ఈ తరం నాయకుడు .. వైఎస్ జగన్

గుంటూరు: గుంటూరు వేదికగా ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్షకు దిగిన ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ .. ఈ తరం నాయకుడిగా నిలిచారు. ప్రత్యేక హోదా మీద దీక్ష ప్రారంభించటంతోనే యువతరం ఆశయాల్ని సాకారం చేసేందుకు శ్రీకారం చుట్టారు.

ప్రత్యేక హోదా వేదిక మీద నుంచి వైఎస్ జగన్ ఉధ్రతంగా ప్రసంగించారు. గుంటూరు అంటూ అక్కడ ప్రజల్ని ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. అదే ఒరవడితో ప్రత్యేక హోదాతో విద్యార్థులు, యువతకు వచ్చే ప్రయోజనాల్ని విడమరిచి చెప్పారు. ఈ తరం ప్రజల కోసమే ఈ ప్రయత్నం అని చాలా స్పష్టంగా చెప్పారు. అంతే కాకుండా ఈ తరం పిల్లల కోసం ఎంత దాకా అయినా పోరాటానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు.

చంద్రబాబు చేస్తున్న మోసాల్ని ప్రజలతోనే చెప్పించారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామంటూ చేసిన మోసాల్ని సభికులతోనే చెప్పించారు. దీంతో యువత అంతా ఆయన వెంట ఉన్నట్లుగా స్పష్టంగా అర్థం అయింది. అదే సమయంలో ప్రత్యేక హోదా రాకుండా చంద్రబాబు ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తున్నదీ విడమరిచి చెప్పారు. అంతిమంగా ఇవన్నీ తెలిస్తే బాబు కాలర్ పట్టుకోవటం ఖాయమంటూ ఆయన తెలుగుదేశం శ్రేణుల్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు. మన వాళ్లు బ్రీఫ్ డ్ మీ అంటూ ఏ రకమైన ఇంగ్లీష్ మాట్లాడుతున్నారో అంటూ సభ ద్రష్టికి తెచ్చినప్పుడు హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. 
Back to Top