సిగ్గుమాలిన ప్రభుత్వానికి కళ్లు తెరిపించేందుకే..!

రాష్ట్రంలో దుష్టపాలన సాగుతోంది..!
చంద్రబాబు నీ గుండెల్లో నిద్రపోతాం..!

గుంటూరుః చంద్రబాబు అప్రజాస్వామికంగా, రాష్ట్రంలో దుష్టపాలన కొనసాగిస్తున్నారని  వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రత్యేకహోదా సాధన కోసం వైఎస్ చేపట్టనున్న దీక్షను అడ్డుకుంటే చంద్రబాబుకు రాజకీయ దహనం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రానికి ఆవశ్యమైన ప్రత్యేకహోదాను పక్కనబెట్టి, తన హోదా పెంచుకునేందుకు చంద్రబాబు పాకులాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేకహోదా సంజీవని కాదంటూ చంద్రబాబు మాట్లాడడం దారుణమన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్ దీక్ష చేసి తీరుతారని బొత్స స్పష్టం చేశారు. చంద్రబాబు ఖబడ్దార్ ..హోదా వచ్చేవరకు నీగుండెల్లో నిద్రపోతామని బొత్స ఉద్విఘ్నంగా మాట్లాడారు. 

హోదాను తాకట్టుపెట్టారు..!
స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు ప్రత్యేకహోదాను తాకట్టుపెడుతున్నారని బొత్స ఫైరయ్యారు. సిగ్గుమాలన టీడీపీనేతలకు కళ్లు తెరిపించేందుకు వైఎస్ జగన్ దీక్ష చేపడుతున్నారని అన్నారు. తమ కోసం చేస్తున్న దీక్ష కాదని, ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర భవిష్యత్ కోసం చేస్తున్న దీక్ష అన్నవిషయాన్ని చంద్రబాబు గుర్తించాలన్నారు.  

జగన్ కు భయపడే..!
ప్రత్యేకహోదా వస్తే వైఎస్ జగన్ కు పేరొస్తుందన్న దురుద్దేశ్యంతోనే చంద్రబాబు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. హోదా సాధించేవరకు విశ్రమించబోమన్నారు. చట్టబద్ధంగా,  ప్రజల తరుపున ప్రత్యేకహోదా కోసం పోరాడి హోదాను సాధించుకుంటామన్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెండలు వంచుతామన్నారు.  చంద్రబాబు శాశ్వత సీఎం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఒటెెంద్దు పోకడలకు పోతే ప్రజలే  తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 
Back to Top