వైఎస్ఆర్‌కాంగ్రెస్ పోరాటానికి వామ‌ప‌క్షాల మ‌ద్ద‌తు

న్యూఢిల్లీ :  వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు, ప్ర‌తిప‌క్ష‌నేత
వైఎస్‌ జగన్ మోహ‌న్‌రెడ్డికి సిపిఐ,సిపిఎం ల నుంచి మద్దతు లభించింది.
ప్రత్యేక హోదా విషయంపై ఢిల్లీలో జగన్ ధర్నాకు మద్దతుగా సిపిఎం ప్రదాన
కార్యదర్శి సీతారాం ఏచూరి స్వయంగా వచ్చి ప్రసంగించారు. సిపిఎం పార్టీ
పక్షాన, వ్యక్తిగతంగా కూడా తాము మద్దతు ఇస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా
చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో పార్లమెంటులో చెప్పారని ఆయన గుర్తు
చేశారు. విభజన సమస్యలను పరిష్కరించాలని తాము అప్పట్లోనే పట్టుబట్టామని ఆయన
అన్నారు. బిజెపి ప్రత్యెక హోదా ఇస్తామని చెప్పి ఇంతకాలం అయినా కదలిక
లేకపోవడం సరికాదని,  దీనిపై తాము కూడా పార్లమెంటులో నిలదీస్తామని ఏచూరి
చెప్పారు. "దేశ‌మంటే మ‌ట్టికాదోయ్ దేశ‌మంటే మ‌నుషులోయ్ అన్న గుర‌జాడ మాట‌ను
గుర్తుపెట్టుకోవాలి. అని ఆనాడే చ‌ర్చ సంద‌ర్భంగా నేను చెప్పాను" అన్నారు.
బ్రదర్ జగన్ కు , వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ విషయంలో మద్దతు
ఇస్తున్నామని సీతారామ్ ఏచూరి అన్నారు. కాగా కేరళ కు చెందిన సిపిఐ ఎమ్.పి
జ‌య‌దేవ‌న్ కూడా కూడా జంతర్ మంతర్ వేదిక వద్దకు వచ్చి ప్రత్యేక హోదా
డిమాండ్ ను బలపరుస్తున్నట్లు చెప్పారు. ప్ర‌త్యేక హోదాపై వైఎస్ ఆర్‌సీపీ
పోరాటానికి మ‌ద్ద‌తు తెలుపుతున్నాం , ప్ర‌త్యేక హోదా సాధించేవ‌ర‌కు
వైఎస్ఆర్‌సీపీ పోరాటంలో భాగ‌స్వాముల‌మ‌వుతాం అని ఆయ‌న చెప్పారు.
Back to Top