నవ శకానికి నవరత్నాలు

ప్రజా తీర్పును గౌరవించే సంస్కృతి వైయస్సార్ కుటుంబానిది. అందుకే 2009 ఎన్నికల్లో గెలిచి  మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు కూడా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఓ మాటన్నారు. ‘’అనుకున్న దానికన్నా తక్కువ మెజార్టీ వచ్చింది. ప్రజలు మన ప్రభుత్వానికి పాస్ మార్కులే వేశారు. అంటే కొంత అసంతృప్తితో ఉన్నారు. దాన్ని కూడా దూరం చేయాలి. సంక్షేమం కోసం మనం ఖర్చుచేసే ఆఖరి రూపాయి కూడా లబ్దిదారులకు చేరాలి’’.

విలువలను నమ్మి, ప్రజల విశ్వాసాన్ని నమ్మి, సంక్షేమం కోసమే ఆలోచించే నాయకుడు మాత్రమే అనగలిగే మాటలవి. ఆయన వాగ్దానాలు గాలిలో రాతలు కావు. గెలిచిన వెంటనే ముఖం చాటేసే నీతిమాలిన పనులు ఆయనకు చేతకావు. చెప్పినవే కాదు, చెప్పనివి కూడా చేసి ప్రజల అభిమానాన్ని గెలుచుకున్నారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన అడుగు జాడల్లో నడుస్తున్న నాయకుడు నేటి యువనేత, వైయస్సార్ సిపి అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయనది ఒకటే ఆశయం. ప్రజా సంక్షేమం. ఒకే బాట. వైయస్ నడిచి చూపిన బాట. ఒకే మాట. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం. 

వైయస్ జగన్ మోహన్ రెడ్డి… అధికారం గురించి ఆలోచించలేదు. వెన్నుపోట్లను లెక్క చేయలేదు. కక్షసాధింపులనూ ఖాతరు చేయలేదు. ప్రతి అడుగూ ప్రజాస్వామ్యం వైపే వేసాడు. ప్రతి మాటా ఆ ప్రజలకోసమే మాట్లాడాడు. తన కుటుంబం అంటే అమ్మ, భార్య, పిల్లలు, చెల్లెలు మాత్రమే కాదు, కోట్లాది తెలుగు ప్రజలంతా తన కుటుంబమే అన్నాడు. అది పెద్దమనసు. అతనిది పెద్ద బాధ్యత. ఆ బాధ్యతతోనే తన కుటుంబానికి మణిపూసల్లాంటి తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలను అందిస్తానన్నాడు. ఒక వర్గం, ఒక కులం, ఒక మతం, ఒక ప్రాంతం చివరకు ఒక పార్టీ కార్యకర్త అనే బేధం ఇందులో లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికీ నవరత్నాలు అందుతాయి. లోటు అనే మాట తన కుటుంబం నోట ఉండకూడదు అనుకున్నప్రతి ఇంటి పెద్దకొడుకు అతడు. 

 • అందుకే వృధులకు ఫించను వెయ్యి నుంచి రెండు వేలు చేసి చేయూత ఇస్తానన్నాడు. 
 • రైతును రాజుగా చూడాలనుకున్న వైయస్సార్ ఆశకు ఊతం ఇస్తూ ఐదెకరాల లోపు పొలం ఉన్న ప్రతిరైతుకు ఏటా 50 వేల రూపాయిలు భరోసాగా అందిస్తానని హామీ ఇచ్చాడు. 
 • అప్పుల ఊబిలో కూరుకుపోయిన డ్వాక్రా అక్కచెల్లెళ్లకు వాటినుంచి పూర్తిగా విముక్తి కలిగిస్తానని మాట ఇచ్చాడు. 
 • నిలువ నీడ లేని పేదలకు పక్కా ఇళ్లను కట్టించి వారి జీవితానికో గూడు అందిస్తానన్నాడు. తాము అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో 25లక్షల ఇళ్లను కట్టి పేదలకు అందించడమే తన లక్ష్యమని చెప్పాడు.
 • అరకొర నిధులతో ఆరోగ్యశ్రీ అవసాన దశకు చేరింది. దానికి పూర్వ జవసత్వాలు నింపుతానన్నాడు. పేదలందరికీ పెద్దవైద్యాన్ని తిరిగి ఉచితంగా అందిస్తానని హామీ ఇచ్చాడు. 
 • అమ్మ ఒడి ద్వారా ప్రతి ఒక్కరికి విద్యను అందించి అక్షరాస్యతకు గట్టి పునాది వేస్తానని ఒట్టేసాడు. 
 • ఉన్నత చదువుల కలలు కల్లలు కాకుండా విద్యార్థులకు ఫీజ్ రీ ఎంబర్స్ మెంట్ తో పాటు, ఉచిత భోజన సదుపాయాన్ని అందిస్తానని ప్రమాణం చేసాడు. 
 • ఆంధ్రరాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఉంచేందుకు జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నాడు.
 • దశల వారీగా మద్యనిషేధాన్ని అమలు చేస్తామని ప్రజలందరికీ హామీ ఇచ్చాడు. 
 • వైయస్సార్ పాలన మళ్లీ కావాలంటే, ప్రజా ప్రభుత్వం రావాలి. అందుకు వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయపతాకం ఎగరాలి. 
 • గడప గడపలో జననేత ప్రజలకు అందించే నవరత్నాల గురించి వివరించాలి. 
 • ఆ నవరత్నాలే తెలుగింటి ముంగిట ఆనందాల ముగ్గులై మెరవాలి. 
Back to Top