ఢిల్లీ పర్యటన విజయవంతం


() వైఎస్సార్సీపీ పర్యటన కు చక్కటి స్పందన

() జాతీయ నాయకుల్ని కలిసిన పార్టీ నాయకులు

() పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ నాయకత్వంలో హస్తిన పర్యటన

() పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి టూర్

 

న్యూఢిల్లీ) ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్
నాయకత్వంలో పార్టీ ప్రతినిధి బ్రందం ఢిల్లీ పర్యటన విజయవంతం అయింది. ముఖ్యమంత్రి
చంద్రబాబు చేస్తున్న అరాచకాల మీద జాతీయ స్థాయిలో చర్చను రేకెత్తించగలిగారు.
ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వ అవినీతి కుంభకోణాల మీద రూపొందించిన పుస్తకం.. చంద్రబాబు,
ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అనే పుస్తకం పలువురిని ఆకర్షించింది.

జాతీయ నాయకులతో భేటీ

పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ తో కలిసి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ఢిల్లీకి తరలి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ వంటి ప్రధాన రాష్ట్రానికి చెందిన ప్రధాన
ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు మూకుమ్మడి గా ఢిల్లీ కి చేరటంతో పరిస్థితి
వేడెక్కింది. ముఖ్యమైన పార్టీలైన సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, జేడీయూ వంటి పార్టీల
అగ్ర నేతల్ని కలిశారు. అవినీతి పనులతో లక్షల కోట్ల రూపాయిలు పోగేసుకోవటం, ఈ
డబ్బుల్ని ఉపయోగించి ప్రతిపక్ష ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేయటం వంటి పనుల్ని జాతీయ
పార్టీల నాయకులకు తెలియ చేశారు. ఫిరాయింపుల్ని అడ్డగోలుగా ప్రోత్సహిస్తున్న
వైనాన్ని వివరించి చెప్పారు.

కేంద్ర మంత్రులకు ఫిర్యాదు

రాష్ట్రపతి విదేశీ పర్యటనలో ఉండటం, ప్రధానమంత్రి ఇతర షెడ్యూల్స్ తో బిజీగా
ఉండటంతో సీనియర్ కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ ని కలిశారు.
విచ్చలవిడిగా అవినీతి చర్యలకు పాల్పడుతున్న చంద్రబాబు అవినీతి చర్యల్ని సవివరంగా
తెలియపరిచారు. ఇందుకు సంబంధించిన ఆధారాల్ని అందించారు. చంద్రబాబు అవినీతి చర్యల
మీద సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని కోరారు. అవినీతికి అడ్డుకట్ట వేయకపోతే
ఏర్పడబోయే దుష్పరిమాణాల్ని వివరించి చెప్పారు.

ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు

ఎన్నికల సంస్కరణలకు సంబంధించి వైఎస్సార్సీపీ కొన్ని ప్రతిపాదనలు చేసింది.
ఫిరాయింపు ఎమ్మెల్యేల చర్యలు తీసుకొనే అధికారం స్పీకర్ నుంచి తప్పించి ఎన్నికల
సంఘానికి అప్పగించాలని చెప్పటం, ప్రధాన ఎన్నికల హామీలను గాలికి వదిలేస్తే ఆ
పార్టీలను తర్వాత ఎన్నికల్లో బహిష్కరించాలని డిమాండ్ చేయటం, తెలుగు నాట ఎన్నికలు
ఒకేసారి జరిపించమనటం వంటి ప్రతిపాదనలు చేసింది.

సంచలనం రేకెత్తించిన పుస్తకం

చంద్రబాబు సాగిస్తున్న అవినీతి దందా మీద వైఎస్సార్సీపీ పుస్తకం రూపొందించింది.
చంద్రబాబు..ఎంపరార్ ఆఫ్ కరప్షన్ అనే ఈ పుస్తకంలో అవినీతి బాగోతాన్ని
పూసగుచ్చినట్లు వివరించటం జరిగింది. దీనికి సపోర్టుగా జీవో కాపీలు, స్కాన్ డ్
డాక్యుమెంట్లు పొందుపరిచారు. 128 పేజీల ఈ పుస్తకంలో గ్రాఫ్ లు, టేబుళ్లు
సవివరణాత్మకంగా ఉన్నాయి. జాతీయ నాయకుల్ని కలిసి ఈ పుస్తకాన్ని అందించినప్పుడు వారు
ఆసక్తికరంగా దాన్ని తిలకించారు. వివరాలు అడిగి తెలుసుకొన్నారు. సంబంధిత పక్షాలు
అందరికీ దీన్ని అందించటం జరిగింది.

 

తాజా ఫోటోలు

Back to Top