పార్లమెంట్ లో వైయస్సార్సీపీ గళం

– ప్రజాసమస్యలపై గళమెత్తిన వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు
– ప్రత్యేకహోదా, పోలవరం, రాజధాని నిర్మాణం సహా..
ఏపీకి ఇచ్చిన హామీలపై కేంద్రాన్నినిలదీత
– ప్రజా సమస్యలపై కిక్కురుమనని టీడీపీ ఎంపీలు

పార్లమెంట్‌ సమావేశాలు ముగిశాయి. దాదాపు నెలరోజుల పాటు జరిగిన సమావేశాలు ఎలాంటి చర్చలు జరగకుండానే మమ అనిపించారు. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపైఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ సభా సమయాన్ని వృథా చేసేశారు. ఇవన్నీ పక్కనపెడితే మన రాష్ట్రానికి చెందిన వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు మాత్రం సభా సమయాన్ని బాగానే సద్వినియోగం చేసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రాన్ని నివేదికలు అడిగి తెలుసుకున్నారు. పోలవరం నిర్మాణం, నిధుల కేటాయింపులు, నిర్వాసితులకు నష్టపరిహారం, గిరిజనులకు భూముల కేటాయింపులు తదితర అంశాలపై గట్టిగానే నిలదీశారు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నలతో ఇరుకున పెట్టారు. పార్లమెంట్‌ సాక్షిగా గత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హోదా తీర్మాణాన్ని తక్షణం అమలు చేయాలని నినదించారు. వీటితోపాటు రైల్వే జోన్, అమరావతి నిర్మాణానికి సాయం, మన్నవరం ప్రాజెక్టు ఇతర సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణాలకు చర్యలు, రోడ్లు, నూతన రైల్వే లైను.. రైతు సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు.. పెద్ద నోట్ల రద్దుతో ఏపీలో ప్రజలు పడుతున్న కష్టాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంలో సఫలమయ్యారు.  టీడీపీ ఎంపీలు ప్రత్యేక హోదా, నోట్ల రద్దుపై ఎలాంటి ప్రశ్నలు వేయకపోవడం దురదృష్టకరం.  టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌  అమరావతికి వరద ముంపు ఉందని సాయం చేయమని కేంద్రాన్ని అభ్యర్థించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. గతంలో ఇదే ముంపు విషయాన్ని వైయస్‌ఆర్‌సీపీ ప్రస్తావించగా మెరక లేపుతామని, మోటార్లతో నీళ్లను తోడేస్తామన్న సీఎం చంద్రబాబు ఇప్పుడు మాత్రం టీడీపీ ఎంపీలతో సాయం కోరడం హాస్యాస్పదమే. అంటే ముంపు ఉన్న ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించి అమరావతి నిర్మాణం చేపట్టిన విషయం ఇక్కడ గమనార్హం. 


మేకపాటి రాజమోహన్‌రెడ్డి
కాశ్మీర్‌కు సంబంధించి భారత అంతర్గత అంశాల్లో పాకిస్థాన్‌ చేస్తున్న ప్రకటలను, చర్యలను సహించరాదని డిమాండ్‌ చేశారు. 

విజయసాయిరెడ్డి
– దివ్వాంగుల రిజర్వేషన్లు 5 శాతం పెంచాలి. దివ్యాంగుల రిజర్వేషన్లు– 2014 లో 4 శాతానికి తగ్గించారని చర్చలో వివరించారు. దివ్యాంగుల కేటగిరీలను 7 నుంచి 12 శాతానికి పెంచారని అందుచేత రిజర్వేషన్లు 5 శాతానికి పెంచాలని డిమాండ్‌ చేశారు. బౌద్ధ శకలాలు, పురావస్తు శాసనాలు చోరీకి గురవుతున్నాయని వాటిని రక్షణ కల్పించాలని కోరారు. 
– పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస సహాయ చర్యల్లో లోపాలను సరిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. వారి తరఫున ‘రేలా’ సంస్థ నుంచి ఢిల్లీలోని గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు వచ్చిన ఫిర్యాదులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. 
– పోలవరం నిర్వాసితులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు  వినతులు, ఫిర్యాదుల రూపంలో తమ దృష్టికి వచ్చాయని పునరావాసం చేపట్టడం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉందని ఎంపీ విజయసాయి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు. 
– రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 2106–17 సంవత్సరానికి గాను 42 పాఠశాలలకు సీబీఎస్‌ఈ అనుమతిచ్చినట్లు, 15 దరఖాస్తులను తిరస్కరించామని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహా సమాధానమిచ్చారు. 
– దిగుమతి అవుతున్న బొగ్గు ధరల్లో తరచూ హెచ్చు తగ్గులు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారని అడిగారు. దీనికి కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పందిస్తూ ఆల్ట్రా మెగా విద్యుత్‌ ప్రాజెక్టులకు మార్గదర్శకాలను రూపొందించినట్లు సమా«ధానమిచ్చారు. 
– భవన నిర్మాణ కార్మికుల చట్టం–1996 ప్రకారం ఏపీ ప్రభుత్వం 1553.16 కోట్లు వసూలు చేసిందని కానీ ఇందులో 15 లక్షల మంది కార్మికుల కోసం కేవలం 205 కోట్లు ఖర్చు చేసిందని దీనిపై కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు. 
– రుణగ్రస్తులైన రైతులు, నిర్వాసితులైన వ్యవసాయదారులు, నిరుద్యోగ యువతకు రుణాలు.. వన్‌టైం సెటిల్‌మెంట్‌ వంటి విషయాల్లో ఎస్బీఐ నిర్లక్ష్యం వహిస్తుందని బడా వ్యాపారులకు రుణాలు మంజూరు చేసి వీరిపై ఎందుకింత వివక్ష చూపిస్తుందని ప్రశ్నించారు.
– ఏపీ మాధ్యమిక స్కూళ్లలో 15.71 శాతం డ్రాపౌట్స్‌ ప్రాథమిక స్థాయిలో 7 శాతం మంది డ్రాపౌట్స్‌ అవుతున్నారని కేంద్రానికి నివేదించారు. 
– రైల్వేస్టేషన్‌లను సమర్ధతా కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారో వివరించాలని రైల్వే మంత్రిని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, విజయవాడ రైల్వేస్టేషన్‌లలో త్వరలోనే స్టేషన్‌ డైరెక్టర్ల నియామకం జరుగుతుందన్నారు. స్టేషన్‌ డైరెక్టర్ల నియామకం వల్ల అదనపు భారం పడబోదని, రైల్వేల్లో ఉన్న అధికారుల్నే ఈ బాధ్యతల్లో నియమిస్తారని రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్‌ గోహెయిన్‌ వివరించారు. 
– పోలవరం ప్రాజెక్టు కింద నిర్వాసితులైన గిరిజనులకు గిరిజన హక్కుల చట్టం–2006 ప్రకారం భూమి పట్టాలను ఇవ్వాలని జాతీయ గిరిజన కమిషన్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సూచించిందని ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్‌ ఓరం బదులిచ్చారు.
– ఏపీలో మంజూరైన ఐఏఎస్‌ల సంఖ్యకూ, పోస్టింగ్‌లో ఉన్న వారి సంఖ్యకూ మధ్య వ్యత్యాసం ఎందుకుంది? వ్యత్యాసాన్ని తగ్గిస్తూ ఖాళీల భర్తీకి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని కోకోరారు. 
– ఐఐటీలో విద్యాప్రమాణాలు నానాటికీ తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యావసరాలకు తగినట్టుగా ప్రతిభగల అధ్యాపకులను ఎందుకు ఎంపిక చేయలేకపోతున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు. 
– భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 102, 191లను సవరించాల్సిన అవసరం ఉందంటూ సభలో ప్రైవటు మెంబర్‌ బిల్లు ప్రవేశ పెట్టారు. 
– ఏపీలో ప్రస్తుతం కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులు ఎప్పటిలోగా పూర్తవుతాయో సమాధానం ఇవ్వాలని కోరగా చెప్పలేమని కేంద్ర సహాయ మంత్రి సమాధానమిచ్చారు. 
– 2010లో ఎన్‌టీపీసీ–బీహెచ్‌ఈఎల్‌ సంయుక్తంగా చిత్తూరు జిల్లా మన్నవరంలో చేపట్టిన విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణంలో పురోగతి లేకపోవడానికి గల కారణాలు, ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి అనే వివరాలను సేకరించారు. 

వైయస్‌ అవినాశ్‌రెడ్డి:
రాజమండ్రిలోని గోదావరి బ్రిడ్జిపై ఉన్న హావెలాక్‌ బ్రిడ్జికి ఉన్న ఉక్కు దూలాలు, స్థల విలువను మార్కెట్‌ విలువ ప్రకారం లెక్కించి తమ వద్ద జమ చేయాలని, పాత వంతనెను పర్యాటక కేంద్రంగా మార్చుకునేందుకు రాష్ట్రం అనుమతి కోరిన విషయాన్ని కేంద్ర మంత్రి.. ఎంపీ అవినాశ్‌ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 
– మచిలీపట్నం– అవనిగడ్డ 214 ఏ జాతీయ రహదారి విస్తరణకు రూ. 376 కోట్లు విడుదల చేసినట్లు ఎంపీ అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి రాధాకృష్ణన్‌ సమాధానమిచ్చారు. 
– ఈఎస్‌ఐ లబ్ధిదారులకు ఈఎస్‌ఐ దాని అనుబంధ ఆస్పత్రుల్లో నగదు రహిత చికిత్సలు కొనసాగుతాయని, ఈ విధానాన్ని ఆపలేదని ఎంపీ వైయస్‌ అవినాశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ సమాధానమిచ్చారు. ఈఎస్‌ఐ లబ్ధిదారులకు ఆరోగ్య బీమా పథకం కింద నాలుగు ప్రయోజనాలను కల్పిస్తున్నామని చెప్పారు. 
– మారుమూల గ్రామాల్లో సెల్‌ టవర్ల ఏర్పాటుకు ఎలాంట చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కోరారు. దానికి మంత్రి స్పందిస్తూ ఏపీలోని 54 నక్సల్స్‌ ప్రభావిత గ్రామాల్లో, తెలంగాణలోని 173 గ్రామాల్లో యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ నిధులతో సెల్‌ టవర్లు ఏర్పాటు చేస్తున్నామని కేంద్రం తెలిపింది. 
– అమరావతి– అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వే నిర్మానానికి సంబంధించి ఎలాంటి ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అంచనా ప్రతిపాదనలు ఇవ్వలేదని కేంద్రం స్పష్టం చేసింది. కర్నూలు– దోర్నాల రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించినట్లు పేర్కొంది.
– నిఫ్ట్‌ ఏర్పాటుకు విజయవాడ సమీపంలోని కొండపావులూరులో చూపిన స్థలం తగినది కాదని అవినాశ్‌రెడ్డి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి తెలిపారు. 
– ఏపీ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణ సమయం చాలా ఎక్కువగా ఉందని, 19 స్టేషన్లలో ఆగుతుందని వేగం పెంచాలని కోరారు. 
– రాష్ట్రంలో పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో ఖాళీల వివరాలను వెల్లడించాలని, త్వరతగతిన పూర్తి చేయాలని సూచించారు. 
– ఎరువుల రాయితీకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడతుందో వివరించాలని కేంద్రాన్ని కోరారు. కాగా ఎరువుల రాయితీని ప్రత్యక్ష లబ్ధి పంపిణీ పద్ధతిలో రైతులకు పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించిందని సహాయ మంత్రి మన్షుక్‌ మండవీయ వెల్లడించారు. 
– గిరిజనులకు భూమి హక్కు కల్పించాలని ప్రధాని చేసిన ప్రకటన అనుసరించి పోలవరం నిర్వాసిత గిరిజన గ్రామాల తరఫున పోరాడుతున్న ఉద్యమ కారుల నుంచి నిర్దిష్టంగా ఏదైనా వినతిపత్రం అందిందా? గిరిజనుల నుంచి కారుచౌకగా ప్రభుత్వం తీసుకున్న భూమిని వారికే తిరిగి అప్పగించడానికి ఏం చర్యలు తీసుకున్నారు.. ఇక్కడి అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులపై సర్వే నిర్వహణకు ఏమైనా చర్యలు తీసుకున్నారా అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. 

వైవీ సుబ్బారెడ్డి:
– సుబాబుల్, యూకలిప్టస్, సరుగుడు ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తక్షణం జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరారు. కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
– నోట్ల రద్దుకు రాజకీయ రంగు పులుముకుంటోందని వీలైనంత వేగంగా సమస్యలు పరిష్కరించాలని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలు కరెన్సీ కష్టాల్లో ఉన్న కారణంగా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని వెల్లడించారు. 
– బుడగ జంగం కులానికి ఎస్సీ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. 
– పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా విశాఖకు రైల్వే జోన్‌ వంటి కీలక అంశాలను తక్షణం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 
– పత్తి అమ్మకాల్లో దళారుల పాత్ర లేకుండా చేయాలని, రైతుల మాత్రమే అమ్ముకునే వీలు కల్పించాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీని విన్నవించారు. 
– వినియోగదారుల సమస్యలు త్వరితగతిన పరిష్కారం కోసం ఏవిధమైన దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. 
– ఉల్లి రైతులకు ఈ ఏడాది దిగుబడి బాగున్నా గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడి కూడా రావడం లేదని ఈ పరిస్థితిల్లో కేంద్రం తక్షణం నాఫెడ్‌ ద్వారా ఉల్లి కొనుగోలు చేయించి రైతులకు మద్ధతు ధర అందేలా చూడాలని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌ సింగ్‌కు విన్నవించారు. 
– వ్యవసాయ సంస్కరణల అమలు తీరును వేగవంతం చేయాలని కేంద్రాన్ని విజ్ఙప్తి చేశారు. 
– 12 షెడ్యూల్‌ని విధులను పట్టణ స్థానిక సంస్ధలకు బదిలీ చేసే ఈఅధికారం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలదేనని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఫైర్‌ సర్వీస్‌ విధులను మాత్రం బదిలీ చేయలేదని చెప్పారు. 
– హెచ్‌1–బి, ఎల్‌–1బి వీసాల నిబంధనలు, డీటీహెచ్‌ లైసెన్సులకు సంబంధించి మార్గదర్శకాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు. 
– పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సవరించిన నిధుల పెంపు అంచనా ప్రతిపాదనలను ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు కేంద్రానికి పంపలేదని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నతో వెలుగులోకి వచ్చింది. 

పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
– పది రాష్ట్రాల్లోని నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో 11068 పంపుసెట్ల ఏర్పాటు లక్ష్యంగా సోలార్‌ పంపుల ద్వారా తాగునీటి పథకాలను అమలు చేసినట్లు కేంద్రం పేర్కొంది. అయితే ఏపీ, తెలంగాణల్లో ఈ పథకం 30 శాతం కూడా అమలుకు నోచుకోలేదని కేంద్రం వెల్లడించింది. పదేపదే సమీక్షించినా ఫలితం లేకపోయిందని పేర్కొంది. ఈ పథకం 2012–13లో కేంద్రం ప్రవేశపెట్టిందని ఎంపీ మి«థున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది. 
– రియల్‌ ఎస్టేట్‌ నిబంధనలు, రెగ్యులేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌  తదితర అంశాలపై చర్యలను అడిగి తెలుసుకున్నారు.

కర్నూలు ఎంపీ బుట్టా రేణుక...
కర్నూలు నియోజకవర్గ పరిధిలోని గుల్యం, బళ్లారి జిల్లా పరిధిలోని బసరకొడు మధ్య హగరీ(వేదవతి) నదిపై హైలెవల్‌ వంతెన నిర్మించాలని ఎంపీ బుట్టా రేణుక కేంద్ర రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ వినతిపత్రం ఇచ్చారు. 
– సాంప్రదాయ విద్యుత్‌ వినియోగం పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు, కేటాయింపులపై కేంద్ర విద్యుత్‌ మంత్రి పీయూష్‌ గోయల్‌ను సమాధానం కోరారు. 
అందుకు ఆయన స్పందిస్తూ దేశవ్యాప్తంగా 2022 నాటికి లక్ష మెగావాట్ల సోలార్‌ విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో 1500 మెగావాట్ల సోలార్‌ పార్కుల ఏర్పాటుకు అనంతపురం జిల్లాలోని ఎస్పీ కుంట మండలంలో, కడప జిల్లాలోని గాలివీడు మండలంలో స్థలాలు గుర్తించినట్లు, 1000 మెగావాట్ల సోలార్‌ పార్కుల ఏర్పాటుకు కడప జిల్లాలోని మైలవరం, కర్నూలు జిల్లాలో స్థలాలు గుర్తించామని, 500 మెగావాట్ల సోలార్‌ పార్కుల ఏర్పాటుకు అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలంలో స్థలాలు గుర్తించినట్లు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. వీటి ఏర్పాటుకు కేంద్ర సాయంగా ఇప్పటికే రూ. 243 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. 
Back to Top