సిఎం ముఖ్య సలహాదారుగా అజయ్ కల్లం

రాష్ట్రంలో భారీగా ఉన్నతాధికారుల బదిలీలు

ప్రతిభకు పెద్దపీట

9 జిల్లాలకు కొత్త కలెక్టర్లు

పాలనలో తనదైన ముద్ర వేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్

ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులుగా మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం నియమితులయ్యారు. ఈ హాదాలో ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఒ) అధిపతిగా వ్యవహరించడమే కాకుండా, సీఎంఒ లో నియమితులయ్యే కార్యదర్శులకు శాఖల కేటాయింపు, వివిధ శాఖలకు సలహాలు, సూచనలు ఇవ్వడం తదితర గురుతరమైన బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని అజయ్ కల్లం మర్యాద పూర్వకంగా కలుసుకుని , కీలకమైన బాధ్యతలను అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

కాగా పరిపాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ, రాష్ట్రంలోని పలు జిల్లాల కలెక్టర్లను, వివిధ శాఖాధిపతులు, కార్యదర్శులు  ఇతర ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్లకు తగిన ప్రాధాన్యతనిస్తూ, ప్రతిభకు తగ్గ పోస్టింగులు ఇస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వ  అధికారులు హర్షిస్తున్నారు. ఉభయ గోదావరి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, విశాఖపట్టణం, అనంతపురం, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు కొత్త  కలెక్టర్లను నియమించారు. 

కొత్త పోస్టింగుల వివరాలు ఇలా ఉన్నాయి.

ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వెంకటేశ్వర ప్రసాద్
ఈఎఫ్ఎస్ అండ్ టీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్
జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాధ్థ్‌ దాస్
వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పూనం మాలకొండయ్య
బీసీ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కరకాల వలవన్
పరిశ్రమలు పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శిగా రజత్ భార్గవ.
వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా జవహర్ రెడ్డి
గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శిగా అనంత రాము
యూత్ సర్వీసెస్, టూరిజం ప్రవీణ్ కుమార్
పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్
ట్రాన్స్ పోర్ట్, ఆర్ అండ్ బీ కృష్ణబాబు
స్త్రీ శిశు సంక్షేమ ముఖ్య కార్యదర్శిగా దయమంతి
పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా శ్యామలరావు
ట్రాన్స్ కో ఎండీగా నాగులాపల్లి శ్రీకాంత్
ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఎంకే మీనా
జెన్‌కో ఎండీగా బి. శ్రీధర్
ఏహెచ్డీడీ అండ్ ఎఫ్ సెక్రటరీగా వెంకటేశ్వర ప్రసాద్
సివిల్ సప్లైస్ కమిషనరుగా కోన శశిధర్
హోం సెక్రటరీగా కిషోర్ కుమార్
వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా మధుసూదన్ రెడ్డి
జీఏడీ ముఖ్య కార్యదర్శిగా ఆర్పీ సిసోడియా
విజయానంద్, అజేయ్ జైన్ జీఏడీకి అటాచ్
శాప్ ఎండీగా కాటంనేని భాస్కర్
మార్కెటింగ్ స్పెషల్ కమిషనరుగా ప్రద్యుమ్న
ఎక్సైజ్ కమిషనర్ ఎం ఎం నాయక్
సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా హర్షవర్ధన్
వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌గా ప్రవీణ్ కుమార్
సీఎం ఓఎస్డీగా జె మురళీ
సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా విజయ
ట్రాన్సపోర్ట్ కమిషనరుగా పీఎస్సార్ ఆంజనేయులు
హర్టీకల్చర్.. సెరీకల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరి
వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా పీయూష్ కుమార్
ఇంటర్ విద్య కమిషనర్‌గా కాంతిలాల్ దండే
మున్సిపల్ శాఖ కమిషనర్‌గా విజయ్ కుమార్
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌గా గిరిజా శంకర్
సీఆర్డీఏ కమిషనర్‌గా లక్ష్మీ నరసింహం

జిల్లా కలెక్టర్లు
ప్రకాశం- పి భాస్కర్‌
తూర్పు గోదావరి- మురళీధర్‌రెడ్డి
పశ్చిమ గోదావరి- ముత్యాల రాజు
గుంటూరు- శ్యామూల్‌ ఆనంద్‌
నెల్లూరు- ఎంవీ శేషగిరిబాబు
అనంతపురం- ఎస్‌ సత్యనారాయణ
విశాఖపట్నం- వి వినయ్‌చంద్‌
కర్నూలు- జి వీరపాండ్యన్‌
చిత్తూరు- నారాయణ భరత్‌ గుప్తా

Back to Top