విజయవాడ: రైతుల తరపున భూ సేకరణకు వ్యతిరేకంగా జరిగిన ధర్నాలో మాట్లాడిన వైఎస్ జగన్ పవర్ ఫుల్ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేస్తున్న కుయుక్తుల్ని ఎండగట్టారు. అందులో కొన్ని..రాజధాని ప్రాంతంలో పచ్చని భూములు లేవట. రెండు వేల ఎకరాలు మాత్రమే పంట, మిగిలినవి మామూలే భూములే అంటారు. సాక్షాత్తు ప్రభుత్వమే అబద్దాలు చెబుతోందిమనసున్నవాడు ముఖ్యమంత్రి కావాలి. భూ బకాసురుడు ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబూ..! అధికారం ఎల్లకాలం మీ దగ్గరే ఉండదు. మీ ప్రభుత్వం పోతుంది. రెండు, మూడేళ్లకు పోతుంది. బంగాళాఖాతంలో కలుస్తుంది.వచ్చేది మా ప్రభుత్వమే. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే భూముల్ని పూలల్లో పెట్టి వెనక్కి ఇచ్చేస్తాం.చంద్రబాబు పాలన అంతా మోసం.. మోసం.. అన్నమూడక్షరాల మీద నడుస్తోంది. ప్యాకేజీ ఇస్తే చాలు అంటూ సరిపెడుతున్నారు. అన్నీ విభజన చట్టంలోనివి రాసి చూపిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టారు. కోట్లు ఇవ్వచూపుతూ ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయాడు చంద్రబాబునుదుటి రాత రాసేది దేవుడు. ఇది రాసి ఉంటే చంద్రబాబు కాదు కదా వాళ్ల నాయన కూడా ఆపలేడు ఆ స్థానంలో కూర్చోవడానికిబంద్ ను వ్యతిరేకించేందుకు నానా కుయుక్తులు చేస్తారు. అరెస్టులు చే్స్తారు. ప్రజలే ముందుకు వచ్చి బంద్ ను విజయవంతం చేయాలి.