ప్రజల తరపున ఆరో వసంతంలోకి..!

() నిరంతరం ప్రజల పక్షం

() పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమ పక్షం

() ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా అలుపెరగని పోరాటం

() పోరాటమే ఊపిరిగా పార్టీ ప్రస్థానం

హైదరాబాద్) ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నూతన ఒరవడి ప్రవేశ పెట్టి అయిదేళ్లు
పూర్తయింది. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న వైఎస్సార్సీపీ రేపటితో ఆరో వసంతంలోకి
అడుగుపెడుతోంది. కేవలం ఇద్దరు ప్రజా ప్రతినిధులతో ప్రస్థానం ప్రారంభించి
ఆంధ్రప్రదేశ్ లో బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించి ప్రజల కోసం.. ప్రజల తరపున
పోరాడుతున్న ప్రజల పార్టీ వైఎస్సార్సీపీ.

నేపథ్యం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఒంటిచేత్తో శాసించి, ప్రజల అవసరాల్ని కనిపెట్టుకొని
చూసుకొంటూ, ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మహా నేత డాక్టర్ వైఎస్సార్. ఆయన
హఠాన్మరణంతో తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు క్రమంగా సంక్షేమ బాట నుంచి పక్కకు
తప్పుకోసాగాయి. ఈ లోగా ప్రజల కంటకుడుగా పేరు తెచ్చుకొన్న చంద్రబాబు అప్పటి
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభావితం చేయసాగిన పరిస్థితుల్లో ..దివంగత మహానేత ఆశయాల
సాధన కోసం, ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చటం కోసం కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకి జన
నేత వైఎస్ జగన్ అడుగులు వేశారు.

పార్టీ ఏర్పాటు

దివంగత నేత వైఎస్సార్ పేరుతో కొత్త పార్టీ మొగ్గ తొడిగింది. యువజన శ్రామిక
రైతు కాంగ్రెస్ పార్టీ..సంక్షిప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త తరం
నాయకులతో ఆవిర్భవించింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కి విశేష స్పందన లభించింది.
అన్ని తరాల నాయకులతో కలిసి ప్రజల తరపున ప్రస్థానం మొదలైంది. పార్టీ జెండాను,
అజెండాను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించుకొన్నారు. అధ్యక్షునిగా బాధ్యతలు
స్వీకరించినప్పటి నుంచి జన నేత వైఎస్ జగన్ నిరంతరాయంగా ప్రజలతో మమేకం అయ్యారు.

పార్టీ ప్రస్థానం

వైఎస్సార్సీపీ ఆవిర్భవించినప్పటి నుంచి జనం తరపున గణనీయమైన పాత్ర పోషించింది.
ప్రజల అవసరాలు, అభీష్టాలకు అనుగుణంగా ఉద్యమ బాట పట్టింది. ప్రజల తరపున పోరాట
పంథాను అనుసరించింది. రైతులు, యువజనులు, కార్మికులు, మహిళలు, విద్యార్థుల తరపున
వివిధ మార్గాల్లో ప్రజాస్వామికంగా పోరాడుతోంది. ప్రభుత్వాల దుర్మార్గ వైఖరిని
ఎప్పటికప్పుడు ఎండగడుతూ ముందుకు అడుగు వేసింది.

 

Back to Top