ఢిల్లీ వేదిక‌గా వైఎస్ జ‌గ‌న్ దీక్ష‌

న్యూ ఢిల్లీ: ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా క‌ల్పించాంటూ .. ప్ర‌త్యేక హోదా ఏపీ హ‌క్కు అన్న నినాదంతో న్యూఢిల్లీ వేదిక‌గా మ‌హా ధ‌ర్నాకు వైఎస్సార్ సీపీ స‌మాయ‌త్తం అయింది. పార్టీ అధ్య‌క్షుడు, ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో జ‌రుగుతున్న ఈ ధ‌ర్నాలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, క్రియా శీల కార్య‌క‌ర్త‌లు, నియోజ‌క వ‌ర్గ స్థాయి నేత‌లు పాల్గొంటున్నారు.

విభ‌జ‌న గాయంతో జ‌రిగిన న‌ష్టాన్ని భ‌ర్తీ చేసేందుకు ప్ర‌త్యేక హోదా క‌ల్పించాల‌న్న డిమాండ్ వ‌చ్చినప్పుడు అప్ప‌టి ప్ర‌ధానమంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ స్వ‌యంగా రాజ్య‌సభ లో మాట్లాడుతూ,. ఐదేళ్ల పాటు హోదా క‌ల్పిస్తామని హామీ ఇచ్చారు. దీనిమీద అప్ప‌టి బీజేపీ నేత‌ల డిమాండ్ తో ప‌దేళ్ల పాటు ప్ర‌త్యేక హోదా క‌ల్పించేందుకు అంగీకారం కుదిరింది. ఎన్నిక‌ల్లో ఇదే హామీతో గ‌ద్దె నెక్కిన తెలుగుదేశం ఈ విష‌యాన్ని గాలికి వ‌దిలేసింది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైఎస్సార్ సీపీ మాత్రం నిరంత‌రాయంగా దీనిపై పోరాటం జ‌రుపుతూనే వస్తోంది.

ఈ పోరాటంలో వైఎస్ జ‌గ‌న్ సంక‌ల్పించిన దీక్ష‌కు రాష్ట్రం న‌లు మూల‌ల నుంచిపార్టీ శ్రేణులు ఢిల్లీకి చేరుకొన్నాయి. ఈ దీక్ష ద్వారా ప్ర‌ధానంగా ఢిల్లీ పెద్ద‌ల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను, బ‌ల‌మైన వాంఛ‌ను, ఆవేద‌న‌ను తెలియ‌ప‌ర‌చాల‌ని నిర్ణ‌యించారు. ఇందుకోసం పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ఢిల్లీలో ధ‌ర్నా చేయాల‌ని నిర్ణ‌యించారు. తద్వారా దేశ వ్యాప్తంగా ఉండే ఈ అంశం మీద మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు వీల‌వుతుంది. పార్ల‌మెంటు కు ద‌గ్గ‌ర‌లోని జంత‌ర్ మంత‌ర్ ద‌గ్గ‌ర ధ‌ర్నా చేస్తున్నారు. త‌ర్వాత పార్ల‌మెంటు దాకా వైఎస్సార్‌సీపీ నాయ‌కులు పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో మార్చ్ నిర్వ‌హించ‌నున్నారు. 
Back to Top