కోత‌ల రాయుడు..చంద్ర‌బాబు నాయుడు

టీడీపీ హ‌యాంలో విద్యుత్ కోత‌ల కార‌ణంగా ఒకే రోజు 20 మంది మృత్యువాత‌

 క‌రెంటు చార్జీలు త‌గ్గించ‌మన్న రైతుల‌పై కాల్పులు 

కరెంటు బిల్లులు కట్టని రైతును జైలుకు పంపిన ఘనత చంద్రబాబుది

విద్యుత్ సంక్షోభానికి చంద్ర‌బాబే ఆధ్యుడు

అమ‌రావ‌తి: జూన్ 23, 2017న కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో బుధ‌వారం రాత్రి 7 గంటల నుంచి గురువారం ఉదయం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో 12 గంటల పాటు అంధకారం నెల‌కొంది. విద్యుత్ కోత కార‌ణంగా రాత్రి స‌రైన వైద్యం అంద‌క‌ ఎనిమిది మంది చిన్నారులు సహా 20 మంది రోగులు మృత్యువాత ప‌డ్డారు. ఆ రోజు పలువురికి విషాదకరమైన అనుభవం ఎదురైంది. చనిపోయిన 20 మంది రోగులలో నలుగురు మహిళలు 8 మంది చిన్నారులు ఉన్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న అప్ప‌టి ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను కలిసి నివేదిక కోరారు. రోగులు ప్రాణాలతో పోరాడుతున్నప్పటికీ డ్యూటీ డాక్టర్లు ఎవరూ వార్డుల్లో లేరని చెప్పారు. విద్యుత్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను అప్ప‌టి మంత్రి ఆదేశించింది వాస్త‌వం కాదా?. ఈ మ‌ర‌ణాల‌కు చంద్ర‌బాబు కార‌ణం క‌దా?

2000 ఆగస్టు 28వ తేదీన హైదరాబాదులోని బషీర్ బాగ్ చౌరస్తా అట్టుడికింది. పోలీసు కాల్పులతో దద్ధరిల్లింది. అప్పుడు చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికరాంలో ఉంది. విద్చుచ్చక్తి రేట్లను విపరీతంగా పెంచడానికి వ్యతిరేకంగా పోరాటం సాగింది. తొమ్మిది వామపక్షాల ఆధ్వర్వంలో దశలవారీగా ఉద్యమం వూపందుకుంది. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెసు పార్టీ ఆ ఉద్యమానికి మద్దతు తెలిపి, అందులో పాల్గొంది. విద్యుత్తు చార్జీల పెంపునకు నిరసనగా ఆగస్టు 28 చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారు. దాంతో బషీర్ బాగ్ వద్ద ముళ్ల కంచెలు వేసి భారీగా పోలీసులను మోహరించారు. ముందుకు రాకుండా దిగ్బంధం చేయాలనే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బాలస్వామి, విష్ణువర్ధన్‌, రామకృష్ణ మరణించారు. విద్యుత్తు చార్జీల పెంపును నిరసిస్తూనే అప్పటి డిప్యూటీ స్పీకర్‌ పదవికి కె.చంద్ర శేఖర రావు రాజీనామా చేసి తెలుగుదేశం నుంచి బయటకు వచ్చారు.  ఈ మ‌ర‌ణాల‌న్నీ చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు జ‌రిగిన‌వే. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం ఏపీలో విద్యుత్ సంక్షోభానికి చంద్ర‌బాబే ఆధ్యుడిగా నిలిచారు.  

చంద్ర‌బాబు పాల‌న‌లో ఎడాపెడా కోత‌లు
చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో రాత్రీపగలు అప్రకటిత విద్యుత్‌ కోతలతో జనం విలవిల్లాడిపోయారు.  అమ్మకాలు సాగక వ్యాపారులు నిరాశ చెందారు. ఎలక్ర్టికల్‌ మెకానిక్‌లకు పని ఉండేది కాదు.  మీసేవ, ఇంటర్‌నెట్‌ సెంటర్లు మూతపడ్డాయి.  జిరాక్స్‌ మిషన్‌లు పనిచేయ‌లేదు. అత్యవసర వైద్యంతో ముడిపడిన ల్యాబ్‌లలో కూడా కరెంటు లేక రోగులు తిప్పలు పడాల్సి వచ్చేది. రైతులు సాగునీటికి అవస్థలు పడ్డారు. ఇళ్ల వద్ద చిన్నపిల్లల రోదన.. వృద్ధుల వేదనకు అంతే ఉండేది కాదు. అంతటా వేళాపాళాలేని విద్యుత్‌ కోతలు వినియోగదారుల సహనాన్ని పరీక్షించారు. పవర్‌కట్‌ నిజమేనని సంబంధిత అధికారులు ధ్రువీకరిస్తూనే రాత్రి వేళల్లో మాత్రమే ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ (ఈఎల్‌ఆర్‌) కింద గంటన్నర పాటు కోతలు విధించేవారు.  పగటి పూట కూడా నిరంతరం కోతలు విధించేవారు. పల్లె, పట్నం తే డా లేకుండా టీడీపీ పాల‌న‌లో కరెంట్‌ వెతలతో ప్రజలు నరకం చూశారు.  రాత్రి వేళల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. ఏడు నుంచి ఎనిమిది గంటల లోపు ఏ క్షణాన్నయినా సరఫరా నిలిపివేసేవారు.  గ్రామాల్లో కుటీర పరిశ్రమలు కునారిల్లాయి. పట్టణాల్లో చిన్న పరిశ్రమలు ఉత్పత్తిని నిలిపేశాయి. వినియోగదారుల అవస్థలకు అంతులేకుండా ఉండేది.   తమ హయాంలో రాష్ట్రమేదో విద్యుత్ మహావైభవాన్ని అనుభవించినట్టు..రైతులు ఆనందంతో పండుగల మీద పండుగలు చేసుకున్నట్టు ఇప్పుడు టీడీపీ నేత‌లు ప్రచారాలు చేసుకుంటున్నారు. తమ హయాంలో విద్యుత్ కోతలే లేనట్టు, ఒక్క రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడనట్టు చిత్రిస్తున్నారు.    టీడీపీ హయాంలో తొమ్మిదేండ్లలో 12 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కరెంటు బిల్లులు కట్టని రైతును జైలుకు పంపిన ఘనత చంద్రబాబుది. కరెంటు బిల్లులు పెంచి, విత్తనాలు ఎరువుల సబ్సిడీలు ఎత్తివేసి రైతులకు ఆత్మహత్యల దారిచూపింది టీడీపీ సర్కారే. 

బాబు హయాంలోనే మొదలైన ఆత్మహత్యలు..: 
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల పరంపర చోటుచేసుకున్నది 1997-98నుంచే. అపుడు రాష్ట్రంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో ఒక రైతు కండ్లముందే పంట మలమల మాడిపోవడం చూసి గుండె చెదిరి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పత్తి విత్తనాల వైఫల్యం, వర్షాభావం, విద్యుత్ కోతలు దానికి కారణం. అపుడు మొదలైన ఆ ఆత్మహత్యల పరంపర చంద్రబాబు సర్కారు కొనసాగినంతకాలం కొనసాగుతూ వచ్చింది.

రైతులు తమ సమస్యలకు ఆత్మహత్యల్లో పరిష్కారం వెతుక్కునే ఆనవాయితీకి కారణం చంద్రబాబు పాలనే. కనీసం నకిలీ విత్తనాలు కూడా అరికట్టలేని ఆ సర్కారు వైఫల్యం కారణంగా వందల మంది రైతులు బలయ్యారు. రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వకపోగా వ్యవసాయం దండుగ అని ఆ రంగాన్ని చంద్రబాబు పట్టించుకోలేదు. పైగా చనిపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తే ఆత్మహత్యలకు ప్రోత్సహించినట్టు అవుతుందని కొత్త నిర్వచనం ఇచ్చింది కూడా చంద్రబాబే. ఆయన హయాంలోనే ప్రపంచబ్యాంకు ఆదేశాలతో విత్తనాలు ఎరువుల మీద సబ్సిడీలు క్రమంగా ఎత్తేశారు. ఫలితంగా వ్యవసాయం రైతుకు మోయలేని భారంగా మారింది. వారికి నాటి సర్కారు ఏ ఉపశమనం కల్పించలేదు.    

1997 నుంచి 2004 వరకు 12 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనికి కారణం ఏమిటి? ఆయన బడ్జెట్ కేటాయింపులు చెప్పకనే చెప్తాయి. చంద్రబాబు అధికార వియోగానికి ఒక ఏడాది ముందు అంటే 2002-03 సంవత్సరంలో ప్లాన్ బడ్జెట్‌లో వ్యవసాయానికి ఇచ్చింది కేవలం 2.15 శాతం. ఆయన హయాంలో అత్యధికంగా ఇచ్చింది 4.80 శాతం మాత్రమే. ఇదిచాలు చంద్రబాబు రైతు ప్రేమ వివరించేందుకు.   

ముఖ్యంగా 1997 నుంచి క్రమంగా విద్యుత్ చార్టీలు పెరిగి తడిసి మోపెడు కావడం, విత్తనాలు, ఎరువుల మీద సబ్సిడీలు ఎత్తివేయడంతో మొత్తంగా వ్యవసాయం మీద వ్యయం 50 శాతానికి పైగా పెరిగింది. ఇందులో విద్యుత్ వాటా 20 శాతం. ముఖ్యంగా 1990-2003 మధ్య వ్యవసాయం మీద ప్రభుత్వ పెట్టుబడులు భారీగా పడిపోయాయి. చెరువుల మరమ్మతులు, కాల్వల నిర్వహణ పడిపోయింది. నూతన ప్రాజెక్టుల మీద పెట్టుబడులు ఆగిపోయాయి. విద్యుత్ బిల్లులు కట్టక ఎత్తిపోతల పథకాలు ఆగిపోయాయి. 

నెల రోజుల్లోనే విద్యుత్ కోత‌ల‌ను గాడిలో పెట్టిన వైయ‌స్ జ‌గ‌న్‌
2014లో వైయ‌స్ఆర్‌సీపీ  అధికారంలోకి వచ్చే సరికి రాష్ట్రం విద్యుత్ కోతలతో అతలాకుతలమైంది. నెల రోజుల్లోనే వైయ‌స్ జ‌గ‌న్ గాడిలో పెట్టి విద్యుత్ కోతలు లేకుండా సమర్థవంతంగా పాలన చేయగలిగారు. గతంలో చంద్రబాబు చేసిన అప్పులు రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని ఇబ్బంది పెట్టాయి.  రూ.60 వేల కోట్ల చంద్రబాబు అప్పులు ఇప్పటికి రూ.85 వేల కోట్లకు చేరింది. అందుకే విద్యుత్ ఛార్జీలు కొంచెం పెంచాల్సి వచ్చింది.   రాష్ట్రంలో ఎవర్నీ ఇబ్బంది పెట్టకూడదని ముఖ్యమంత్రి జగన్ ఆలోచన.  వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వం మూడేళ్లుగా ఛార్జీలు పెంచలేదు.  గత టీడీపీ హయాంలో రూ.19 వేల కోట్లు ట్రూ అప్ ఛార్జీలను వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం స‌రిచేసింది. చంద్రబాబు హయాంలో తక్కువ రేటుకు కరెంటు కొనుగోలు చేయటం.. వినియోగదారులకు ఎలా అందించాలనే ఆలోచనే చేయలేదు. అవసరం లేకపోయినా కరెంటును అడ్డగోలుగా కొనుగోలు చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం మార్కెట్ లో తక్కువ ధరకి మాత్రమే కొనుగోలు చేస్తుంది.  గత ప్రభుత్వంలా విచ్చలవిడిగా కరెంటు కొనుగోలు చేయటం లేదు. కేంద్రం పెట్రోలు ధరలు విపరీతంగా పెంచుతున్నా టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు. చంద్రబాబుకు పోలవరంలో భజన పాటలు పాడించటానికే వంద కోట్లు ఖర్చు చేశారు.   

 
రైతుల‌ను ఏనాడు ప‌ట్టించుకోని చంద్ర‌బాబు
14 ఏళ్లపాటు ముఖ‍్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు, ఏనాడూ రైతుల గురించి పట్టించుకోలేదు. 1995 నుంచి 2004లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా దిగిపోయేనాటికి రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. ప్రాజెక్టులలో నీళ్లు లేక, పంటలు పండించుకోలేక, లక్షలాది మంది వలసలు వెళ్ళిన తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు చూశాం. చేసిన అప్పులను తీర్చుకునేందుకు భూములు అమ్ముకుందామన్నా వాటి ధరలు కూడా పడిపోయాయి. చంద్రబాబు హయాంలో 18 సహకార బ్యాంకులు దివాళా తీసిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల సమస్యకు పరిష్కారం చూపాలని, నష్టపరిహారం ఇవ్వాలని అప్పట్లో వైయస్ రాజశేఖరరెడ్డి కోరితే.. “నష్ట పరిహారం ఇస్తే మరింత మంది రైతులు కావాలని ఆత్మహత్యలు చేసుకుంటారని” రైతుల గురించి అంత చులకనగా, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాట్లాడిన ఏకైక వ్యక్తి చంద్రబాబు.

ఉచిత విద్యుత్ ఇస్తామంటే హేళ‌న‌గా మాట్లాడింది నీవు కాదా బాబూ?
వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇవ్వమంటే.. “ఉచిత విద్యుత్ ఇస్తే.. కరెంటు తీగలు మీద బట్టలు ఆరేసుకోవాలి” అని చంద్రబాబు మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం గురించి అడిగితే.. “పావలా వడ్డీ కూడా రాదు, ప్రాజెక్టులు దండుగ” అని చంద్రబాబు తన ‘మనసులో మాట’ పుస్తకంలో రాసుకున్నారు. గతంలో తన 9 ఏళ్ళ పాలనలో ఒక్క సాగునీటి ప్రాజెక్ట్‌ను చేపట్టలేదు. పైగా, దేవగౌడను తానే ప్రధానమంత్రిని చేశానని చెప్పుకునే చంద్రబాబు, ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఉరితాడుగా మారిన కర్ణాటక సర్కార్‌ చేపట్టిన ఆల్మట్టి ఎత్తు పెంపు విషయంలోనూ మౌనంగా ఉండిపోయారు. వ్యవసాయం, సాగునీటి రంగాలకు చంద్రబాబు చేసిందేమీ లేదు.   ఇలాంటి వ్య‌క్తి ఇవాళ విద్యుత్ కోత‌లంటూ కొత్త అవ‌తారం ఎత్తాడు. చంద్ర‌బాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు తెలుసు. కాబ‌ట్టి కోత‌ల రాయుడు.. చంద్ర‌బాబు నాయుడు నీ ఆట‌లు సాగ‌వ‌ని ముక్త‌కంఠంతో హెచ్చ‌రిస్తున్నారు.

తాజా వీడియోలు

Back to Top