రైతులకు అండగా నిలిచింది మాత్రం వైఎస్సార్సీపీ నే


అమరావతి రాజధాని ప్రాంతంలో రైతులకు కష్టం వచ్చిన ప్రతీసారి
ముందు ఉండి సాయం చేస్తున్నది వైఎస్సార్సీపీ. ఇతర ప్రజా సంఘాలు, సమభావిత రాజకీయ
పక్షాలతో కలిసి రైతులతో పోరాడుతూ వస్తోంది. తాజాగా అరటి తోటను నష్టపోయిన రైతుకు
కూడా వైఎస్సార్సీపీ బాసటగా నిలిచింది.

ల్యాండ్ పూలింగ్ కు సహకరించని రైతుల మీద మొదట నుంచి
చంద్రబాబు కక్ష పూరితంగా వ్యవహరిస్తూ వచ్చింది. మొదట్లోనే భూములు ఇవ్వని రైతుల్ని
వేధించేందుకు కొత్త ఎత్తుగడ వేసింది. 13 ప్రాంతాల్లోని పొలాల్లో పరికరాలు
ఎత్తుకెళ్లిపోయారు. ఇదంతా పచ్చ చొక్కాల పనే అన్న సంగతి అందరికీతెలుసు. కేవలం
పూలింగ్ కు సహకరించని రైతుల పొలాల్లోనే దొంగతనాలు జరగటాన్ని బట్టి అర్థం
చేసుకొన్నారు. అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవటంతో వైఎస్సార్సీపీ నాయకులు బాధితులకు
అండగా నిలిచారు.

గత అక్టోబర్ లో భూమి ఇవ్వనందుకు ఒక చెరకు రైతు పొలంలోని
పంటను మొత్తం కాల్చేశారు. ఈ ఘటనలో బాధితుల పక్షాన పార్టీ నిలిచింది. అందరికీ ఈ
విషయం తెలిసి వచ్చేలా చేసింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈ ప్రాంతంలో పర్యటించి
బాధితుల్ని పలకరించి ధైర్యం చెప్పారు.

తాజాగా ఏడున్నర ఎకరాల పొలంలో అరటి తోటను అధికారులే ధ్వంసం
చేశారు. కేవలం భూములు ఇవ్వనందుకు నిరసనగా ఈ చర్యలకు దిగినట్లు సమాచారం. బాధితుల
తరపున వైఎస్సార్సీపీ నాయకులు పోరాటానికి దిగారు. పంట పొలాల విధ్వంసాన్ని నిరసిస్తూ
కేసు పెట్టించారు. బాధితులకు అండగా నిలిచారు.

Back to Top