నిర్ణయాలు ఒకలా... ప్రచారం మరోలా..!

ఏ విషయానికి అయినా మసిపూసి మారేడు కాయ చేయటంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. ఇందుకు రాజధాని పేరుతో జరుగుతున్న తతంగమే ఉదాహరణ. 
రాష్ట్ర
రాజధాని గురించి ప్రస్తావించినప్పుడల్లా చంద్రబాబు నోటి నుంచి వచ్చే
డైలాగ్.. విభజన ఏకపక్షంగా సాగింది. ఎవరినీ సంప్రదించకుండా చేసేశారు. (ఇది
ఆంధ్రప్రదేశ్ లో చెప్పే మాట. తెలంగాణలో అయితే మాత్రం విభజన చేయమని
మొట్టమొదటి లేఖ తామే ఇచ్చామని, విభజన చేయించిన ఘనత తెలుగుదేశానిదే అని
చెబుతారు.) అటువంటి వ్యక్తి.. రాజధాని విషయంలో చేసింది ఏమిటి. రాజధాని
అనేది కొన్ని తరాల వరకు భవిష్యత్ ను శాసించే అంశం. అటువంటి విషయంలో
ఒంటెత్తు పోకడలు పోయారు. అమరావతి ని నిర్ణయించేటప్పుడు కనీస సంప్రదింపులు
జరపలేదు. ఒక్కసారంటే ఒక్కసారి కూడా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయలేదు.
రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛందం సంస్థలు, మేధావులు, జర్నలిస్టుల
అభిప్రాయాలు తీసుకోలేదు. ఒంటెత్తు పోకడలతో రాజధానిని ప్రకటించేశారు. 
ఇక
రెండోది హైదరాబాద్ లోనే మొత్తం అభివ్రద్ది పోగు పడినప్పుడు దాన్ని
వదిలివేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ చిక్కుల్ని ఎదుర్కొంది. అప్పటి నుంచి మొత్తం
అభివ్రద్ది ఒక్కచోటే వద్దని, వికేంద్రీకరణ జరగాలనే వాదన్ని చంద్రబాబు సహా
అంతా వినిపించారు. కానీ ఇప్పుడు మొత్తం అభివ్రద్దిని అమరావతి ప్రాంతానికే
తరలిస్తున్నారు. అటువంటి తప్పిదాన్ని అచ్చంగా అమరావతిలోనూ చేయటంలోని
ఆంతర్యం ఏమిటి
మూడోది ఇంత రాజధాని కడుతున్నామని గొప్పలు
చెప్పుకొనే నాయకులు పారదర్శకత కు ఎందుకు పాతరేస్తున్నారు. టెండర్ల
విధానాన్ని గాలికి వదిలేసి స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ కంపెనీలకు
మొత్తం ఎందుకు దోిచి పెడుతున్నారు. కోరుకొన్న కంపెనీలకు మొత్తం దోచి
పెట్టడం, ఇందుకు సంబంధించిన లావాదేవీలను కోటరీ మంత్రులే చక్క బెట్టడంలోని
ఆంతర్యం ఏమిటి.
నాలుగోది.. రాజధాని నిర్మాణం కేంద్రం భరిస్తామని
విభజన చట్టంలో స్పష్టం గా చెప్పారు. ఇందుకోసం రూ. 1850 కోట్లకు పైగా విడుదల
చేశారు. అయినా కేంద్రాన్ని పక్కన పెట్టేసి మరీ సింగపూర్ కంపెనీలతో
నిర్మాణాలు ఎందుకు. అసలు కేంద్ర నిధుల్ని ఉపయోగించుకోక పోవటానికి కారణం
ఏమిటి.
అయిదోది.. రాజధాని నిర్మాణం కు సంబంధించిన కీలక
నిర్ణయాల్లో ఎక్కడా ప్రతిపక్షాల్ని సంప్రదించకుండా, చివరలో శంకుస్థాపన
దగ్గర మాత్రం అందరినీ కలిపేసుకొని హడావుడి చేయటంలోని ఆంతర్యం ఏమిటి.
అక్రమాలకు అందరి ఆమోద ముద్ర వేయించేసుకోవాలని ఆరాట పడటమే కదా.
అందుకే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజల తరపున ప్రశ్నలు లేవనెత్తి శంకుస్థాపన కు దూరంగా ఉండిపోతున్నారు. 
Back to Top