వైఎస్ జగన్ టాప్ టెన్ పవర్ ఫుల్ కామెంట్లు

పరకాల: వరంగల్ జిల్లా లో ఎన్నికల ప్రచారం చేస్తున్న జన నేత, వైఎస్సార్సీపీ
అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రసంగానికి అపూర్వ స్పందన కనిపిస్తోంది. పరకాల లో బహిరంగ
సభ లో ఆయన విపులంగా మాట్లాడారు. ఆయన పవర్ ఫుల్ గా చేసిన కామెంట్లు చూద్దాం..

1. ఒక ఎంపీ కి మంత్రిపదవి
ఇప్పించేందుకు ఎన్నికలు వచ్చిపడ్డాయి. ఇదే జిల్లా లో ఇద్దరు దళితులు ఎమ్మెల్యేలుగా
ఉన్నారు. వాళ్లను కాదని మరో నాయకుడికి మంత్రి పదవి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి
కేసీయార్ సరదా పడ్డారు. ఈ సరదా ఫలితమే ఈ ఎన్నికలు.

2. 18 నెలల కాలం గడిచిపోయింది.
ఈ 18 నెలల పరిపాలన ఎలా జరిగిందో గుర్తు చేసుకోండి. ఒక్క ఈ జిల్లాలోనే 150 రైతులు
ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఇంతమంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకొన్నారు అని
ముఖ్యమంత్రి కేసీయార్ ని అడగండిః

3. దివంగత నేత వైఎస్ రాజశేఖర్
రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7,500 పైగా పత్తి ధర పలికింది. ఇప్పుడు మూడున్నర
వేలు కూడా పలకటం లేదు.

4. దివంగత నేత వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు 20
లక్షల 60 వేల ఎకరాల భూములు  పేదలకు పంచారు.
కానీ, కేసీయార్ పాలనలో అందరికీ అన్ని కలిపి 16 వందల ఎకరాలు కూడా పంచలేదు.

5. ఆరోగ్య శ్రీ పెట్టి 8,9 సంవత్సరాలు అవుతున్నా
ఒక్క కొత్త అంబులెన్స్ లను ఎందుకు కొనలేక పోయారు అని అడగండి. అదే పాత అంబులెన్స్
లు . కనీసంటైరు మార్చటానికి కూడా దిక్కు లేదు.  

6. 2014..15 సంవత్సరానికి గాను ఫీజురీ ఇంబర్సు
మెంట్ 2,450 కోట్లు అయితే ఇప్పటికీ 1,530 కోట్ల బకాయిలు ఉంచేశారు.  

7. ఈ ఎన్నికల్లో కేసీయార్ కు
ఓటు వేస్తే మన పరిపాలన భాగుంది అనుకొని మనల్ని పట్టించుకోకుండా వదిలేస్తారు. అందుకని
ఓటేయకుండా ఆపితే, సరిదిద్దుకొనే అవకాశం కలుగుతుంది.

8. కాంగ్రెస్ పార్టీది పనికి
మాలిన పార్టీ. అవసరం అయితే కాంగ్రెస్ పార్టీకి దండలువేస్తారు. అవసరం తీరితే బండలు
వేస్తారు. కాంగ్రెస్ పార్టీ ని బతికించేందుకు వైఎస్సార్  జీవితాంతం కష్టపడ్డారు. కానీ, ఆయన కుటుంబంపై
కాంగ్రెస్ పార్టీ విశ్వాసం చూపించలేదు.  

9. టీడీపీ పరిపాలన మొత్తం
మోసం, దగా, అబద్దాలు అనే మూడింటి చుట్టూ తిరుగుతున్నాయి. తెలుగుదేశం నాయకుల
పరిస్థితి ఇలా ఉంది. ఆ పార్టీ మద్దతు ఇస్తున్న బీజేపీ గురించి చూడండి.  18 నెలలు అయింది బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది.
ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని అడిగితే సమాధానం దొరకదు.

10. అందుచేత నిజాయితీ ఉన్న పార్టీ, ఓట్లు అడిగే ధైర్యం ఉన్న
పార్టీ ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే. ప్రతీ ఇంటికి , ప్రతీ మనిషికి, ప్రతీ
తాలూకాకు, ప్రతీ జిల్లాకు మంచి చేసిన ఘనత వైఎస్సార్ గారికి దక్కుతుంది.  దివంగత వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తున్న
వైఎస్సార్సీపీ కి ఓట్లేయమని కోరుతున్నా.

Back to Top