స్పెషల్‌ ఫైట్

  • ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
  • ఏపీకి హోదా సాధనే వైయస్‌ఆర్‌సీపీ లక్ష్యం
  • రెండేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్న వైయస్‌ జగన్‌
  • ఈ నెల 25న కర్నూలులో యువభేరి
  • వచ్చే నెల 6న విశాఖలో జై ఆంధ్రప్రదేశ్‌ బహిరంగ సభ
  • ఐదు కోట్ల ఆంధ్రుల ఆంకాక్షను తుంగలో తొక్కిన ప్రభుత్వాలు
  • విభజన చట్టంలోని హామీలకు బీజేపీ, టీడీపీ తూట్లు
  • సొంత ప్రయోజనాల కోసం హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబు

హైదరాబాద్‌: అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదానే సంజీవిని. హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. ఇందు కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రెండేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు.  రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు లభిస్తాయి. దీంతో పారిశ్రామిక వేత్తలు పరుగెత్తుకొని వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలు పెడతారు. పరిశ్రమలు ఏర్పాటైతే..మన యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఫలితంగా యువతకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంత ప్రాముఖ్యత కలిగిన ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యమ బాట పట్టారు. ఇప్పటి దాకా ఆమరణ నిరాహార దీక్షలు, రాష్ట్ర బంద్‌లు, ధర్నాలు చేపట్టిన ప్రతిపక్ష నేత..అంతటితో ఆగకుండా చట్టసభల్లో హోదా అంశంపై ప్రభుత్వాలను నిలదీశారు. మరోవైపు పార్లమెంట్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల ద్వారా పోరాటం చేయించారు. ఇంత చేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం రాకపోవడంతో యువభేరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  సెప్టెంబర్‌ 15, 2015న మొట్ట మొదటి సారిగా తిరుపతి నగరంలోని ఎస్వీ యూనివర్సిటీలో యువభేరి నిర్వహించారు. ఇప్పటి దాకా ఆరు నగరాల్లో యువభేరి కార్యక్రమాలు నిర్వహించి యువత, విద్యార్థులను చైతన్యవంతం చేశారు. తాజాగా ఈ నెల 25న కర్నూలు నగరంలో యువభేరి కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ సభకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హాజరై హోదా వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించి, వారిలో చైతన్యం నింపే ప్రయత్నం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.

వైయస్‌ జగన్‌ పోరాటానికి మద్దతు వెల్లువ
ప్రత్యేక హోదా సాధనకోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపడుతున్న పోరాటాలకు అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తూ, కేంద్ర మంత్రులకు వినతులు అందజô శారు. అలాగే హోదా కోసం చేపట్టే పోరాటంలో మద్దతు ఇవ్వాలని కోరుతూ వివిధ జాతీయ పార్టీల నాయకులను వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కలిసి మద్దతు కూడగట్టారు. అంతేకాకుండా విదేశాల్లో ఉంటున్న ప్రవాసాంధ్రులతో గత నెలలో వైయస్‌ జగన్‌ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి హోదా ప్రాముఖ్యత గురించి చైతన్యవంతం చేశారు. ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని ప్రతిపక్ష నేత పిలుపునిచ్చారు. సెప్టెంబర్‌ 8న తలపెట్టిన రాష్ట్ర బంద్‌లో కూడా వైయస్‌ఆర్‌సీపీకి వామపక్షాలు మద్దతుగా నిలిచాయి. అలాగే వివిధ ప్రజా సంఘాలు, రాజకీయా పార్టీలు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టే ఆందోళనల్లో భాగస్వాములవుతున్నారు.

‘‘జై ఆంధ్రప్రదేశ్‌’’ పోరాటం
ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటి వరకు వివిధ రూపాల్లో పోరాటం చేసింది. ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడంలో భాగంగా ‘‘జై ఆంధ్రప్రదేశ్‌’’ పేరుతో భారీ బహిరంగ సభలకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రణాళిక రూపొందించారు. ముందుగా విశాఖపట్టణంలో నవంబర్‌ 6వ తేదీన మొదటి మీటింగ్‌ పెట్టాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా సాగుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అన్ని వర్గాల ప్రజలను ఉద్యమంలో భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. 

ప్రత్యేక హోదాకు బాబు తూట్లు
నాడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ను యూపీఏ ప్రభుత్వం రెండుగా చీల్చి మానని గాయం చేస్తే..ఆదుకుంటామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఎన్‌డీఏ ప్రభుత్వం పుండుపై కారం చల్లుతోంది. గత నెల 7 ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదాకు తూట్లు పొడిచింది.  విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్‌ సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఇదే హామీని తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు ఇచ్చారు. చంద్రబాబు సీఎం అయ్యాక పూర్తిగా మారిపోయారు. ఆయనకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యమయ్యాయి. రెండేళ్ల పాటు ఇదిగో హోదా..అదిగో హోదా అంటూ ప్రజలను మభ్యపెట్టారు. తీరా తన స్వార్థ ప్రయోజనాల కోసం ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు అయిన  హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారు. బాబు డైరెక్షన్‌లో గల నెల 7వ తేదీ అర్ధరాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని ప్రకటించారు. చట్టం ప్రకారం మనకు రావాల్సిన నిధులు ఇస్తామని జైట్లీ పేర్కొంటే..దాన్ని చంద్రబాబు అర్ధరాత్రి ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ స్వాగతించారు. ఈయనగారికి రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ కంటే సొంత ప్రయోజనాలే ముఖ్యమయ్యాయి. ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకు, పోలవరం కాంట్రాక్ట్‌ తన వారికి కట్టబెట్టి ప్రజాధనం దోచుకోవడమే బాబుకు ముఖ్యం. విభజన చట్టంలోని హామీ అయిన హోదా కోసం పోరాడాల్సిన ముఖ్యమంత్రి.. హోదా రాకపోయినా ఫర్వాలేదు అన్నట్లుగా వ్యవహరించడం దారుణం. 

యువభేరి..
–  తిరుపతి (సెప్టెంబర్‌15, 2015)
 – విశాఖ(సెప్టెంబర్‌ 22–2015) 
– కాకినాడ( జనవరి 27–2016)
 – శ్రీకాకుళం(ఫిబ్రవరి 2–2016)
– నెల్లూరు(ఆగస్టు్ట 4–2016)
– ఏలూరు(సెప్టెంబర్‌ 22, 2016)

 
Back to Top