి జిల్లాల పార్టీ అధ్యక్షులుగా, ప్రాంతీయ సమన్వయకర్తలుగా బాధ్యతలు ఇచ్చారు. జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇన్‌చార్జి మంత్రులు, ప్రాంతీయ సమన్వయకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీని సంస్థాగతంగా మరింతగా బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు.  
 
పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి.. 
దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజు జూలై 8న  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  ప్లీనరీ నిర్వహిస్తామని సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రకటించారు. ఆలోగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలను జిల్లా అధ్యక్షులు సమన్వయం చేసుకుంటూ   వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  గ్రామ, మండల కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా పార్టీ నిర్మాణంలో, పార్టీని బలోపేతం చేయడంలో ప్రాంతీయ సమన్వయకర్తలు క్రియాశీలక పాత్ర పోషించనున్నారు.  

 
గడపగడపకూ వెళ్లి ప్రజల ఆశీర్వాదం.. 
వచ్చే నెల నుంచి ప్రతి నియోజకవర్గంలో నెలకు పది సచివాలయాలను ప్రతి ఎమ్మెల్యే సందర్శించాలని సీఎం వైయ‌స్‌ జగన్‌ నిర్దేశించారు. వాటి పరిధిలోని గ్రామాల్లో 20 రోజులు పర్యటించి.. ప్రతి ఇంటికి వెళ్లాలని సూచించారు. గత మూడేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా ఆ ఇంటిలోని సభ్యులకు అందిన ప్రయోజనాన్ని వివరించాలన్నారు. అలాగే ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను ఎండగట్టడంతోపాటు తమను ఆశీర్వదించమని ప్రజలను కోరాలని ఇటీవల  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.

గడపగడపకూ వెళ్లి ప్రజల ఆశీర్వాదం తీసుకుంటున్న సమయంలోనే బూత్‌ కమిటీలను పునర్‌ నిర్మించాలని.. వాటిలో కనీసం 50 శాతం మంది మహిళలు ఉండేలా చూడాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో సగటున 80 సచివాలయాల వరకూ ఉంటాయి. గడపగడపకూ  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  కార్యక్రమం పూర్తయ్యేసరికి కనీసం ఎనిమిది నెలల సమయం పడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ఆశీర్వాదాన్ని పొందడంతోపాటు బూత్‌ స్థాయి నుంచి పార్టీ మరింతగా బలోపేతమవుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ విస్తృత కార్యక్రమాలు చేపట్టనుండటంతో  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  శ్రేణుల్లో సరికొత్త జోష్‌ కనిపిస్తోంది.  

జిల్లా అధ్యక్షులు వీరే..

జిల్లా పేరు    అధ్యక్షులు
1    చిత్తూరు    కేఆర్‌జే భరత్‌
2    అనంతపురం    కాపు రామచంద్రారెడ్డి
3    శ్రీసత్యసాయి    ఎం. శంకర్‌ నారాయణ
4    అన్నమయ్య    గడికోట శ్రీకాంత్‌రెడ్డి
5    కర్నూలు    వై. బాలనాగిరెడ్డి
6    నంద్యాల    కాటసాని రాంభూపాల్‌రెడ్డి
7    వైఎస్సార్‌(కడప)    కే. సురేష్‌ బాబు
8    తిరుపతి    చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
9    నెల్లూరు    వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
10     ప్రకాశం    బుర్రా మధుసూదన యాదవ్‌
11    బాపట్ల    మోపిదేవి వెంకట రమణ
12     గుంటూరు    మేకతోటి సుచరిత
13    పల్నాడు    పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
14    ఎన్టీఆర్‌    వెల్లంపల్లి శ్రీనివాస్‌రావు
15    కృష్ణా    పేర్ని వెంకటరామయ్య( నాని)
16    ఏలూరు    ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని) 
17     పశ్చిమ గోదావరి    చెరుకువాడ శ్రీరంగనాధ రాజు
18     తూర్పు గోదావరి    జగ్గంపూడి రాజ ఇంద్ర వందిత్‌
19    కాకినాడ    కురసాల కన్నబాబు
20    కోనసీమ    పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌
21    విశాఖపట్నం    ముత్తెంశెట్టి శ్రీనివాసరావు
22     అనకాపల్లి    కరణం ధర్మశ్రీ
23    అల్లూరి సీతారామ రాజు    కొట్టగుల్లి భాగ్యలక్ష్మీ
24     పార్వతీపురం మాన్యం    పాముల పుష్పశ్రీవాణి
25     విజయనగరం    చిన్న శ్రీను
26     శ్రీకాకుళం    ధర్మాన కృష్ణదాస్‌
రీజినల్‌ కో- ఆర్డినేటర్లు

జిల్లాలు, నియోజకవర్గాలు    రీజినల్‌ కో ఆర్డినేటర్‌
1    చిత్తూరు,అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య    డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
2    కర్నూలు, నంద్యాల    సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
3    వైఎ‍స్సార్‌, తిరుపతి    అనిల్‌ కుమార్‌ యాదవ్‌
4    నెల్లూరు, ప్రకాశం, బాపట్ల    బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి
5    గుంటూరు, పల్నాడు    కొడాలి వెంకటేశ్వరరావు( నాని)
6    ఎన్టీఆర్‌, కృష్ణా    మర్రి రాజశేఖర్‌
7    ఏలురు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ    పీవీ మిథున్‌రెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌
8    విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామ రాజు    వైవీ సుబ్బారెడ్డి
9    పార్వతీపురం మాన్యం, విజయనగరం, శ్రీకాకుళం    బొత్ససత్యనారాయణ

26 జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులు వీరే..
 
జిల్లా పేరు    ఇన్‌చార్జి మంత్రి
1    గుంటూరు    ధర్మాన ప్రసాదరావు
2    కాకినాడ    సీదిరి అప్పల రాజు
3    శీ​కాకుళం    బొత్స సత్యనారాయణ
4    అనకాపల్లి    రాజన్న దొర
5    ఏఎస్‌ఆర్‌ఆర్‌     గుడివాడ అమర్నాథ్‌
6    విజయనగరం    బూడి ముత్యాల నాయుడు
7    పశ్చిమ గోదావరి    దాటిశెట్టి రాజా
8     ఏలూరు    పినిపె విశ్వరూప్‌
9    తూర్పుగోదావరి    చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్‌
10    ఎన్టీఆర్‌    తానేటి వనిత
11     పల్నాడు    కారుమూరి వెంకట నాగేశ్వరరావు
12    బాపట్ల    కొట్టు సత్యనారాయణ
13    అమలాపురం    జోగి రమేష్‌
14    ఒంగోలు    మేరుగ నాగార్జున
15    విశాఖపట్నం    విడదల రజిని
16    నెల్లూరు    అంబటి రాంబాబు
17    కడప    ఆదిమూలపు సురేష్‌
18    అన్నమయ్య    కాకాణి గోవర్థన్‌రెడ్డి
19    అనంతపురం    పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
20    కృష్ణా    ఆర్కే రోజా
21    తిరుపతి    నారాయణ స్వామి
22    నంద్యాల    అంజాద్‌ బాషా
23    కర్నూలు    బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
24    సత్యసాయి    గుమ్మనూరి జయరాం
25    చిత్తూరు    కేవి ఉషాశ్రీ చరణ్‌
26     పార్వతీపురం    గుడివాడ అమర్నాథ్‌
 

తాజా వీడియోలు

Back to Top