రాజ్యాంగ నిర్మాతకు వైఎస్ జగన్ నివాళిహైదరాబాద్‌: భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రతిపక్ష నేత,
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. హైదరాబాద్
లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి
నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ
ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, మండలిలో వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, టీ
వైఎస్సార్సీపీ నాయకులు నల్లా సూర్య ప్రకాశ్, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి
పద్మ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చల్లా మధుసూదన్ రెడ్డి తదితరలు ఉన్నారు.మరోపక్క, ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వైఎసార్ కాంగ్రెస్
పార్టీ కార్యకర్తలంతా కూడా తమ తమ ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి
నివాళులర్పించారు. ఆయా జిల్లా కేంద్రాల్లో పార్టీ నాయకులు అమర్నాథ్ రెడ్డి, సురేశ్ బాబు, అంజద్ భాషా, మర్రి రాజశేఖర్, కౌన్సిలర్లు పార్టీనాయకులు తమతమ ప్రాంతాల్లో అంబేద్కర్ చిత్రపటానికి నివాళి
అర్పించారు. 
 

 

 

Back to Top