వైఎస్ జగన్ దీక్ష .. ఒక నిశ్శబ్ద విప్లవం...!

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు అంతకంతకూ మద్దతు పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ నలు చెరగులా ఒక నిశ్శబ్ద విప్లవానికి తెర లేస్తోంది.
మొదట్లో ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ చేస్తున్న ప్రజా పోరాటం అనుకొన్నారు. కానీ, చాలా స్పష్టంగా ప్రత్యేక హోదా అన్నది ఒక సంజీవని, దాని కోసం వైఎస్సార్సీపీ మాత్రమే పోరాడుతోంది అన్న విషయం ప్రజలకు అర్థం అవుతూ వస్తోంది. దీంతో  ప్రజల్లో చైతన్యం వస్తోంది. ముఖ్యంగా హోదా అన్నది కేంద్రం ఇచ్చే భిక్ష కాదని, అది మన హక్కు అని తెలిసినా చంద్రబాబు వ్యక్తిగత స్వార్థం కోసం మభ్య పెడుతున్న తీరు అందరికీ తెలిసి వస్తోంది.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నలు చెరగులా రిలే నిరాహార దీక్షలు, ఊరేగింపులు ఊపందుకొన్నాయి. జనం కోసం జన నేత చేస్తున్న పోరాటానికి మద్దతు పలుకుతున్నారు. ఇప్పటికే వామపక్ష పార్టీలు తమ మద్దతు ప్రకటించాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు స్వయంగా దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. అటు సీపీఐ కార్యదర్శి రామక్రష్ణ దీక్ష విషయంలో చంద్రబాబు నిర్వాకాన్ని ప్రశ్నించారు. ఎమ్మార్పీఎస్ అగ్రనేత మంద క్రష్ణ స్వయంగా దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. ఇటు రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ముఖ్యంగా యువజన సంఘాలు స్వచ్చందంగా వచ్చి జగన్ దీక్షకు సంఘీభావం చెబుతున్నాయి. 

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అన్న పోరాటం అప్పటి తరం వాళ్లకు గుర్తుకొని వస్తోంది. అందుకే ప్రజల తరపున జరగుతున్న ఈ పోరాటానికి అన్ని వర్గాల నుంచి మద్దతు వ్యక్తం అవుతోంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top