అమ‌రావ‌తిలో ‘ప‌చ్చ‌’ధ‌నం

ఒక్కొ మొక్క విలువ రూ.10 ల‌క్ష‌లు 

మొక్క‌ల కొనుగోలుకు ల‌క్ష‌ల్లో ప్ర‌జాధ‌నం వృథా 

రూ.5 కోట్ల‌తో 3970 మొక్కల కొనుగోలుకు ఏడీసీ నిర్ణయం

అమ‌రావ‌తి: ఇన్నాళ్లు చంద్ర‌బాబు అమ‌రావ‌తి ఇలా ఉంటుంద‌ని బాహుబ‌లి గ్రాఫిక్స్ చూపించారు. ఇప్పుడు ఏకంగా మొక్క‌ల కొనుగోలుతో ప్ర‌జ‌ల‌కు రాజ‌ధానిలో చుక్క‌లు చూపిస్తున్నారు. గ‌తంలో బాబు గారు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన స‌మ‌యంలో ప‌నికి ఆహారం ప‌థ‌కం పేరుతో ప‌చ్చ నేత‌లు అడ్డంగా సంపాదించారు. ఇప్పుడు నీరు-చెట్టు పేరుతో ఎడాపెడా దోచుకొని ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా బాబు గారి జ‌మానాలో మ‌రో కుంభ‌కోణం వెలుగు చూసింది. అమ‌రావ‌తిలో మొక్క‌ల ఏర్పాటుకు ఒక్కో మొక్క‌కు ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తున్నారు. రూ. 5 కోట్ల‌తో 3970 కాస్ట్లీ మొక్క‌లు కొనుగోలు చేయాల‌ని అమ‌రావ‌తి డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌(ఏడీసీ) నిర్ణ‌యం తీసుకుంది. రాజ‌ధానిలో ప‌ర్మినెంట్ పేరుతో ఇంత‌వ‌ర‌కు ఒక ఇటుక కూడా వేయ‌లేదు. అలాంటిది ప‌చ్చ‌ద‌నం పేరుతో ప్ర‌జాధ‌నాన్ని దోచుకునే ప‌నిలో ప‌డ్డారు అధికార పార్టీ నేత‌లు. 
అసలు అమరావతి కోసం దాదాపు పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క మొక్క కొనుగోలు  చేసి ఏమి చేస్తారు? ఇదొక్కటే కాదు..ఆలివ్ మల్టీ బ్రాంచెస్ మొక్కలను కూడా ఒక్కో మొక్కను 1.60 లక్షల రూపాయలతో కొనుగోలు చేయనున్నారు. ఆ రేటుతో పది మొక్కలు  కొంటారట. పెద్ద ఆవివ్ మొక్కలను ఒక్కోటీ 7.80 లక్షల రూపాయలతో కొనుగోలు చేయనున్నారు.  అదే ధరకు నాలుగు మొక్కలు కొంటారు. ఇలా చెప్పుకుంటే పోతే రకరకాల మొక్కల రేట్లు 80 వేలు.32 వేలు, 3.20 లక్షలు, 96 వేలు, 1.50 లక్షల ధరతో ఒక్కో మొక్క కొంటారట. 2019 సంవత్సరంలో ఏపీ నూతన రాజధాని ప్రాంతం అమరావతిలో వేసేందుకు మొత్తం రూ.5.10 కోట్ల‌ అంచనా వ్యయంతో 3970 మొక్కలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు.

ఈ మొక్కల ధరలను కమిటీ ఖరారు చేసింది. ఈ లెక్కన ఒక్కో మొక్కకు సగటు ధర సుమారు రూ. 12000 పైనే పడుతుంది. అసలు ఒక్కో మొక్కను పది లక్షలు..ఐదు లక్షల రూపాయలుపెట్టి కొనుగోలు చేయటం ఏమిటో అర్థం కావటం లేదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పోనీ అమరావతిలో శాశ్వత రాజధాని భవనాలు అన్నీ పూర్తయ్యాయి..అందుకే ఇంత హడావుడి చేస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. అందులో ఒక్క సచివాలయం పనులు మాత్రమే ప్రారంభం కాగా..మిగిలిన భవనాల పనులు ప్రాధమిక దశకు కూడా చేరుకోలేదు.

ఇఫ్పటికే అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో జరిగే మొక్కల స్కామ్ లను చూసి ఉద్యోగులు పరార్ అవుతున్నాయి. అయినా సరే ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్ధసారధి మాత్రం ఏ మాత్రం వెనకడుగు వేయటం లేదు. గతంలో కూడా కేవలం రూ.500లకు దొరికే మొక్కలను వేలకు వేలు పోసి కొనుగోలు చేసి ప్రజల సొమ్మును కాజేశారు. ఇఫ్పుడు మరోసారి అలాంటి ప్లాన్ తోనే ఈ టెండర్ డిజైన్ చేశారని చెబుతున్నారు. ఒక్కో మొక్క రేటును పది లక్షలు..ఐదు లక్షలు..మూడు లక్షలు పెట్టి కొనటం ఏమిటని అధికారులు కూడా నివ్వెరపోతున్నారు. ఇప్ప‌టికే ఇసుక‌, మ‌ట్టి, బొగ్గు కొనుగోలు, క‌రెంటు కొనుగోలు, రాజ‌ధాని భూములు, గుడి భూములు వ‌ద‌ల‌ని ప‌చ్చ నేత‌లు మొక్క‌ల పేరుతో స్కామ్‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రోజుకో స్కామ్‌లో టీడీపీ నేత‌లు చేస్తున్న అవినీతిని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌చ్చ నేత‌ల‌కు గుణ‌పాఠం త‌ప్ప‌దు.

Back to Top