ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం లోటస్ పాండ్లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.  పార్టీ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని అయిదో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ వేడుకల్లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు,అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ తన ట్విట్టర్ పేజీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగించడమే ప్రధాన ఎజెండాగా ఆవిర్భవించిన ఈ పార్టీ తొలి నుంచీ ఎదురవుతున్న అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
Back to Top