13 జిల్లాల ప్రజల గొంతుక వైఎస్ జగన్...!

పచ్చిమిరప తిన్నట్లు మంటెత్తిపోతున్నరు..!
నాయకులా,రాబంధుల సంతతా..!
దమ్ముంటే పదవులు వదిలి పోరాడు..!
గుంటూరుః ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతుంది. వైఎస్ జగన్ కు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు , అభిమానులు, ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు, న్యాయవాదులు, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ తండోపతండోలుగా దీక్షా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్న జననేతకు బాసటగా నిలుస్తున్నారు. పార్టీ నేతలు జగన్ వెన్నంటే ఉండి ప్రత్యేకహోదా ఆకాంక్షను చాటిచెప్పుతున్నారు. ఈసందర్భంగా వారు  మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. 

వాసిరెడ్డి పద్మ..
పచ్చనేతలపై వైఎస్సార్సీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేబినెట్ లో ఉన్నది మంత్రులు కాదని స్వార్థపరుల గుంపు అని మండిపడ్డారు. మట్టి నుంచి ఇసుక దాకా అంతటా అవినీతికి పాల్పడుతున్న టీడీపీ నేతలు నాయకులా,రాబందుల సంతతా అని పద్మ విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రజావ్యతిరేకి, రైతు, మహిళా వ్యతిరేకని దుయ్యబట్టారు. ఏపీని సింగపూర్ కు రియల్ ఎస్టేట్ భూమిగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 13 జిల్లాల ప్రజల గొంతుక వైఎస్ జగన్ దీక్షాశిబిరం అని వాసిరెడ్డి పద్మ అన్నారు. ప్రత్యేక హోదా సాధించలేక పోతే చంద్రబాబు ప్రభుత్వం సచ్చినట్లే లెక్కని విమర్శించారు. వైఎస్ జగన్ దీక్ష విజయవంతమవుతుంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రోజా..
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంటే టీడీపీ నేతలు పచ్చి మిరపకాయలు తిన్నట్లు మంటెత్తిపోతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. తమ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన దీక్ష చూసి పచ్చ నేతలు వణుకుతున్నారని రోజా విమర్శించారు. ప్రత్యేక హోదా అంటే చంద్రబాబుకు జైలు గుర్తుకొస్తుందని ఎత్తిపొడిచారు.  అసలు ప్రత్యేక హోదాపై టీడీపీ నేతలు అనుకూలమో లేక వ్యతిరేకమో చెప్పే దమ్ము ధైర్యం లేవన్నారు. కుట్ర అనే పదం చంద్రబాబు పేటెంట్ గా రోజా అభివర్ణించారు. జగన్ దీక్షపై విమర్శలు చేస్తున్నచంద్రబాబు భజన టీం రావెల కిషోర్ బాబు, ప్రత్తిపాటి , కామినేని, గంటాలపై రోజా తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. జగన్ దీక్ష ఆపాలని చూస్తున్న బాబు తరం కాదుకదా ఆయన బాబు తరం కూడా కాదని రోజా  స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా తీసుకువచ్చే వరకు టీడీపీ నేతలను గ్రామాల్లో అడుగుపెట్టనీయవద్దని  రాష్ట్ర ప్రజానీకానికి రోజా విజ్ఞప్తి చేశారు.

భూమన కరుణాకర్ రెడ్డి..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఓటుకు కోట్లు కేసు భయం పట్టుకుందని వైఎస్ ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆ భయం వల్లే చంద్రబాబు కేంద్రంపై ప్రత్యేక హోదా విషయంలో ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారని ఆరోపించారు. తరుచూ ఢిల్లీకి వెళుతున్న బాబు ప్రత్యేక హోదాపై మాత్రం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్ పై టీడీపీ మంత్రులు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రాణాలు కూడా లెక్కచేయకుండా ఉద్యమిస్తున్న జగన్ పై చేతిగాని తనం వల్లే నిందలు వేస్తున్నారని చెప్పారు. దమ్ముంటే కేంద్రంలో మంత్రి పదవులు వదిలి ప్రత్యేక హోదాపై పోరాడాలని సవాల్ విసిరారు.

విశ్వేశ్వర్ రెడ్డి...
ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్న వైఎస్ జగన్ దీక్షకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈసందర్భంగా ప్రభుత్వంపై విశ్వేశ్వర్ రెడ్డి నిప్పులు చెరిగారు. రైతులను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని అన్నారు. కార్పొరేట్ సంస్థలను, బడా కాంట్రాక్టర్లను మాత్రమే చూస్తున్న ప్రభుత్వం రైతులను మాత్రం పక్కకు పెట్టేసిందని చెప్పారు. కార్మికులు రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారారని ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతుంది. ప్రతిసారి పరిశ్రమల గురించి, పారిశ్రామిక వేత్తల గురించి మాట్లాడే ప్రభుత్వానికి పేదలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వారికి ఇప్పటి వరకు ఒక్క ఇళ్లయినా ఇచ్చారా అని నిలదీశారు.

ఆళ్ల రామకృష్ణారెడ్డి..
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీ సాక్షిగా చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని ఇప్పటి వరకు కేంద్రానికి పంపించలేదని రామకృష్ణారెడ్డి అన్నారు. దానిని మోదీ ప్రభుత్వానికి పంపించకుండా అసెంబ్లీ పెట్టెల్లో దాచి పెట్టారని విమర్శించారు. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుపోయి చంద్రబాబు స్వార్థప్రయోజనాల కోసం హోదాను మోడీ వద్ద తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. 



Back to Top