అనకాపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి మానవత్వం చూపారు. అనకాపల్లి జిల్లా పర్యటనలో పలువురు అనారోగ్యంతో బాధపడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి..తక్షణమే సాయం చేయాలని ఆదేశించడం, ఆ వెంటనే అధికారులు సాయం చేయడం చకచకా జరిగాయి. సీఎం వైయస్ జగన్ చూపిన మంచి తనానికి, మానవత్వానికి బాధిత కుటుంబాలు మనసున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడుతున్నారు. ఎలమంచిలి పర్యటనలో అనారోగ్య బాధితులను ముఖ్యమంత్రి కలిసి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి బాధితులతో మాట్లాడి అవసరమైన సాయం చేశారు. కొండమంచిలి వాణి ఎలమంచిలి కుమ్మరివీధికి చెందిన కొండమంచిలి వాణి అనే బాలికకు చిన్నప్పటి నుంచి మాటలు రాకపోవడంతో పాటు చెవులు వినపడడం లేదు. మెరుగైన చికిత్స అందించేందుకు తగిన ఆర్ధిక స్ధోమత లేదని ముఖ్యమంత్రికి విన్నవించుకున్న వాణి అమ్మమ్మ, తక్షణ సహాయానికి హామీనిచ్చిన సీఎం కలగా శివాజి ఎస్ రాయవరం మండలం సైతారుపేటకు చెందిన కలగా శివాజి మోటర్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందాడు. ఆ తర్వాత క్రమేపి ఇతర అవయవాలు పనిచేయకపోవడంతో వీల్‌ఛైర్‌కే పరిమితమయ్యాడు. తనకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు తగిన ఆర్ధిక స్ధోమత లేదని సీఎంకి విన్నవించుకున్న శివాజి కుటుంబ సభ్యులు. తక్షణ సహాయానికి హమీనిచ్చిన సీఎం. ముఖ్యమంత్రి ఆదేశాలతో అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ షెట్టి సీఎం రిలీఫ్ పండ్ నుంచి రూ. లక్ష చొప్పున బాధితులు ఇద్దరికీ మంజూరు చేశారు. ఆ చెక్కులను అనకాపల్లి ఆర్డీవో ఏ.జి.చిన్నికృష్ణ స్ధానిక తహశీల్దార్ కార్యాలయంలో బాధితులకు అందజేశారు. సీఎం స్పందనతో బాధిత కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. తమ సమస్యపై ఇంత త్వరగా ముఖ్యమంత్రి గారు స్పందించడం జీవితాంతం మరువలేమన్నారు.