అ...ఆ....లాంటి అమ్మా, ఆడబిడ్డలే వెలుగులు

ఆడబిడ్డలు ఆరోగ్యంగా ఎదగాలి. 

చదువుల తల్లులై వెలగాలి... 

 

ఇది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌ తరచూ చెప్పే మాట. సమాజమంతా ఆ దిశలోనే ఆలోచించాలన్నది ఆయన తపన. చారిత్రాత్మకమైన తన ప్రజాసంకల్పయాత్రలో ...బాలికల భవిష్యత్తుపై ఆయనకెంత తాపత్రయముందో అడుగడుగునా కనిపించింది. పల్లెల గడపల్లోనూ, పట్టణాల చెంత, నగర సీమల్లోనూ ఎందరెందరో బాలికలు పాదయాత్రికుడిని కలిశారు. అలా కలిసినప్పుడల్లా వారి మొహాలు వెలిగిపోయేవి. వికసించిన పూలే అయ్యేవి.

’బాగా చదువుకోవాలమ్మా...’ అంటూ వారితో ఆయన మాట్లాడటం...అపురూప దృశ్యాలే.

వైఎస్‌ జగన్‌ను కలిసిన ఆ ఆడబిడ్డలు తమ సంతోషాన్ని పంచుకున్నారు. తమ కుటుంబాల కష్టాలు చెప్పుకున్నారు. బాగా చదువుకోవాలన్న తమ తపన ను చూపారు. ప్రభుత్వ పాఠశాలలకు వెళుతున్న తమకు కనీస సదుపాయాలు లేకపోవడం నుంచి టాయిలెట్ల సమస్యల వరకు చెప్పుకున్నారు. సిగ్గువిడిచి అవసరాలు తీర్చుకునేందుకు బహిర్భూములను వెదుక్కునే తమ కష్టాన్ని కన్నీటితో చెప్పుకున్నవారెందరో! వారి మాటల్ని ఓ అన్నయ్యలా శ్రద్దగా విన్నాడు జగన్‌. తన పాదయాత్ర డైరీలోనూ పదేపదే ప్రస్తావించారు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు కలిసివస్తే...మనందరి ప్రభుత్వం వస్తుందని...ఈ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతానని హామీ ఇచ్చాడు. 

పాదయాత్రలో ఉదయమే శిబిరం దగ్గర స్కూలుకెళుతూ...జగనన్నను చూసిపోదామని క్యూకట్టిన బాలికలెందరో. వారితో మమేకమై...ఆప్యాయంగా పలకరించడమన్నది జగన్‌కే సాధ్యమైంది. అవున్నిజం!! ఇద్దరు ఆడబిడ్డల తండ్రి మనసది. తన బిడ్డల్లానే ప్రతి ఆడపిల్లా...ప్రతి పేదింటి పిల్లా ఎదగాలని కోరుకునే మంచి మనసు స్పందన...బాలికలతో కలిసినప్పుడు జగన్‌లో కనిపించేది. 

దేశంలో బాలికల పరిస్థితి మెరుగుపడాల్సిన అవసరం ఎంతో వుంది. పెరిగిపోతున్న భ్రూణహత్యలు, అవిద్య, పౌష్టికాహారలోపాలు, లైంగిక నేరాలు ఆందోళన కలిగించే స్థాయిలో వున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇవేవీ తక్కువ కాదు. బాబుగారి పాలన ముగుస్తున్నా... ఆ దిశలో చేసిన గట్టి ప్రయత్నాలేవీ లేవు. కార్పొరేట్‌ విద్యపై మమకారం ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి గడ్డుస్థితిలోకి నెట్టేసింది. సంక్షేమహాస్టళ్ల పరిస్థితి అయితే మరీ ఘోరం. ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లలు కష్టాలు మరీ రెట్టింపవుతాయి. ఆర్థికపరిస్థితులు అనుకూలించకపోతే, అంతంత మాత్రమే అయితే, ఇక చదువుకునే బాలికలకు దేవుడే దిక్కు. పేదరికం శాపమైనప్పుడు...అమ్మానాన్నలు ఎంత తాపత్రయ పడినా, ఒరిగే ప్రయోజనమేమీ ఉండదు. వట్టిప్రేమ కడుపునింపదన్నది ఎంత నిజమో,  కనీస ఫీజులు కట్టలేని, పుస్తకాలు కొనలేని పేదరికం ఆడపిల్లలకు ఎలాంటి చేయూతనందివ్వలేదన్నది వాస్తవం. 

మరి బంగారు తల్లుల భవిష్యత్తుకు భరోసా ఏది?

వారి సమస్యల పరిష్కారానికి దారేది?

ఏ బిడ్డకూ పేదరికం శాపం కారాదని...ఎదిగేందుకు అడ్డుకాకూడదనుకుంటే.... ప్రభుత్వం ఏం చేయాలి? ఈ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం చాలా బాధ్యతా యుతంగా వ్యవహరించాల్సిందే. ఇది మా సమాజం...మాకెంతో ఇష్టం అనే రీతిలో బాలికలు సంతోషంగా ప్రకటించాలంటే...అది మంచి మనసున్న పాలకుడికే సాధ్యం. మంచి సంకల్పంతోనే సుసాధ్యం!

ఆరోగ్యకరమైన సమాజానికి ...ఆరోగ్యకరమైన ఆడబిడ్డలు అవసరం.

గొప్ప సమాజానికి....చదువుకున్న తల్లుల వెలుగులు ఎంతెంతో అవసరం.

ముడిచిన రెక్కలిప్పి...రివ్వున ఎగిరే వెలుతురు బిడ్డలు...మన ఆడబిడ్డలు కావాలంటే...

పేదింట బిడ్డల చదువుల విషయంలో జగన్‌ నవరత్నాల్లో ప్రకటించిన హామీలు అమలు కావాలి. 

వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్రలో బాలికల భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలదీ ఓ ప్రత్యేక అధ్యాయమే. అది అక్షరాల సాధ్యమయితే....బంగారు బాలికలకు ఉజ్జ్వల భవిష్యత్తు అందినట్టే.......
 

తాజా వీడియోలు

Back to Top