నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు

ప్రజాస్వామ్య చరిత్రలోనే దుర్దినం
ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక తీరును..
చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు
ప్రభుత్వ అవినీతి అక్రమాలు, అన్యాయాలను ఎండగడుతాం

హైదరాబాద్ః రాష్ట్రం ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న అప్ర‌జాస్వామిక తీరును చూసి ప్రజలు అసహ్యించుంటున్నార‌ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌థ‌ర్‌రెడ్డి అన్నారు. అధికార‌, మ‌ంద‌బ‌లం చూసుకొని టీడీపీ అహంకారం ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు తీర్పును సైతం అప‌హాస్యం చేయడం ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లోనే ఇదొక దుర్దినమ‌ని అభిప్రాయపడ్డారు. మహాత్మ విగ్ర‌హం వ‌ద్ద గాంధీగిరి ప‌ద్ధ‌తిలో నిర‌స‌న వ్య‌క్తం చేస్తే...దానిపై కూడా అనేక ఆంక్షాలు విధించిన ప్రభుత్వ తీరు దుర్మార్గమమని మండిప‌డ్డారు. అధికార ప్ర‌భుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్ర‌మాలు, అవినీతిని ఇటు ప్రజల్లోకి..అటు గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

నాకేంటి సిగ్గు..
న‌వ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న రీతిలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఉంద‌ని కోటంరెడ్డి పైరయ్యారు.  ప్ర‌భుత్వానికి పోయే కాలం వ‌చ్చిందని,  ఎవ‌రు ఆప‌లేర‌ని తెలిపారు. రాజ‌ధాని భూదందాలో ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ు కొల్ల‌గొట్ట‌డం, శాస‌న‌స‌భ‌లో ఉన్న నిబంధ‌న‌ల‌ను అన్నివిధాలుగా ఉల్లంఘించిన తీరును ప్ర‌జ‌లు చూస్తున్నార‌న్నారు. కోర్టు ఉత్త‌ర్వుల‌ను సైతం బేఖార‌తు చేస్తున్న రాష్ట్ర‌ప్ర‌భుత్వ తీరు ప‌రాక‌ష్ట‌కు చేరుకుంద‌ని దీనిని ప్ర‌జ‌లంతా నిర‌సిస్తార‌ని పేర్కొన్నారు. 

అన్ని పార్టీలకు జరిగిన అన్యాయం
ఇది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు జ‌రిగిన అన్యాయం కాద‌ని, అన్ని రాజ‌కీయ పార్టీల‌కు జరిగిన అన్యాయ‌మ‌ని తెలిపారు. ప్ర‌భుత్వ తీరుకు న్యాయ‌స్థానాలు ఎటువెళ్తున్నాయో తెలియ‌ని గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంద‌ని, ఖ‌చ్చితంగా ఈ విష‌యంలో న్యాయ‌స్థానాలు జోక్యం చేసుకోవాల‌ని కోరారు. భార‌త‌దేశంలో ఏ వ్య‌వ‌స్థ‌కైనా స‌రే రాజ్యాంగ‌మే సుప్రీంఅని, అలాంటి రాజ్యాంగం మ‌న‌కు కొన్ని హ‌క్కులు, బాధ్య‌త‌లు ఇచ్చింద‌న్నారు. ఆ రాజ్యాంగ ప్ర‌మాణాల‌కు లోబ‌డి అందరూ పనిచేయాలన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా న‌డుచుకుంటే అది ప్ర‌జాస్వామ్య స్ఫూర్తికే విఘాతమన్నారు. 

రెండు వ్యవస్థలు రెండు కళ్లు
న్యాయస్థానం ఆదేశాలను ప్రభుత్వం ధిక్కరించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న న్యాయవ్యవస్థ, శాసనవ్యవస్థ మనకు రెండు కళ్లలాంటివని వివ‌రించారు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించకుండా హుందాతనాన్ని పాటించాల్సిన బాధ్యత  ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు.  ప్రభుత్వం బేషజాలకు పోకుండా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు. 

తాజా ఫోటోలు

Back to Top