పోల‌వరం ముద్దు.. ప‌ట్టి సీమ వ‌ద్దు..!

హైద‌రాబాద్‌: అన్ని ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు అందాలంటే పోల‌వరం ప్రాజెక్టుని సాధించుకోవ‌టమే ప‌రిష్కారం. అది మాత్ర‌మే శాశ్వ‌త ప‌రిష్కారం చూప‌గ‌లుగుతున్న‌ది. ప‌ట్టిసీమ తో తాత్కాలికంగా నీళ్లు పారినా ఎప్ప‌టికీ అన‌ర్థం త‌ప్ప‌దు. 

ప‌ట్టిసీమ‌తో అన‌ర్థాలు
  • ఇది పూర్తిగా తాత్కాలిక ఎత్తిపోత‌ల ప‌థ‌కం. ఇక్క‌డ నిధులు వృధా
  • నీటిని నిల్వ చేసుకొనే అవ‌కాశం లేదు. దీంతో వ‌ర‌ద నీటి వృధా ను అరిక‌ట్ట‌లేదు.
  • ఏడాది పొడ‌వునా నీటిని తోడితే గోదావ‌రి జిల్లాల‌కు ఇబ్బంది త‌ప్ప‌దు
  • ప్ర‌కాశం బ్యారేజ్ లో అద‌నంగా నీటిని నిల్వ చేసే వెసులుబాటు లేదు
  • ఎత్తిపోసిన నీటిని స‌ముద్రం పాలు చేయాల్సి వస్తుంది
  • కాంట్రాక్ట‌ర్ల ఎంపిక‌లోనే అక్ర‌మాలు. ఇద్ద‌రికే అవ‌కాశం
  • 16.9 శాతం బోన‌స్ ఇచ్చేట్లుగా ముందుగానే ఒప్పందం
  • పోల‌వ‌రం పూర్త‌యితే ఈ ఖ‌ర్చంతా వృధా అయిన‌ట్లే.

పోల‌వ‌రంతో ఉప‌యోగాలు
  • ఇందులో రిజ‌ర్వాయ‌ర్ అవ‌కాశం ఉంది. దీంతో గోదావ‌రి కి వ‌చ్చే వ‌ర‌ద నీటిని నిల్వ చేసుకొనే వెసులుబాటు.
  • ఏడాది పొడ‌వునా నీటిని ఉప‌యోగించుకొనే వెసులుబాటు
  • నీటిని కృష్ణా న‌దికి క్ర‌మం త‌ప్ప‌కుండా పంపించుకొనే అవ‌కాశం
  • స‌ముద్రంలో వృధాగా పోయే నీటికి అడ్డుక‌ట్ట‌
  • కృష్ణా డెల్టాకు నీరు ద‌క్కే అవకాశం
  • గోదావ‌రి జిల్లాల తాగు,  సాగునీటికి అవకాశం
  • రాయ‌ల‌సీమ కు నీరు అందించే అవ‌కాశః
  • రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల‌కు నీరు వ‌చ్చే చాన్సు
Back to Top