వైఎస్ జగన్ పవర్ ఫుల్ కామెంట్స్

హైదరాబాద్ః
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చంద్రబాబు సర్కార్
పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఐదు రోజుల అసెంబ్లీ సమావేశాల
తీరుతెన్నులపై వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ...ప్రభుత్వ నిరంకుశ వైఖరిని
ఎండగట్టారు. ప్రజాసమస్యలపై చర్చ జరగకుండా అడ్డుపడడం, మైక్ కట్ చేయడం,
నింబధనలకు విరుద్ధంగా రోజాను సస్పెండ్ చేయడం, ప్రతిపక్షం లేకుండా చేసి
ఇష్టానుసారంగా బిల్లులు ఆమోదింపజేసుకోవడం,  స్పీకర్ అధికార పార్టీకి
కొమ్ముకాయడం వంటి అంశాలపై వైఎస్ జగన్ మీడియా ముఖంగా మాట్లాడారు.

జననేత ఏమన్నారంటే.....
ప్రధాన అంశం కాల్ మనీ సెక్స్ రాకెట్ పై చర్చకు పట్టుబడితే అడ్డుకున్నారు
టాపిక్ డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు అంబేద్కర్ పేరు వాడుకోవడం సిగ్గుచేటు
కీచకుల సామ్రాజ్యంగా కాల్ మనీ, సెక్స్ రాకెట్ అంశం
ఆడవాళ్ల మాన ప్రాణాలతో ఆడుకున్నారు
చంద్రబాబు ఆశీస్సులతో కాల్ మనీ సెక్స్ రాకెట్ ఆగడాలు
బాబు దీవెనలతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసు అధికారులు ఇందులో భాగస్వామ్యం అయ్యారు
బాబు కనుసన్నల్లో సెక్స్ రాకెట్ జరుగుతోంది కాబట్టి కామ సీఎం, సెక్స్ రాకెట్ సీఎం అన్నాం
కావాలనే కక్షగట్టి రోజాను అన్యాయంగా సంవత్సరం సస్పెండ్ చేశారు
ప్రజలు సభను చూస్తున్నారనే ధ్యాస లేకుండా తిట్లపురాణం
బిల్లులపై చర్చలు జరిగితే ప్రజా ఆమోదం తెలుస్తుంది.
ప్రతిపక్షం లేకుండానే ఇష్టమొచ్చినట్లు 8 బిల్లులను ఆమోదించేశారు
అసెంబ్లీ సమావేశాలు కేవలం 5 రోజుల పాటు జరిపి టీడీపీ ప్రభుత్వం చేతులు దులుపుకుంది 
ప్రజాసమస్యలు చర్చించేందుకు కనీసం 15 రోజులైనా సమావేశాలు జరపాలని బ్రతిమిలాడుకోవాల్సిన పరిస్థితి 
టైంపాస్ కోసం ఈరకంగా అసంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే విలువ ఉంటుందా
ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగానే సమవేశాలను బాయ్ కాట్ చేశాం
మనిషి అన్నాక చీము, నెత్తురు, సిగ్గు ఉండాలి
అబద్ధాలు, మోసాలు, మభ్య పెట్టడాలు, వెన్నుపోటు పొడవడాలు చంద్రబాబుకే చెల్లుతుంది
చంద్రబాబు లాండ్, సాండ్, లిక్కర్, సెక్స్ రాకెట్ మాఫియాలకు పాల్పడుతూ రాక్షస పాలన సాగిస్తున్నారు
చంద్రబాబు పాలనతో విసిగెత్తిపోయాం 
Back to Top